వర్గాలు, టాగులు, లేబుళ్ళు

పెరుగుతున్న బ్లాగులన్నింటినీ చదవేందుకు మనకి సమయం చిక్కదు. ప్రస్తుతం మనం చదివే టపాలు మొత్తం టపాల్లో 80 శాతం వరకు ఉంటే, భవిష్యత్తులో మనం చదవనివే 95% ఉంటాయి. మనకి నచ్చిన లేదా ఆసక్తి ఉన్న టపాలని ఎంచుకోడానికి టాగులు ప్రధాన మార్గంగా మారుతాయి. కనుక మీ టపాలకి టాగులు తగిలించండి.

మీరు ఏ బ్లాగుడు సేవని వినియోగిస్తున్నా దానిలో టపాలను వర్గీకరించుకునే (టాగులు లేదా లేబుళ్లు తగిలించే) సదుపాయం తప్పకుండా ఉంటుంది. ఈ టాగులు ఎందుకు, వాటి వల్ల ప్రయోజనాలు, టాగులు ఇవ్వడంలో ఇబ్బందులు, వీటిని మరింత ఉపయోగకరంగా మలచుకోవడం లాంటి విషయాలను ఈ టపాలో చర్చిస్తున్నాను. మీ అభిప్రాయాలను, ఆలోచనలను కూడా ఆహ్వానిస్తున్నాను.

చదవడం కొనసాగించండి

ప్రకటనలు

మరో బ్లాగు తుఫాను సూచన?

 1. ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?
 2. తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి
 3. ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్
 4. ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య
 5. [పాత బంగారం] వార్తల్లో విప్లవం – ఇందిరమ్మ టీవీ

ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు:

 • ఇందిరాబాద్
 • రాహుల్‌గూడ
 • ప్రియాంక నగర్
 • రాజీవ్ పేట

రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా నానికి కీడుచేసే యంత్రాంగం

పది అత్యుత్తమ తెలుగు బ్లాగులు

తెలుగు బ్లాగులలో మీకు నచ్చిన పది అత్యుత్తమ బ్లాగులు ఏవి? మీకు పది తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, యాభై ఎన్నైనా రాయండి. మీ బ్లాగులో రాసి ఆ లింకు ఇక్కడిచ్చినా పర్వాలేదు. కావలిస్తే కూడలిలోని బ్లాగుల జాబితా సహాయం తీసుకోండి.

(ఆందరి జాబితాలు కలిపగా వచ్చిన మహాజాబితాలోని బ్లాగులని కూడలిలో ప్రత్యేకంగా, ప్రముఖంగా చూపించాలని నా ఉపాయం. ప్రాచుర్యమైన టపాలు ప్రముఖంగా చూపించడం ఆపై వచ్చే నవీకరణలో.)

కొన్ని నియమాలు (క్రింద ఇచ్చిన నాకు నచ్చిన బ్లాగులును దాదాపుగా వీటిపైనే నిర్ణయించా):
చదవడం కొనసాగించండి

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

కూడలిని నేను ప్రకటించి ఈరోజుకి ఏడాది అయ్యింది! ఈ ఏడాదిలో గొప్ప విశేషం నూతన సంవత్సర కానుకే! మీ అందరి ఆదరణకు కృతజ్ఞతలు.

అన్నట్టు ఇది నా వందో టపా. నా పాత టపాలనుండి కొన్ని:

మనమెక్కడ?

 Telugu

బొమ్మే చెప్పేస్తుంది కథంతా. (బొమ్మ మే 22న తీసింది. తాజా ధోరణి చూడండి.)

తెలుగు వికీపీడియా (Telugu Wikipedia) మరియు తెలుగు బ్లాగులు (Telugu Blogs) ఉన్నాయని చాలామందికింకా తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటే, కనీసం అట్టడుగునైనా ఉండేవి కదా. Keep spreading!

బ్లాగు (మితిక)

కంగారుపడకండి మితిక అంటే మినీ కవిత. అదెలా అంటారా, అదంతే!

సుమనుడికి ఈ-టీవీ బ్లాగు
రాజకీయులకు అసెంబ్లీ బ్లాగు
లేనిదెక్కడ జగమున బ్లాగు
పెక్కు రూపముల కలదీ బ్లాగు

బ్లాగులందు ఫొటో బ్లాగులు వేరయా!

నేటి నుండి కూడలిలో ఫొటో బ్లాగుల కోసం ప్రత్యేక పేజీ. మీకు తెలిసిన ఫొటో బ్లాగులు (తెలుగువారివి మాత్రమే) ఉంటే తెలియజేయండి.

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

గమనిక: ఫైర్‌ఫాక్స్ 3 మరియు ఆపైన వెర్షనులలో ఈ సమస్య లేదు.

మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం.

మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ పేజీని IEతో చూపిస్తుంది. రెండవ పరిష్కారం కొన్నిసార్లు దైవాదీనం కావచ్చు. ఈ రెండూ కాకుండా, ఫైర్‌ఫాక్స్‌తోనే ఆ జస్టిఫై వచనాన్ని సరిచేసుకోగలిగితే బాగుంటుంది కదా.

అందుకే నేనో పిల్ల బుక్‌మార్కుని తయారుచేసా. దాని పేరు… ఆ unjustify. దీన్ని మీ బుక్‌మార్కు బారులో పెట్టుకొని, జస్టిఫై వచనమున్న తెలుగుపేజీ ఎదురైనప్పుడు దీనిమీద ఓ నొక్కు నొక్కితే చాలు. ఆ పేజీలోని వచనం మీరు చదివేందుకు వీలుగా మారుతుంది.

ఎలా వాడాలి?

 1. ఈ పేజీలోని unjustify లంకెని బుక్‌మార్కు బారు లో చేర్చుకోండి.unjustify
 2. జస్టిఫై చేసిన వచనమున్న ఒక వెబ్‌సైటుకి వెళ్ళండి.
 3. ఇందాక చేర్చుకున్న బుక్‌మార్కు మీద ఓ నొక్కు నొక్కండి.
 4. జుస్టిఫైడ్ వచనం సరి అవుతుంది.

ఇక మీరు ఫైర్‌ఫాక్స్ సౌఖ్యంతోనే తెలుగు పేజీలని చదవవచ్చు.  ఏమైనా ఇబ్బందులుంటే తెలుగుబ్లాగు సమూహానికి రాయండి. నేను బదులిస్తా.

(అన్నట్టు మీరోటి గమనించారా, కూడలిలో ఈ సమస్య రాకుండా నేను సరిచేసా.)

తాజాకరణ 2007-02-19: ఇప్పుడు WordPress.com బ్లాగులలో కూడా పనిచేస్తుంది. (మీ వర్డుప్రెస్ బ్లాగు థీమ్ justifed text లేదా/మరియు letter-spacing ని వాడుతుంటే ఫైర్‌ఫాక్స్ ని ఉపయోగించే మీ బ్లాగు సందర్శకులకి Unjustify ని వాడమని సూచించండి.)

కూడలిలో బ్లాగుల జాబితాలు సిద్ధం

వెంకట రమణ: కూడలిలో “149 తెలుగు బ్లాగులనుండి సంగ్రహం” అని ఉంది కదా, దాన్ని నొక్కగలిగే విధంగా మార్చి, బ్లాగుల జాబితాకి అనుసంధానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విదంగా వ్యాఖ్యలు వార్తలు మెదలయిన వాటిలో కూడా ఆయా జాబితాలను చూపిస్తే బాగుంటుంది. పూర్తయింది!