ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా?

కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది.
చదవడం కొనసాగించండి

ప్రకటనలు

ఓ వర్డ్‍ప్రెస్ చిట్కా: టపా రాసే పెట్టె ఎత్తు

మీ వర్డ్‍ప్రెస్ బ్లాగులో టపా రాసేప్పుడు ప్రతీ సారీ టపా పెట్టె ఎత్తు పెంచుకోవాల్సి వస్తుందా? పెంచుకోవాల్సిరావచ్చు. ఎందుకంటే, డీఫాల్టుగా ఆ పెట్టె యొక్క ఎత్తు కేవలం 10 లైన్లు ఉంటుంది. చదవడం కొనసాగించండి

వెబ్ చిరునామాలను ముద్రణా మాధ్యమాలలో ఎలా ఇవ్వాలి?

పాత్రికేయులకు మరియు విలేఖరులకు, (ముద్రణా రంగంలో లేదా జాలానికి బయట వెబ్ చిరునామాలు ఇచ్చేవారికి)

వివిధ వ్యాసాలలో, కథనాలలో, వార్తలలో వెబ్ చిరునామాలను వాడుతుండవచ్చు. వెబ్ చిరునామాలో చిన్న తప్పు దొర్లినా మీ పాఠకులు ఆ వెబ్ సైటుని చేరుకోలేకపోవచ్చు. ఆవిధంగా, మీ వ్యాసపు/కథనపు ఫలితమే లేకుండా పోయే అవకాశం ఉంది.  అందువల్ల మీ పత్రికపై విశ్వాసం (కనీసం సాంకేతిక అంశాలకు సంబంధించి) సన్నగిల్లే అవకాశాలూ ఉన్నాయి.

చాలా పత్రికలలో ఇచ్చే వెబ్ చిరునామాలు తప్పుగా ఉండడం నేను చూసాను. అందుకు కారణాలు చాలా ఉండవచ్చు. పొరపాటు మీ మొదటి ప్రతి నుండి, ముద్రణలోకి వెళ్ళే చివరి పాఠ్యం వరకు ఏ దశలోనైనా జరగవచ్చు.

మీకు (లేదా ముద్రణా ప్రక్రియలో మధ్య సిబ్భందికి) అంతర్జాలానికి సంబంధిన అవగాహన లేకపోయి ఉండవచ్చు. అందువల్ల కూడా పొరపాట్లు జరగవచ్చు. వెబ్ చిరునామాలు ఇవ్వడంలో తరచూ దొర్లే పొరపాట్లను నివారించడానికి, మీరిచ్చే వెబ్ చిరునామాలు మీ పాఠకులను లక్ష్యిత వెబ్ సైట్లకి నేరుగా చేర్చేలా ఉండడానికి ఈ సూచనలు ఉపయోగపడతాయి.

చదవడం కొనసాగించండి

మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?

కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.

కూడలిలో పిచ్చి అక్షరాలు

ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:

ఫీడులో తప్పిదం 1

ఫీడులో తప్పిదం 2

వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.

ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే).

ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

యాహూ మెయిల్‌లో తెలుగు!

యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు.

నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది.

క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.

చదవడం కొనసాగించండి

[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
చదవడం కొనసాగించండి

ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) లో ఉండే చరిత్రని ఓసారి చూడడం ఉత్తమం.

మీ విహరణ చరిత్ర (browsing history) ని మీరు వాడే వెబ్ విహరిణి గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూసిన సైటు మీ విహరణ చరిత్రలో ఉండేఉంటుంది. ఈ విహరణ చరిత్రని ఫైర్‌ఫాక్స్‌లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం.
చదవడం కొనసాగించండి

ఫైర్‌ఫాక్స్ చిట్కా: అనుకోకుండా మూసేసిన ట్యాబులను తిరిగిపొందడం

మీరెప్పుడైనా ఫైర్‌ఫాక్స్‌లో అనుకోకుండా (లేదా ప్రమాదవశాత్తూ) మీక్కావాల్సిన ట్యాబుని మూసేసారా? మీరు మూసివేసిన ట్యాబుని తిరిగి పొందడం చాలా వీజీ.

  • History మెనూలో Recently Closed Tabs లో మీరు మూసేసిన ట్యాబులన్నీ ఉంటాయి.
  • లేదా, మీరు Ctrl + Shift + T అన్న కీబోర్డు షార్టుకట్టు కూడా వాడవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

ఫైర్‌ఫాక్స్ ఉపయోగిచడం నేర్చుకోండి!

learnfirefox.cybernetnews.com అనే సైటులో ఫైర్‌ఫాక్స్‌లో వివిధ అంశాలని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త హంగులని ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై సచిత్ర వివరణలతో (వీడియోలు కూడా) ఉన్నాయి. కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది.