లేఖినిలో చిన్న చిన్న మార్పులు

చాన్నాళ్ళకు, లేఖినిలో కొన్ని మార్పులు! చిన్నివేలెండి.

  • మొబైలులో లేఖిని చిన్నమార్పుల్లో పెద్దది లేఖినిని స్మార్టుఫోన్లలో వాడుకునే వారికోసం. ఇప్పుడు లేఖిని చిన్న తెరలపై కూడా ఇమిడిపోతుంది.
  • ఇప్పుడు లేఖినిలో రూపాయి (₹) గుర్తుని కూడా పొందవచ్చు. ఇందుకోసం $$ అని టైపు చెయ్యాలి.
  • గతంలో # తర్వాత టైపు చేసే పాఠ్యం తెలుగులోకి మారేది కాదు. ఇప్పుడు మారుతుంది. అంటే # గుర్తుని ఇక వాడుకోవచ్చు. (ఏదైనా పాఠ్యం తెలుగు లోనికి మారకూడదనుకుంటే దాని చుట్టూ ` (backtick) లను చేర్చండి. Esc కింద మీట.)
  • ఇంతకుముందు @2 అని కొడితే దేవనాగరి అవగ్రహ (ऽ) వచ్చేది. కానీ ఇప్పుడు సరిగ్గా తెలుగు అవగ్రహ (ఽ) వస్తుంది.
  • (మే 29, 2018) ఇప్పుడు లేఖినిని https చిరునామా ద్వారా కూడా చేరుకోవచ్చు: https://lekhini.org.

ఇంతే సంగతులు.

గమనిక: ఈ మార్పులు మీ లేఖినిలో కనిపించకపోయినా, లేదా మీరు లేఖినిలో తెలుగులో వ్రాయలేకపోతున్నా, అందుకు మీ విహారిణిలో (బ్రౌజరులో) ఉన్న ఆఫ్‌లైన్ కాపీ కారణం కావచ్చు. దాన్ని తాజాకరించడానికి, మీ విహారిణిలో లేఖిని పేజీలో Ctrl+Shift+R నొక్కండి.

తాజాకరణ (మే 9): ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాక్‌టిక్ టైపు చెయ్యడం ఇలా: బొమ్మలో ఎర్ర చుక్కలు పెట్టిన మీటలను నొక్కితే చాలు. (ఫోనును బట్టి కీబోర్డులో మార్పులు ఉండవచ్చు.)
backtick_in_android.png

ఆనంద లేఖనం!

75 thoughts on “లేఖినిలో చిన్న చిన్న మార్పులు

  1. మిత్రులకు నమస్కారములు
    దయచేసి అవగ్రహ తర్వాత (వెనువెంటనే) అనుస్వరం ఎలా టైప్ చేయాలో తెలుపగలరు.
    ధన్యవాదాలు
    క. నరసింహ మూర్తి.

  2. కొద్ది రోజుల నుంచి గూగుల్ క్రోమ్ (పీసీ) బ్రౌజర్లో లేఖిని పని చేయడం లేదు. ఇంతకు ముందు పని చేసింది. రెండు రోజుల నుంచి పని చేయడం లేదు. ఆంగ్లం టైపు చేస్తే ఆంగ్లమే వస్తోంది. ఉదా:- ఆంగ్లం టైపు చేయవలసిన డబ్బాలో haloa అని టైపు చేస్తే తెలుగు రావలసిన డబ్బాలో బ్యాకుటిక్కులతో ‘haloa’ అని ఆంగ్లమే వస్తోంది. కాని ఫైరుఫాక్స్ బ్రౌజర్లో లేఖిని ఎటువంటి సమస్య లేకుండా పని చేస్తోంది. పరిష్కారం తెలుపగలరు.

      1. ధన్యవాదాలు. గూగుల్ క్రోమ్ నుంచే లేఖినితో ఈ సందేశం లిఖించడం జరిగింది. ఎప్పటివలె తెలుగులో వ్రాయగలుగుతున్నాను. కృతజ్ఞతలు!

      2. మొబైలు క్రోములో లేఖిని పేజీలో ఉన్నప్పుడు, చిరునామా ఇచ్చే చోట javascript:location.reload(true) అని టైపు చేసి → (మొబైలు కీబోర్డులో ఎంటర్‌కి సమానమైన మీట) పై నొక్కండి.

        మరో పద్ధతి (దీని వల్ల మిగతా సైట్ల ఆఫ్‌లైను కాపీ కూడా పోతుంది.). జాగ్రత్త! Settings > Privacy > Clear Browsing Dataకి వెళ్ళి కేవలం Cookies and site data అన్న దాన్ని మాత్రమే ఎంచుకొని Clear data బొత్తాన్ని నొక్కండి.

  3. apple వారి ఐపాడ్ కీబోర్డ్ లో మీరన్న backtick మీట లేదు. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమన్నా ఉందా? థాంక్స్.

    1. ఇంతకు మునుపు లేఖినిలో # టైపుచెయ్యలేము. కానీ సామాజిక మాధ్యమాలలో ట్యాగుల కోసం # విరివిగా వాడుతున్నారు కనుక దానికోసం ఇది తప్పలేదు. వేరే ప్రత్యేక గుర్తుని ఎంచుకుంటే దాన్ని వాడలేరు. ఇదనుకోండి, దీన్ని మనం మామూలుగా వాడం కదా.

  4. ఎందుకు మీకీ తంటా ?
    దీని వల్ల ఉపయోగ మేమి ?
    డైరెక్ట్ తెలుగు లిప్యంతీకరణ గట్రా ఆప్ లు వచ్చేసాయి కదా ? ఇంకా దీన్ని ఉపయోగించి కట్ పేస్ట్ చేసి రాసే వాళ్లున్నారంటే ఆశ్చర్యమే !

    జిలేబి

  5. lekhini – android లో app లాగా దొరికే వీలుందా? system or mobile phone లో అక్షరదోషాలు లేకుండా టైప్ చేసేందుకు, ఇంత కచ్చితమైన సాఫ్ట్ వేర్ ఇంకోటి లేదు. lekhini.org app గా వస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది.

      1. నేను కూడా లేఖిని ఆండ్రాయిడ్ యాప్ మరియు విండోస్ సాఫ్టువేర్‌గా పొందాలని ఎప్పటి నుంచో చూస్తున్నానండి. లేఖిని ముందు గూగుల్ ఇన్‌పుట్‌టూల్స్ కూడా నిలబడలేవు. అక్షరదోషాలు లేకుండా అత్యంత సులభంగా తెలుగు టైపింగుకు వీలు కల్పించే సాధనాలలో లేఖిని మించిన సాధనం మరొకటి లేదు. కొన్ని ఏళ్లుగా లేఖిని ఉపయోగిస్తున్నాను. దయచేసి విండోస్ పీసీ కోసం లేఖిని సాఫ్టువేర్, అలాగే ఆండ్రాయిడ్ కోసం లేఖిని యాప్ రూపొందించగలరు.

      1. గౌతమి, వాణి (విండోస్ లోని డీఫాల్టు) ఫాంట్లలో ఘో ఎత్వంతో వస్తుంది. దీనికి లేఖినిలో ప్రస్తుతం ఏమీ చేయలేము.

  6. సుమారు రెండేళ్ళ నుండి వాడుతున్నాను. నా సబ్జెక్ట్ కు సంబంధించి చాలా నోట్స్ తయారు చేసుకున్నాను. ఉచితంగా మాకు అందించినందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు

    1. ఇప్పటికే తెలుగు కీబోర్డు లేయవుటు తెలిసివున్నవారు కంప్యూటర్లలో ఆయా కీబోర్డు లేయవుటలను స్థాపించుకొని నేరుగా తెలుగులో టైపు చెయ్యవచ్చు. ఉదాహరణకు, ఇన్‌స్క్రిప్ట్ లేయవుటు. మీకు మరేదైనా లేయవుటు తెలిసివుంటే చెప్పండి.

  7. నేను బహువత్సరాలుగా Pramukh IME ని వాడుతున్నాను. తెలుగుతో బాటు మరొక ఇరవై చిల్లర భాషల్లో ఈ IME సహాయంతో phonetic విధానంలో టైపు చేయవచ్చును. ఈ IME పేకేj-ని unzip చేసి వాDukOvaTamE. Install చేయనవసరం లేదు వివరాలకు https://www.vishalon.net సైటును సంప్రదించండి.

      1. When tab or arrow keys are pressed accidently. The typed text is missing…

        On Tue, 6 Apr 2021 22:23 వీవెనుడి టెక్కునిక్కులు, wrote:

        > వీవెన్ వ్యాఖ్యానించారు: “టైపు చేసిన పాఠ్యం ఎలా పోయింది? బ్రౌజరు లేదా > లేఖిని ట్యాబు అనుకోకుండా మూసివేసినపుడా?” >

Leave a reply to neeha స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.