విండోస్ కంప్యూటర్లలో వివిధ లేయవుట్లలో తెలుగు టైపు చేసుకోడానికి వీలుగా కొన్ని కీబోర్డులు గతంలో తయారు చేసాను. అవి ఇన్స్క్రిప్ట్+, ఆపిల్ (వేరిటైప్), మాడ్యులర్. అయితే విండోస్ 10లో వీటిని స్థాపించుకోవడం వీలుకావడంలేదని నాకు పిర్యాదులు అందాయి.
దీనిపై పరిశోధిస్తే తేలిందేమిటంటే, విండోస్ 10లో విండోస్ ఇన్స్టాలర్తో అప్లికేషన్లను స్థాపించుకోడాన్ని అచేతనం చేసాడు. అందువల్ల పై కీబోర్డు లేయవుట్లను (ఇతర విండోస్-ఇన్స్టాలర్-ఆధారిత ఉపకరణాలనూ) విండోస్ 10లో మామూలుగా స్థాపించుకోలేము. వీటిని స్థాపించుకోడానికి తాత్కాలికంగా విండోస్ ఇన్స్టాలర్తో అప్లికేషన్లను స్థాపించుకోడాన్ని చేతనం చేసుకోవాలి. ఇలా:
- మీ విండోస్ 10 కంప్యూటర్లో, Run కమాండ్ తెరిచి (Win + R).దానిలో gpedit.msc అని టైపు చెయ్యండి. (ఇది గ్రూప్ పాలసీ ఎడిటర్ అనే విండోని తెరుస్తుంది.)
- ఆ తర్వాత, మీరు Local Computer Policy అన్న విభాగంలో, Computer Configuration మీద నొక్కండి.
- తర్వాత, Administrative Templates పైనా, దాని లోని Windows Components, దాని లోని Windows Installer పైనా నొక్కుకుంటూ వెళ్ళండి.
- ఆ Windows Installer విభాగంలో Turn off Windows Installer అన్న అమరికను, డబల్-క్లిక్ చెయ్యండి.
- తర్వాచ వచ్చే విండోలో, క్రింద చూపిన విధంగా Enabled అని Never అని ఎంచుకోని OK నొక్కండి. (మీరు కీబోర్డును స్థాపించుకున్న తర్వాత దీన్ని తిరిగి Not Configured అని అమర్చుకోవచ్చు.)
అంతే! ఇక విండోస్ 10లో కూడా మీకు నచ్చిన తెలుగు కీబోర్డు లేయవుటుతో విజృంభించండి.
ఆనంత తెలుగు టంకనం!
తెరపట్ల సౌజన్యం దొప్పలపూడి శ్రీకాంత్
విండొస్ 10 లాపుటాపులొ లేఖిని ద్వార టైపు చేసిన తెలుగు మాటలను వర్దు ఫైలు లొ పేస్టు చేసినప్పుడు అది సజావుగా స్వీకరించడములేదు. వేరె కంప్యుటరులొ విండొస్ 7 లొ ఐతే బాగనే ఉంటోంది. కాబట్తి విండొస్ 10 లొ కూదా సజావుగ ఉండే విధముగ ఫార్మాటు చెయ్యగలరని కోరుకుంటున్నాను. దీని పై స్పందించగలరని మరీ మరీ కోరుకుంటున్నాను . ధన్యవాదములు
namaskAramaMDI,
telugu bhAshani nETi taraM vAru vAri sAdhaNAlalO vADukonE vidhamugA mIru chEsthunna kRushiki dhanyavAdamulu. dInivalana mana telugu bhaasha maruguna paDakunDA uMTMdi. asalE Angla bhaasha meada picchi peruguchunna rOjulu ivi.