ఐఫోనులో తెలుగు వ్రాయడం ఎలా?

ఐఫోనులో తెలుగులో వ్రాయడానికి మనకి ప్రత్యేకమైన ఆప్స్ అవసరం లేదు, ఎందుకంటే ఐఫోను కీబోర్డు ఆప్ లోనే తెలుగు ఎంచుకునే అవకాశం ఉంది. ఈ అంచెలు అనుసరించండి:

1. ఐఫోను సెట్టింగులలోకి వెళ్ళండి. సెట్టింగుల తెరలో కీబోర్డు అన్న దాన్ని ఎంచుకోండి.
1-iphone-settings

2. కీబోర్డు సెట్టింగుల తెరలో కీబోర్డులు అన్న దాన్ని ఎంచుకోండి.

2-iphone-settings-keyboards

3. కీబోర్డుల తెర నుండి మీరు కొత్త కీబోర్డులను ఎంచుకోవచ్చు.

(క్రింది తెరపట్టు తెలుగును ఎంచుకున్న తర్వాత తీసినదన్నమాట!)

3-iphone-settings-keyboards-add-new-keyboard

అంతే! ఆ తర్వాత మీరు మీ ఐఫోనులో ఎక్కడ తెలుగు టైపు చెయ్యాలన్నా కీబోర్డులో స్పేసుబార్‌కి ఎడమవైపున ఉండే గ్లోబు మీటను నొక్కి ఇంగ్లీషు, తెలుగుల మధ్య మారవచ్చు.

తాజాకరణ (2020 జూలై 22): మరిన్ని తెరపట్లతో, వివరాలతో ఐఫోనులో తెలుగు ఎలా టైపు చెయ్యాలో  ప్రవీణ్ నందగిరి వ్రాసిన ఈ టపా కూడా చూడండి.

తెరపట్ల సౌజన్యం సుబ్రమణ్యం నాయుడు.

7 thoughts on “ఐఫోనులో తెలుగు వ్రాయడం ఎలా?

 1. వీవెన్ గారూ, నమస్కారం. మీరు zero width non joiner shortcutకి ఏమైనా సూచన ఇవ్వగలరా. ఇదివరకు నేను కంట్రోల్ +M పెట్టుకున్నాను షార్ట్ కట్ కి. కానీ ఇప్పుడు ఎలా ప్రయత్నించినా కుదరడంలేదు. అంతర్జాలంలో Cntl+Shift+2 సూచించేరు. కానీ నాకు అది పని చేయడంలేదు. నేను Win 10 వాడుతున్నాను. గౌతమీ పాంట్సే. మీరన్న గతిలేనివారి ఖతి. నాకు మాత్రం అదే సుళువుగా ఉంది. :)

  1. మీరు వాడే ఖతికీ టైపు చేసే పద్ధతికీ సంబంధం లేదండి.

   AltGr+2 ప్రయత్నించి చూడండి. AltGr అంటే కుడి వైపున ఉన్న Alt మీటే!

   ఇది పనిచేయకుంటే, మీరు టైపు చేసే పద్ధతి నాకు తెలియాలి.

   1. AltGr+2 is giving extra space after the letter. e.g. జాన్ కి but not creating zwnj.
    Basically, I want to create a shortcut key for ZWNJ. I have created a shortcut key for quotation marks, using Cntl+Alt+2. That is working fine.
    All I did is to open special symbols, identify the zwnj (U200C) and in the far left column type in the combination of keys I want to set as shortcut key.
    I hope this is clearer. Thanks for your help

   2. మీ వ్యాఖ్యను రెండుమూడు సార్లు చదివి, మీరు చెప్పిన వివరాలను బట్టి, వెతకగా అర్థమయ్యిందేమిటంటే, మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనువర్తనం లోని సింబల్స్ గురించి మాట్లాడుతున్నారని. (ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో కారెక్టర్ మ్యాప్ అని ఒకటుంది కానీ దానిలో కీబోర్డు షార్టుకట్లు పెట్టుకునే వెసులుబాటు లేదు.)

    వర్డులో Ctrl+Mకి అప్రమేయంగా ఇండెండ్ చేయడం అనే పని అప్పగించబడింది. దాన్ని మార్చి మీరు ZWNJకి పెట్టుకోవచ్చు. లేదా మరేదైనా మీటలను పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత సింబల్స్ డైలాగులో ఆ షార్టుకట్టు కనిపిస్తూందా అని చూడండి. ఈ తెరపట్టులో వలె.

    ఇలా అమర్చుకున్న తర్వాత Ctrl+M కొడితే నాకు ZWNJ టైపు అవుతుంది. మరోసారి ప్రయత్నించి చూడండి.

    ఆలస్యానికి మన్నించండి. ఈలోపు మీరే కనిపెట్టేసి ఉంటే మంచిదే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.