భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ

భారతదేశం ఎలా ఉంటుందో మీకు ఎలా తెలిసింది? ఏదో ఒక పటాన్ని చూస్తేనే కదా. మనం చిన్నప్పటిని నుండీ పాఠ్యపుస్తకాల్లోనూ ఇతరత్రానూ చూసి మన మనసుల్లో భారతదేశానికి ఒక ముద్ర ఏర్పడిపోయింది. అయితే, గూగుల్ మ్యాప్ వంటి సైట్లలో చూపించే భారతదేశ పటం తేడాగా, తల పక్కన కోసేసినట్టు ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీరుని మన దేశంలో భాగంగా చూపకపోవడం వల్ల. ఈ విషయమై భారత ప్రభుత్వం సదరు సైట్లకు పిర్యాదులూ, ఆదేశాలూ చేసి ఉంది. కానీ ఫలితం శూన్యం అని ప్రభుత్వాథికారులు విచారం వ్యక్తం చేసారు కూడా. (అన్నట్టు గూగుల్, బింగ్ మ్యాపుల్లో ఇప్పుడు భారతదేశం పటం సరిగానే ఉంది. వేరే దేశాలలో ఉన్నవారికి ఎలా కనబడుతుందో తెలియదుమరి. వేరే దేశాల వారికి తేడాగానే కనబడుతుంది, అంతర్జాతీయంగా అంగీకరించబడిన సరిహద్దుల ప్రకారం.)

జాలంలో వివిధ సైట్లలో భారత భూభాగాన్ని సవివరంగా చూపించే పటాలు అందుబాటులో ఉండటం వల్ల దేశం మీద దాడులు చేసేవారి పని చాలా సులభమైపోయిందనీ ఒక వాదం. మన దేశ రక్షణకు కీలకమైన ప్రదేశాలు, సైనిక స్థావరాల వంటి చోట్లు, విమానాశ్రయాల వంటి దాడులకు అవకాశమున్న ఇతరత్రా  ప్రాంతాలను ఈ పటాల సైట్లలో స్పష్టంగా కనిపించకూడదని, వాటిని మాస్క్ చెయ్యాలని ఆయా సేవదార్లకు భారత ప్రభుత్వం పంపిన విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాని ప్రభుత్వం అంటోంది. (అన్నట్టు, వివధ సైట్లలో భారతదేశం పటాలను ఒక స్తాయికి మించి జూమ్‌చేసి చూడలేము. వేరే దేశాల నుండి చూసినప్పుడు పరిస్థితి తెలియదు.)

పఠాన్ కోట దాడి తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం తన ప్రయత్నాలను వెగిరపరచింది. ఈ నేపథ్యంలో పటాలను, భూమిపై మన స్థలాన్ని సూచించే అక్షాంశ, రేఖాంశాలను వాడే ఇతరత్రా సమాచారాన్నీ, అంటే భూస్థల (జియోస్పేషియల్) సమాచారాన్ని, నియంత్రించాలని సంకల్పించి ఒక చట్టాన్ని ప్రతిపాదిస్తూ బిల్లును తయారుచేసింది. అదృష్టవశాత్తూ, ఆ బిల్లుని అలానే పట్టాలు ఎక్కించేయకుండా జనాల ప్రతిస్పందన కోసం, సలహాల కోసం బహిరంగపరచింది.

ఆ డ్రాఫ్టు బిల్లులో భూస్థల సమాచారం అన్న దానికి చాలా విస్తారమైన అర్థం ఇచ్చారు. భారతదేశానికి సంబంధించిన భూస్థల సమాచారాన్ని ఏ విధంగా పొందినా, ఎలా తయారుచేసినా, ఏ రూపంలో ప్రచురించినా, పంపిణీ చేసినా, చెయ్యాలనుకున్నా ప్రభుత్వం దగ్గర లైసెన్సు తీసుకోవాలి. భారతదేశ పటాన్ని తప్పుగా చూపించినా ఏడేళ్ళ జైలు శిక్షకు లేదా రూ. 100 కోట్ల వరకూ జరిమానా.

ఈ బిల్లు యొక్క ఉద్దేశం మంచిదైనా, బిల్లులోని విషయాలు మాత్రం ఈ కాలానికి తగ్గట్టు లేవు. ఈ బిల్లు మనలాంటి సామాన్యులు కూడా రోజు గడవడానికి ప్రభుత్వం వద్ద లైసెన్సు తీసుకోవాల్సి వచ్చే స్థాయిలో ఉంది. ఈ బిల్లును చదివి నేను అర్థం చేసుకున్నత వరకూ ఈ క్రింది పనులన్నీ ఈ చట్టం క్రిందకు వస్తాయి, ఇవి చేయాలంటే లైసెన్సు తప్పనిసరి:

  • మీ కెమేరా లేదా చేతిఫోనుతో జియోలొకేషన్ ఆన్‌లో ఉంచి ఒక ఫొటో తీసుకున్నారు. (జియోట్యాగింగ్ అంటే ఫొటో తీసిన ప్రాంతం ఫొటో మెటాడేటాగా భద్రమవుతుంది.)
  • మీ రోజువారీ నడక జాడని గమనించడానికి మీ చేతిఫోనులో ఆప్ ఉంది.
  • మీరు ట్విట్టర్/ఫేస్‌బుక్‌లో టపా వ్రాస్తూ మీ ప్రాంతాన్ని పంచుకున్నారు.
  • మీ పిల్లల బడి పని కోసం, వారి నోటుపుస్తకంలో భారతదేశ పటాన్ని గీసారు.
  • మీ స్నేహితుడు ఇంటికి వస్తూంటే వాడికి దారి తెలియడం కోసం వాట్స్‌ఆప్‌లో మీ స్థానాన్ని పంచుకున్నారు.
  • మీ ఇంట్లో శుభకార్యానికి ఆహ్వాన పత్రికలో వేదికకు చేరే దారిని ముద్రించారు.
  • మీరు రాస్తున్న బ్లాగు టపాలో మన దేశంలోని ఒక ప్రాంతపు పటాన్ని చూపించారు.

సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మ్యాపుల మీదే బతికే ఊబర్, ఓలా, స్విగ్గీ, ఫుడ్‌పాండా వంటి కంపెనీలూ ఈ బిల్లు బారిన పడతాయి. వార్తాపత్రికలూ, పుస్తకాల షాపులూ సరేసరి. మరీ సంకుచితంగా ఉన్న ఈ బిల్లుపై నిరసనలు బాగానే వ్యక్తమవుతున్నాయి.

ఈ బిల్లుపై మన అభిప్రాయాలనూ, సలహాలనూ జూన్ 4వ తేదీలోగా ప్రభుత్వానికి పంపించాలి.

దీని గురించి మీరూ తెలుసుకొని, ఇది మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తూందో అర్థం చేసుకొని మీ స్పందనను జాయింట్ సెక్రెటరీ, అంతర్గత వ్యవహారాల శాఖ వారికి (ఈమెయిలు ద్వారా అయితే jsis@nic.inకి) తెలియజేవచ్చు. ఈ విషయంపై మరింత తెలుసుకోడానికి ఈ లంకెలు ఉపయోగపడతాయి:

అలానే, తక్షశిల ఇన్‌స్టిట్యూషన్ వారి పబ్లిక్ పాలిసీ ప్రైమ్‌టైమ్ ప్రోగ్రాములో ఈ బిల్లు గురించిన చర్చను కూడా చూడండి:

భారతదేశ పటమూ, దేశ రక్షణ, నియంత్రణ”పై ఒక్క స్పందన

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s