విండోస్ 10లో మీ అభిమాన తెలుగు కీబోర్డు లేయవుటు స్థాపించుకోవడం ఎలా?

విండోస్ కంప్యూటర్లలో వివిధ లేయవుట్లలో తెలుగు టైపు చేసుకోడానికి వీలుగా కొన్ని కీబోర్డులు గతంలో తయారు చేసాను. అవి ఇన్‌స్క్రిప్ట్+, ఆపిల్ (వేరిటైప్), మాడ్యులర్. అయితే విండోస్ 10లో వీటిని స్థాపించుకోవడం వీలుకావడంలేదని నాకు పిర్యాదులు అందాయి. దీనిపై పరిశోధిస్తే తేలిందేమిటంటే, విండోస్ 10లో విండోస్ ఇన్‌స్టాలర్‌తో అప్లికేషన్లను స్థాపించుకోడాన్ని అచేతనం చేసాడు. అందువల్ల పై కీబోర్డు లేయవుట్లను (ఇతర విండోస్-ఇన్‌స్టాలర్-ఆధారిత ఉపకరణాలనూ) విండోస్ 10లో మామూలుగా స్థాపించుకోలేము. వీటిని స్థాపించుకోడానికి తాత్కాలికంగా విండోస్ ఇన్‌స్టాలర్‌తో అప్లికేషన్లను … విండోస్ 10లో మీ అభిమాన తెలుగు కీబోర్డు లేయవుటు స్థాపించుకోవడం ఎలా? ‌చదవడం కొనసాగించండి

ఐఫోనులో తెలుగు వ్రాయడం ఎలా?

ఐఫోనులో తెలుగులో వ్రాయడానికి మనకి ప్రత్యేకమైన ఆప్స్ అవసరం లేదు, ఎందుకంటే ఐఫోను కీబోర్డు ఆప్ లోనే తెలుగు ఎంచుకునే అవకాశం ఉంది. ఈ అంచెలు అనుసరించండి: 1. ఐఫోను సెట్టింగులలోకి వెళ్ళండి. సెట్టింగుల తెరలో కీబోర్డు అన్న దాన్ని ఎంచుకోండి. 2. కీబోర్డు సెట్టింగుల తెరలో కీబోర్డులు అన్న దాన్ని ఎంచుకోండి. 3. కీబోర్డుల తెర నుండి మీరు కొత్త కీబోర్డులను ఎంచుకోవచ్చు. (క్రింది తెరపట్టు తెలుగును ఎంచుకున్న తర్వాత తీసినదన్నమాట!) అంతే! ఆ తర్వాత … ఐఫోనులో తెలుగు వ్రాయడం ఎలా? ‌చదవడం కొనసాగించండి

CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి

వ్యాసంలో లేదా కథలో మొదటి అక్షరాన్ని పెద్దగా ప్రత్యేకంగా చూపించడం ముద్రణారంగంలో ఒక సాంప్రదాయం. జాలంలో కూడా ఇలా సింగారించడానికి జనాలు పలు పద్ధతులు వాడుతున్నారు, వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మొదటి అక్షరాన్ని ప్రత్యేక మార్కప్ ద్వారా గుర్తించడం. CSS ::first-letter సూడో-మూలకాన్ని అన్ని ఆధునిక జాల విహారిణులూ అమలుపరిచాకా, డ్రాప్ క్యాప్ అలంకరణకు అదే తేలిక మార్గం అయ్యింది. ఉదాహరణకు, ప్రతీ పేరాలో మొదటి అక్షరాన్ని పెద్దగా చూపించడానికి ఈ క్రింది CSS నియమాన్ని వాడుకోవచ్చు: … CSS3 & తెలుగు: డ్రాప్ క్యాప్ శైలి ‌చదవడం కొనసాగించండి

ఫైర్‌ఫాక్స్ చిట్కా: లంకె మధ్యలోని పాఠ్యాన్ని ఎంచుకోవడం

లంకె మథ్యలోని పాఠ్యాన్ని ఎంచుకోడానికి , మూషికాన్ని లాగేటప్పుడు Alt మీటను నొక్కి పట్టుకోండి. (ఫైర్‌ఫాక్స్ జాల విహారిణిలో మాత్రమే)

మీ బ్లాగు టపాలను ముందు వర్డ్‌లో వ్రాసి, కాపీ-పేస్టు చేస్తారా?

మీ బ్లాగు టపాలు ముందు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వంటి అప్లికేషన్లలో వ్రాసి తర్వాత దాన్ని బ్లాగు లోనికి కాపీ-పేస్టు చేస్తారా? అయితే, మీ కోసమే ఈ టపా! వర్డ్ నుండి కాపీ-పేస్టు చెయ్యడంవల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటో అర్థమవడం కోసం ముందుగా ఓ ప్రయోగం చేద్దాం. మీరు తయారేనా? ఒక కొత్త వర్డు డాక్యుమెంటును తెరిచి దానిలో ‘ఇది తెలుగు’ అని టైపు చెయ్యండి. తర్వాత దాన్ని ఎంచుకొని బ్లాగర్ లోనికి కాపీ చెయ్యండి. … మీ బ్లాగు టపాలను ముందు వర్డ్‌లో వ్రాసి, కాపీ-పేస్టు చేస్తారా? ‌చదవడం కొనసాగించండి

మీ సైట్లలో అందమైన తెలుగు ఖతులను ఉపయోగించుకోవడం ఎలా?

తెలుగు ఖతులకు (ఫాంట్లకు) సంబంధించినంత వరకూ గత ఏడాదికీ ఇప్పటికీ పరిస్థితి చాలా మెరుగయ్యింది. ఇప్పుడు అనేక అందమైన నాణ్యమైన తెలుగు ఖతులు ఉచితంగానే లభిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ సిలికానాంధ్ర సంస్థ కలసి మొత్తం 18 తెలుగు ఖతులను తెలుగు విజయం ప్రాజెక్టు ద్వారా అందించాయి. అలానే, సురవర వారు స్వర్ణ మరియు సంహిత అనే మరో రెండు ఖతులను ఉచితంగా అందిస్తున్నారు. వీటిని దింపుకొని మన కంప్యూటర్లలో స్థాపించుకుని మనం ఉపయోగించుకోవచ్చు. అంతే కాకుండా, వీటిని … మీ సైట్లలో అందమైన తెలుగు ఖతులను ఉపయోగించుకోవడం ఎలా? ‌చదవడం కొనసాగించండి

రమణీయ: ఆదిత్య ఫాంట్స్ వారి నుండి ఒక ఉచిత తెలుగు ఖతి

పోయిన వారం జరిగిన 2వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో, అంబరీష్ గారు రమణీయ అనే ఒక ఉచిత యూనికోడ్ తెలుగు ఖతిని ఆవిష్కరించారు. ఇదీ ఆ ఖతి యొక్క నమూనా: రమణీయ ఖతిని దించుకోడానికి వారి వెబ్ సైటు వీలు కల్పించే వరకూ వేచివుండాలి. లేదా, ఇప్పుడే దీన్ని ఈమెయిలు ద్వారా పొందడానికి వారిని వెబ్ సైటు ద్వారా సంప్రదించండి. ఇది లోహిత్ తెలుగు ఖతి వలెనే ఉన్నా భిన్నమైనది. వీటి రెంటి మధ్య కొన్ని … రమణీయ: ఆదిత్య ఫాంట్స్ వారి నుండి ఒక ఉచిత తెలుగు ఖతి ‌చదవడం కొనసాగించండి

మలక్‌పేట రౌడీకో చిట్కా

ఈ చిట్కా ఆయనొక్కడికే కాదు అందరికీ. అందరి దృష్టినీ ఆకర్షించడానికి ఆయన పేరుని వాడుకుంటున్నా. ;) మనం బ్లాగుల్లో లేదా ఇతరత్రా రాసేప్పుడు తరచూ ఇతరుల మాటల్ని ఉటంకించాల్సి ఉంటుంది—వాటిపై స్పందించడానికి కావచ్చు లేదా కేవలం ఉదహరించడానికే కావచ్చు. అయితే, ఆ మాటలు ఇతరులవి అని తెలిపేందుకు (అవి మన మాటలుగా పాఠకులు పొరపాటుగా భావించే అవకాశానికి తావివ్వకుండా ఉండేందుకు) కొన్ని పద్ధతులని అనుసరిస్తూ ఉంటాం: కొటేషన్ మార్కుల మధ్యలో పెట్టడం, లేదా వాలు అక్షరాలలో చూపించడం … మలక్‌పేట రౌడీకో చిట్కా ‌చదవడం కొనసాగించండి

గూగుల్ ఇండిక్‌లో ఈ పదాలని ఎలా రాయాలి?

అఫ్‌లైనులో తెలుగు టైపు చేయాలనుకునే వాడుకరులకి (వారు ఇన్‌స్క్రిప్ట్‌కి సిద్ధంగా లేకపోతే) నేను గూగుల్ ఇండిక్ IMEని సిఫారసు చేస్తూంటాను. అయితే, దానిపై తరచూ నాకు వచ్చే ప్రశ్నలకి జవాబులు నాకు తెలియవు. తెలిసినవారు జవాబులు చెబుతారనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ ఉంచుతున్నాను. ఐడెంటికా. ఎన్ని విధాలు ప్రయత్నించినా రాలేదు. aidenti<space>kaa అని టైపు చేసి తర్వాత ఖాళీని తొలగించండి. అనిల్, హరిలకు నెనరులు. కళావైద్యం (కింగ్ సినిమా చూసారా? ;) ), ‘కళా’ అని ‘వైద్యం’ … గూగుల్ ఇండిక్‌లో ఈ పదాలని ఎలా రాయాలి? ‌చదవడం కొనసాగించండి

మీ టపాలో లంకె వేయడం ఎలా?

జాలంలో లంకెలనేవి ఆవశ్యకాలు. ఓ జాల పేజీకి మరే జాల పేజీల్లోనూ లంకె లేకపోతే ఆ పేజీ అనాధే. అసలీ లంకెల మీదే జాలం బతుకుతుంది. మీ టపాలో (లేదా పేజీలో) ఏదో విషయం ప్రస్తావించారనుకోండి, ఆ విషయానికి సంబంధించిన లంకెని కూడా ఇస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది. లంకెలివ్వడంలో పోకడలు, లంకెలు ఎలా ఇవ్వాలో (ఇప్పటికే తెలియనివారికి) సూచనలు, గట్రాలు ఇవిగో. ఇక బ్లాగుల్లో నేను గమనించిన ప్రకారం లంకెలివ్వడం మూడు రకాలుగా ఉంటుంది: చిరునామాని … మీ టపాలో లంకె వేయడం ఎలా? ‌చదవడం కొనసాగించండి