15 వసంతాల లేఖిని

15 వసంతాల లేఖిని పోస్టర్

15 ఏళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజు లేఖినిని తెలుగు బ్లాగులోకానికి పరిచయం చేసాను! తాత్కాలిక పరిష్కారం అనుకున్న చిన్న పనిముట్టు ఇన్నేళ్ళు కొనసాగడం నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే.

లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.

— లేఖిని విడుదలైన 5 నెలలకి నా స్పందన లేఖిని పుట్టుక, పెరుగుదల

ఇన్నేళ్ళూ లేఖినిని ఆదరిస్తూన్న తెలుగువారందరికీ నా కృతజ్ఞతలు!!

18 thoughts on “15 వసంతాల లేఖిని

  1. వీవెన్ గారూ,తెలుగుకు మీరు చేస్తున్న సేవ ఎప్పటికీ మరువలేనిది.కనికరించి కొనసాగించండి.  తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని), పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565 telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.

  2. తెలుగు భాషాభిమానులకు మీరిచ్చిన అపురూపమైన కానుక “లేఖిని”. వాడటానికి బహు సులువుగా ఉండే ఈ సాధనం బహుళ జనాదరణ పొందడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

    మరెన్నో వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను 👍.

  3. హృదయపూర్వక అభినందనలు వీవెన్ గారూ!
    తెలుగు సాహిత్యానికి మీ లేఖిని చేసిన/ చేస్తున్న సహకారం అసామాన్యమైనది. టెక్నాలజీ తెలియని నాలాంటి వయసుపైబడిన వారికి ముఖ్యంగా “మ్” “హుఁ” సంభాషణలలో వచ్చినపుడు టైపు చెయ్యడం తెలిసేది కాదు. అడగగానే, ఓపికగా నా సందేహాలూ, అవసరాలు తీర్చారు. మీకు నేను ఎంతైనా కృతజ్ఞుణ్ణి.
    మీ లేఖినిలో తక్కిన వాటిలోలేని కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఒక్కొక్క అక్షరాన్నే, గుణింతాన్నే టైపు చేస్తున్నప్పుడు సరిదిద్దుకోవడమే గాక, కాపీ, పేస్టు చేసిన తర్వాత, Word File లో కూడా, ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు సరిదిద్దుకో వచ్చు. నేను చాలా Apps ప్రయత్నించేను గానీ, అన్నిటిలోకీ, నాకు లేఖిని ఉత్తమోత్తమంగా కనిపించింది.
    15సంవత్సరాలు నిండిన సందర్భంలో లేఖినికీ, మీకూ అభినందనలతో పాటు, వంద సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    NS మూర్తి

  4. నిస్సందేహంగా మీ పరికరం ఇంటర్నెట్ మీద తెలుగులో వ్రాయటానికి గొప్ప సాధనమైంది.ఒక గొప్పమలుపుకి కారణభూతమైంది. మీకృషికి ధన్యవాదాలు.

  5. వీవెన్ గారూ! గుర్తుండి నేను ఓ పదేళ్ళనుండి నిరాఘాటంగా, నిస్సిగ్గుగా (ఉచితం కదా) లేఖిని వాడుకుంటున్నాను. మీకు కృతజ్ఞతలతో సరిపెట్టడమే నాకు చేతయినది.
    రాజా.

  6. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి లేఖిని వాడుతున్నాను. ఎన్ని టూల్స్ వచ్చినా లేఖిని ఇచ్చే స్వాతంత్రమే వేరు. ఎలా కావాలంటే అలా టైప్ చేయవచ్చు. అయితే ఒకటి రెండు నేను గమనించినవి:
    1. ఓమ్ జ్ఞానవిజ్ఞానమూర్తయేనమః: ఇందులో ఓమ్ జ్ఞాన: ఇవి రెండూ కలపడము సాధ్యముకాలేదు. మ క్రింద వొత్తుగా ఓమ్జ్ఞాన అని వస్తోంది. దీనికి బహుశా యూనికోడ్ వాళ్ళతో మాట్లాడాలేమో అనిపించినది. ఎందుకంటే మిగతా టూల్స్ ద్వారా కూడా నేను చెయ్యలేకపోయాను.

    2. లేఖినిలో టైప్ చేసినవి నిఖిలే ద్వారా ఆంగ్ల అక్షరములలోకి మార్చినప్పుడు, మరలా అది లేఖినిలో పెట్టినప్పుడు సరిగా రాలేదు. నేను దానితో స్క్రిప్ట్‌ని ఇక తెలుగులోనే సేవ్ చేస్తున్నాను.

    1. సంతోషమండీ! మీ గమనికలకు సంబంధించి నా బదులు:

      1. ప్రస్తుతానికి ఇలా వ్రాయవచ్చు oam&^j~naanavijnaanamoortayeanama@h = ఓమ్‌జ్ఞానవిజ్ఞానమూర్తయేనమః. jna వాడినప్పుడు అంతర్గతంగా ఏదో తప్పు జరుగుతూంది.
      2. తెలుగులో భద్రపరచుకోండి. నిఖిలే ఏదో ప్రయోగాత్మకం.

      1. 1. చాలా కృతజ్ఞతలండి. ఇప్పుడు వ్రాయగలిగాను. లేఖిని.కామ్ లో ఉన్న టైపింగ్ సహాయము ఇంకొంచెము మళ్ళీ బాగా చదివి ఉంటే ఈ సమాధానము స్ఫురించి ఉండేదేమో ఎందుకంటే మీరు చెప్పినది టైపింగ్ సహాయములో పూర్వమే ఉన్నది. 2. అయినా నిఖిలే కూడా – ఉద్దేశింపబడిన ప్రయోజనము వేరు కదా. నేను ఇంగ్లీష్ స్క్రిప్ట్ పంచడము(షేర్ చేయడము)కోసము కూడా కొన్నిసార్లు వాడుతుంటాను. మీరు శ్రమించి చేసిన టూల్స్ ఎంతో ఉపయోగకరముగా ఉన్నాయి. ప్రస్తుత సందర్భములో కూడా నాకు కావాల్సిన “ఓమ్‌జ్ఞానవిజ్ఞానమూర్తయేనమః” అన్నది (నాకు తెలిసినంతలో) లేఖినిలో మాత్రమే చెయ్యగల్గడము దీని ప్రత్యేకత. _ /\ _

  7. లేఖిని చాలా బాగుంది. వేరే s/w లో రాని పదాలు force & ^ etc వాడి సరైన పదము వ్రయవచ్చు. అయితే ఒక్కటి నాకు కుదరడంలేదండి. అదే, మన తెలుగులో అప్పు, ఉప్పు, తప్పు, నిప్పు etc…. ప్పు / ప్పూ సరిగ్గా వ్రాయాలి అంటే ప-ఒత్తుకు ఉకారము పెట్టడము, ఉకారనికి దీర్ఘము పెట్టడము. ఇది ఉంటే చాలా చాలా బాగుంటుంది. తెలుగులో correct spelling. అది ఎలా వ్రాయలో చెప్పగలరా. ఇప్పుడు ఈ feature ఎక్కడా లేక అందరు తప్పు అని తెలిసినా తప్పనిసరిగా “ప్పు” అని వ్రాస్తున్నారు. నెను font symbol ని పెట్టి వాడుతున్ననండి చాల ప్రయాసతో.

    1. ఇంకొంచము వివరము:

      ppu అని లేఖినిలో టైప్ చేసినపుడు ఈ క్రింది విధముగా తీసుకుంటుంది:

      ప్+పు = (ప + ్) + (ప + ు)

      = (0C2A+0C4D) + (0C2A + 0C41)

      (ref: https://unicode.org/charts/PDF/U0C00.pdf)

      నాకు అర్థమైనంతలో యూనికోడ్‌లో ఒత్తుకు ప్రత్యేకముగా ఉకారము పెట్టలేము. అయితే ఇక్కడ చెప్పినట్లు ఫాంట్ తయారుచేసేవారు ఈ విషయము పరిగణలోకి తీసుకొని సరిగ్గా చేయవచ్చు.

      1. detailed explanation కి ధన్యవాదములు. అర్థమైంది. font use చెయాలి తప్పదు. document లొ అయితే ఫరవాలేదు, కాని అదే text whatsapp లో పంపితే కుదరదు. font ఉండదు కదా….

  8. తెలుగులో స్పందించే తెలుగు భాషాభిమానులకు లేఖిని మీరిచ్చిన అమూల్యమైన కానుక. ఇదివరలో ఆంగ్ల పదాలు ఆంగ్లములో కనిపించేవి. గత కొద్ది సంవత్సారాలుగా అలా కనిపించటం లేదు. ఉదా::telugu (#Telugu#)

Leave a reply to Jai స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.