“రాజుగారి క్షీరాభిషేకానికి నావంతు నీళ్ళు పోస్తే ఏమవుతుంది అనుకొని అందరూ నీళ్ళే పోస్తే పాలు మిగలనట్లు, ఎన్నో రంగాలలో ఎన్నో విద్యలలో తెలుగువారికున్న విజ్ఞాన సాంకేతిక సంపద తెలుగు రూపంలో వ్యక్తీకరింపబడనంత వరకు భాషకు నీటి సహాయమే కాని, పాల సహాయం అందనట్లు అనిపిస్తుంది.” — శ్రీనివాస్ నాగులపల్లి
ప్రకటనలు
శ్రీనివాస్ గారూ, మీ ఆవేదన అర్ధం చేసుకోగలను. తెలుగు భాష పట్ల అందరికీ ఒకే లాంటి అభిమానం ఉండదు కదండీ. అసలు తెలుగు భాష లో కంప్యూటర్ మాట్లాడాలంటే ఏమేమి అవసరం? ఇది మనకు అవగాహన ఉండటం ముఖ్యం. నాకైతే ఆ అవగాహన లేదు. మీకు ఉంటే ఇక్కడ పంచుకోండి. దానికి ఒక మార్గ నిర్దేశం చేసుకుని కుదిరినంత పని చేసుకుంటూ పోతే మద్దతు పలికే వారు రావలసినప్పుదు వస్తారు.