డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

వచ్చే ఆదివారమే తెలుగు బ్లాగుల దినోత్సవం!

తెలుగు బ్లాగుల దినోత్సవం — డిసెంబర్ రెండవ ఆదివారం

ఆ రోజున హైదరాబాదులో ఉండే వారు e-తెలుగు యొక్క తేనీటి విందులో పాల్గొనవచ్చు.

ఈ సారి మీరేంచేస్తున్నారు?

ప్రకటనలు

డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

తెలుగు బ్లాగరులందరికీ ముందస్తు తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!!

ఈ బ్లాగు పండుగని ఎలా జరుపుకోవాలో కొన్ని సలహాలును నా పాత టపాలో చూడండి.

పై బొమ్మని మీ బ్లాగుల్లో ఉపయోగించుకోడానికి ఈ చిరునామాలను ఉపయోగించండి:

తా.క.: మీరు హైదరాబాదులో ఉంటే, e-తెలుగు సమావేశంలో మాతో కలవండి. లేదా భారతకాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు కూడలి కబుర్లులో పాల్గొనండి.

మీ బ్లాగుకి వచ్చే అన్వేషణల్లో తెలుగు కీలకపదాల శాతం ఎంత?

ఇటీవల గూగుల్ ట్రెండ్స్‌లో ‘telugu’ మరియు ‘తెలుగు’ ల అన్వేషణల ధోరణి చూసాను. (క్రింది చార్టు చూడండి.) ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది తెలుగు అక్షరాలలో అన్వేషణ గురించి. గత సంవత్సర కాలంగా చెప్పుకోదగ్గ (అంటే గూగుల్ వాడు గుర్తించి ట్రెండ్స్‌లో చేర్చదగినన్ని) అన్వేషణలు జరుగుతున్నాయన్న మాట. 2009 ఏప్రిల్ తర్వాత ఎర్రగీత కొంచెం పైకి చూస్తుంది కదూ. లేక నాకే అలా అనిపిస్తుందేమో ;). తెలుగు అక్షరాలలో ప్రస్తుతం వెతకగలుగుతునప్పటికీ, వెతుకుతున్నవారు తక్కువేనేమో.

Google Trends for Telugu
“మీ బ్లాగుకి వచ్చే అన్వేషణల్లో తెలుగు కీలకపదాల శాతం ఎంత?” ‌చదవడం కొనసాగించండి

తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి

గమనిక: ఈ టపా నా డ్రాఫ్టులలో సంవత్సరం పైనుండే ఉంది. దీన్ని పూర్తిచేయలేక ఇలానే ప్రచురించేస్తున్నాను. ఈ జాబితా పాక్షికం!

ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో స్థానికాంశాల గురించి అక్కడి సమస్యల గురించి రాయడం పెరుగుతూంది. ఇదో మంచి పరిణామం. నాకు తటస్థించిన అటువంటి కొన్ని బ్లాగులు:

“తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి” ‌చదవడం కొనసాగించండి

బ్లాగోగులు

గమనిక: చాలా రాద్దామనుకునే దీన్ని మొదలు పెట్టాను. కానీ దీనిపై సమయం వెచ్చించలేకపోతున్నాను. మొదలు పెట్టిన ఈ టపాని ఇలాగే ప్రచురించేస్తున్నాను. కానీ నేనిచ్చిన లింకులు మంచి సమాచారాన్ని అందిస్తాయి.

XKCD - Duty Calls

XKCD by Randall

 • శోధన సుధాకర్ తెలుగీకరించిన బ్లాగర్ల ప్రవర్తనా నియమావళిని చూడండి.
 • బ్లాగుల్లో స్పందనలపై రానారె క్షణికమ్
 • Core Rules of Netiquette
 • New Game, Old Rules
 • కొత్తపాళీ బాగా చెప్పారు:

  బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.

ఆనంద బ్లాగాయనం!

డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

తెలుగు బ్లాగుల దినోత్సవంఅంటే, ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన. మీ ఊళ్ళో/నగరంలో/పట్టణంలో ఆ రోజు తెలుగు బ్లాగరుల సమావేశాన్ని నిర్వహించండి. మీరు హైదరాబాదులో ఉంటున్నట్లయితే, మాతో కలవండి.

ఏమేంచెయ్యొచ్చు:

 • అందరూ కలిసి ఏదైనా సామాజిక ప్రయోజనమున్న పని చేయవచ్చు.
 • బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవచ్చు.
 • అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
 • లేదా, జాలంలో తెలుగుకై మరింత గంభీరమైన పనులూ చెయ్యవచ్చు:

ఎలా:

 1. మీ ప్రాంతంలో ఉంటున్న బ్లాగరులెవరో తెలుసుకోండి. లేదా మీ ఊళ్ళో సమావేశం నిర్వహిద్దామనుకుంటున్నట్టు, తెలుగు బ్లాగు గుంపులోనూ, మీ బ్లాగులోనూ ప్రకటించండి. స్థలం మరియు సమయం నిర్ణయించి తెలియజేయండి.
 2. మిమ్మల్ని సంప్రదించగలిగే సమాచారం (ఫోను నంబరు, ఈ-మెయిలు చిరునామా, గట్రా) తెలియజేయండి.
 3. ఆ రోజు అనుకున్న స్థలంలో అనుకున్న సమయానికి అందుబాటులో ఉండండి.
 4. సమావేశం తర్వాత సమావేశం ఎలా జరిగిందీ వివరాలతో మీ బ్లాగులో టపా వ్రాయండి.

డిసెంబర్ రెండవ ఆదివారమే ఎందుకు:

 • 2007 డిసెంబరు నెల 13వ తేదీన తెలుగు బ్లాగు గుంపులో సభ్యుల సంఖ్య 1,000కి చేరుకుంది. ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఆదివారాలు అయితే జనాలకి ఖాళీ ఉంటుందని.
 • ప్రతీ నెలా రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల సమావేశం ఉంటుంది. మళ్ళీ బ్లాగుల దినోత్సవం కోసం ప్రత్యేక సమావేశం అవసరం లేకుండా, అదే రోజునైతే బాగుంటుందని.

పైన నేనుదహరించిన బొమ్మను మీ బ్లాగుల్లో వాడుకోవచ్చు.

తా.క.: హైదరాబాదు సమావేశపు నివేదికని e-తెలుగు సైటులో ప్రచురించాం.

ఆనంద బ్లాగాయనం!

కూడలి దృక్పథం

ఈ టపాకి నేపధ్యం ఈపాటికి మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా, కూడలి గురించిన ప్రాముఖ్య విషయాలను ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. కూడలి గురించి ఆసక్తి ఉంటే ఈ టపా మీకు ఉపయోగపడుతుంది.

“కూడలి దృక్పథం” ‌చదవడం కొనసాగించండి