మీ బ్లాగు టపాలను ముందు వర్డ్‌లో వ్రాసి, కాపీ-పేస్టు చేస్తారా?

మీ బ్లాగు టపాలు ముందు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ వంటి అప్లికేషన్లలో వ్రాసి తర్వాత దాన్ని బ్లాగు లోనికి కాపీ-పేస్టు చేస్తారా? అయితే, మీ కోసమే ఈ టపా!

వర్డ్ నుండి కాపీ-పేస్టు చెయ్యడంవల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటో అర్థమవడం కోసం ముందుగా ఓ ప్రయోగం చేద్దాం. మీరు తయారేనా? ఒక కొత్త వర్డు డాక్యుమెంటును తెరిచి దానిలో ‘ఇది తెలుగు’ అని టైపు చెయ్యండి. తర్వాత దాన్ని ఎంచుకొని బ్లాగర్ లోనికి కాపీ చెయ్యండి. బ్లాగరులో మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది:

బ్లాగర్ కంపోజ్ తీరు

బాగానే ఉంది కదా. ఇప్పుడు HTML మోడులోకి వెళ్ళి (టూల్ బారులో మొదటి జంట బొత్తాల్లో HTML ఉంది కదా, దాన్ని నొక్కి) చూడండి. అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది:

వర్డ్ నుండి కాపీ చేసిన పాఠ్యంలో అనవరమైన ట్యాగులు - బ్లాగర్ HTML తీరు

ఏమిటీ చెత్త అనుకుంటున్నారా? మన పాఠ్యం కేవలం రెండు చిన్న పదాలైతే, ఇప్పుడు మన టపా వర్డ్ మోసుకొచ్చే ఈ అనవరమైన కోడుతో తడిసి మోపెడయ్యి 353 లైన్లయ్యింది. అసలు పాఠ్యం 30 బైట్లు, వర్డ్ నుండి కాపీ చేసిన తర్వాత 20,049 బైట్లు అయ్యింది. ఈ కోడంతా మనకు కనబడదు కానీ మన టపా చదివిన అందరూ (అంటే వారి జాల విహారిణులు) ఈ కోడును కూడా దింపుకోవాల్సిందే కదా. ఈ అనవసర కోడు వల్ల మన బ్లాగు కూడా నెమ్మదిస్తూంది. మన బ్లాగును చదివే వారికి ఇదంతా అదనపు భారమే (మొబైళ్ళలో చదివే వారికి అనవసరపు ఖర్చు కూడా). ఒక్కోసారి వర్డ్ నుండి కాపీ చేసినప్పుడు పంక్తుల మధ్య ఖాళీ తగినంత ఉండదు. ఖతి పరిమాణం చిన్నగానో పెద్దగానో మన బ్లాగు అలంకారానికి తగ్గ శైలిలో లేకుండా అయిపోతూంది.

కాబట్టి, చెప్పొచ్చేమంటే… వర్డ్ నుండి నేరుగా మీ బ్లాగులోనికి పేస్టు చెయ్యకండి! మరి పరిష్కారం ఏమిటి? మీరు ఆఫ్‌లైనులో టపాలు వ్రాసిపెట్టుకోడానికి వర్డ్ కాకుండా నోట్‌పాడ్ వాడండి. వర్డే వాడతాం అనుకుంటే, ఈ క్రింది సూచనలు పాఠించండి.

వర్డ్‌ప్రెస్

వర్డ్‌ప్రెస్‌లో అయితే సులువైన పద్ధతి ఉంది:

  1. టపా వ్రాసే పెట్టె పైనున్న టూలుబారులో (చివరిది) కిచెన్ సింక్ బొత్తంపై నొక్కండి. అప్పుడు టూల్‌బారు రెండో వరుస తెరుచుకుంటుంది. వర్డ్‌ప్రెస్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ నుండి పాఠ్యాన్ని పేస్టు చేయడానికి సూచనలు
  2. టూల్‌బారు రెండో వరుసలో W అక్షరంతో ఉన్న బొత్తాన్ని నొక్కండి.
  3. ఆపై తెరుచునే విండోలో, మీరు వర్డ్‌లో కాపీ చేచిన పాఠ్యాన్ని అతికించండి.
  4. అవసరాన్ని బట్టి, మీ టపాలో ఎక్కడైనా బొద్దు (bold) వాలు (italic) వంటి హంగులు కావాలంటే, ఆయా పదాలను ఎంచుకొని టూలుబారు మీద ఉన్న బొత్తాలను నొక్కుకోండి.

బ్లాగర్

బ్లాగ్‌స్పాట్ బ్లాగులకు ఇలాంటి వెసులుబాటు ఉన్నట్టు కనిపించలేదు. కానీ, ఇలా చెయ్యవచ్చు:

  1. వర్డ్‌లో ఉన్న మీ టపా పాఠ్యాన్ని కాపీ చెయ్యండి (Ctrl + C).
  2. బ్లాగర్‌లో టపా వ్రాసే పెట్టె పైనున్న టూలుబారులో మొదటి జంట బొత్తాల్లో HTML అని ఉన్న బొత్తంపై నొక్కండి. బ్లాగర్ పనిముట్ల పట్టీ తెరపట్టు
  3. పాఠ్యాన్ని పేస్ట్ చెయ్యండి (Ctrl + V).
  4. తర్వాత, పైన చెప్పిన జంట బొత్తాల్లో మొదటి బొత్తం (Compose) నొక్కండి.
  5. అవసరాన్ని బట్టి, మీ టపాలో ఎక్కడైనా బొద్దు (bold) వాలు (italic) వంటి హంగులు కావాలంటే, ఆయా పదాలను ఎంచుకొని టూలుబారు మీద ఉన్న బొత్తాలను నొక్కుకోండి.

అంతే! వర్డ్‌లో వ్రాసుకుని ఆ తర్వాత బ్లాగులో అతికించేవాళ్ళందరూ ఈ పద్ధతిని అనుసరిస్తారని ఆశిస్తున్నాను.

ఇంకా:
వర్డ్ నుండి కాపీ చేసిన బ్లాగుల వల్ల నాకు ఓ సమస్య ఉంది. విండోసులో వచ్చే గౌతమీ ఖతి నాకు నచ్చదు. వర్డ్ నుండి కాపీ చేసినప్పుడు ఈ గౌతమీ ఖతి ఆపాదితమైపోతూంది. (నా జాల విహారిణి ఫైర్‌ఫాక్స్‌లో అప్రమేయ తెలుగు ఖతిగా లోహిత్‌ను అమర్చుకున్నాను.) మామూలుగా బ్లాగు అలంకారంలో (CSSలో) బ్లాగు సొంతదారు గౌతమి ఖతిని వాడితే దాన్ని నేను ఒక్క దెబ్బతో (నా ఫైర్‌ఫాక్స్ మాయాజాలంతో) లోహిత్ లోనికి మార్చుకుని చదువుకుంటాను. కానీ వర్డ్ నుండి పేస్ట్ చేసినప్పుడు, వర్డు ప్రతీ వాక్యానికీ ప్రత్యేకంగా ఖతిని ఆపాదిస్తూంది, దానివల్ల నా చిట్కా పనిచేయదు. ఒక్కోసారి కొన్ని టపాలను చదవకుండా మూసేస్తాను. టపా తప్పకుండా చదవాలి అనిపిస్తే, పాఠ్యాన్ని కాపీచేసుకుని దాని ఖతి మార్చుకుని చదువుతాను. :-(

ఇవి కూడా చూడండి:

ఆనంద బ్లాగాయనం!

ప్రకటనలు

4 thoughts on “మీ బ్లాగు టపాలను ముందు వర్డ్‌లో వ్రాసి, కాపీ-పేస్టు చేస్తారా?

  1. నేను ఇన్ స్క్రిప్ట్ అన్ని చోట్లా వాడు తుంటాను. మీరు చెప్పిన ప్రయోగం చేసి
    చూస్తాను.నాకు అంతా కొత్త.మీరు వర్డ్ ప్రెస్ ఏవిధంగా నాకు ఉపయోగ పడుతుందో
    తెలుపగలరు.మీ పోస్ట్ లన్నీ ఆసక్తి తో గమనిస్తూంటాను.తెలుగు అక్షరాలు రాయడం
    తేలికగానే అని పిస్తుంది నాకు.మరి ఎందరో ఇంకా ఇంగ్లీషు అక్షరాలు ఎందుకు
    వాడుతున్నారా అని తచిఅనుకొంటూ నేను ఫేస్ బుక్ లో telugu ela rayali అని ఒక
    పేజీ క్రియేట్ చేశాను.ఇంటర్నెట్ తెలుగు అక్షర సౌందర్యంతో శోభిల్లాలని కోరిక.మీ
    సహకారం తో నేను నా అభిరుచులను పెంచుకోగలనని విశ్వసిస్తాను.

  2. నిన్న నేను కొద్దిగా బద్ధకించి, ఎప్పుడో వర్డ్ లో రాసి ఉంచుకున్న టపాని బ్లాగ్ లో కాపీ పేస్ట్ చేశాను. చూడ చక్కగా లేనే లేదు. చదవడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది నాకే!

    ఈ సమాచారం బాగుంది. ఇకముందెప్పుడైనా అలాటి పరిస్థితి వస్తే దీన్ని ఉపయోగించుకుంటాను.

    ధన్యవాదాలు

  3. మీరు చేసే మన మాతృభాషా సేవను మెచ్చుకోకుండా ఉండలేక
    పొయ్యాను. నమస్కారము. ముందు ముందు మరెన్నో విజయాలు
    సాధిద్దాం.
    మాతృభాషాభిమాని జార్జి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.