తెలుగులో వర్డ్‌ప్రెస్!

వర్డ్‌ప్రెస్ అనేది బ్లాగడానికి ఉపయోగపడే ఒక జాల అనువర్తనం. WordPress.com వద్ద చాలా కాలం నుండి తెలుగులో అందుబాటులో ఉంది. కానీ ఆ అనువాదాలు అసంపూర్ణంగానూ, కొన్నిచోట్ల తప్పులతోనూ, ఇంకొన్నిచోట్ల అసహజ వాక్యనిర్మాణం తోనూ ఉన్నాయి (వర్డ్‌ప్రెస్లో బ్లాగు పెట్టుము గుర్తుందా? ☺). అలానే స్వంత సైట్లలో స్థాపించుకునే వర్డ్‌ప్రెస్ (WordPress.org) కొన్నాళ్ళక్రితం వరకూ అధికారికంగా తెలుగులో అందుబాటులో లేదు.

నేను కాస్త చొరవ తీసుకొని వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణకు నిర్వహణ హక్కులను పొందాను. ఆ తర్వాత చాలా కాలంగా అనుమతి కోసం వేచివున్న అనువాదాలను అనుమతించాను (వందలకొద్దీ అనువాదాలు రవిచంద్ర చేసినవే!), ఇతర అనువాదాలను సరిదిద్దాను, తెలుగులో లేని వాటిని తెలుగించడం మొదలుపెట్టాను. ఈమధ్యే వర్డ్‌ప్రెస్ 3.5 విడుదలైన తర్వాత దాన్ని తెలుగులో కూడా దింపుకోలుకి అధికారిక సైటులో సిద్ధం చేసాను.

వర్డ్‌ప్రెస్‌ను పూర్తిగా తెలుగులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మీ తోడ్పాటు కూడా కావాలి!

పై సైట్లలో మీరు మీ అనువాదాలను సూచించిన తర్వాత అవి అనుమతికై వేచివుంటాయి. వాటిని నిర్వాహకులు అనుమతించాలి. తెలుగుకి సంబంధించినంతవరకూ నేను నిర్వాహకుడిని. అనుమతించాల్సిన అనువాదాల కోసం నేను దాదాపు వారానికి ఒకసారి చూస్తూ ఉంటాను. (ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో అనువాదాలు చేసివుంటే, నాకో ఈమెయిలు పంపించండి.) అనుమతించిన అనువాదాలు తర్వాతి వర్డ్‌ప్రెస్ విడుదలలో ప్రతిఫలిస్తాయి.

ఈ రెండు వర్డ్‌ప్రెస్ రకాలు (com, org) ఏమిటో తెలుసుకోవడానికి, ఇంకా చదవండి.

ప్రాధమికంగా వర్డ్‌ప్రెస్ ప్రస్తుతం రెండు రకాలుగా లభిస్తుంది: (2) మన స్వంత సైటులో స్థాపించుకోడానికి వీలుగా wordpress.org సైటులో దింపుకోలుగా లభిస్తుంది.

(1) wordpress.comలో ఉచిత బ్లాగింగు సేవ

  • ఈ సైటులో నమోదు చేసుకొని yourname.wordpress.com అన్న రీతిలో మనకంటూ ఒక ఉచిత బ్లాగును పొందవచ్చు.
  • పైవిధంగా నమోదు చేసుకున్న చిరునామా మన స్వంత డొమైనుతో కూడా పనిచేయాలంటే, వారి వద్ద డొమైనును నమోదుచేసుకోవచ్చు (కొనుక్కోవచ్చు).
  • వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఉచితంగా లభించే అంలంకారాలను వాడుకోవచ్చు. కానీ మన బ్లాగుని మనకు నచ్చినట్టుగా అందంగా తీర్చిదిద్దుకోడానికి, ఒక స్థాయికి మించి మనవైన మార్పుచేర్పులు చేసుకోడానికి కొంత ఖర్చు అవుతుంది.
  • మన బ్లాగు యొక్క సాంకేతిక నిర్వహణను (కొత్త వెర్షనుకు నవీకరించడం వంటివాటిని) అంతా వర్డ్‌ప్రెస్.కామ్ చూసుకుంటుంది.

(2) wordpress.org నుండి ఉచిత దింపుకోలు

  • వర్డ్‌ప్రెస్‌ను wordpress.org నుండి దించుకొని మన స్వంత సైటులో స్థాపించుకొని మన స్వంత సైటు నుండే బ్లాగవచ్చు. స్వంత సైటుకి ఖర్చవుతుంది. వర్డ్‌ప్రెస్ ఎలాగూ ఉచితం, మరియు స్వేచ్ఛా సాఫ్ట్‌వేరు. కానీ పూర్తిగా మన నియంత్రణలోనే ఉంటుంది.
  • వర్డ్‌ప్రెస్ కొరకు జాలంలో విరివిగా అందుబాటులో ఉన్న అనేక అలంకారాలలో వేటినైనా ఎంచుకోవచ్చు. ఆపై మనకు ఇష్టమైన మార్పులు ఎన్నైనా చేసుకోవచ్చు. లేదా మనమే స్వంతగా వర్డ్‌ప్రెస్ అలంకారాన్ని తయారుచేసుకొని వాడుకోవచ్చు.
  • మన స్వంత సైటు కాబట్టి వర్డ్‌ప్రెస్‌ను కొత్త వెర్షనుకు నవీకరించుకోవడం, ఎప్పటికప్పుడు బ్యాక్అప్ తీసిపెట్టుకోవడం, మన అవసరాలకు తగ్గట్టు కావల్సిన ప్లగిన్లను, అంలంకారాలను స్థాపించుకోవడం వంటి నిర్వహణా బాధ్యతలను మనమే చూసుకోవాలి.

WordPress.orgలో లభించే వర్డ్‌ప్రెస్‌నే ఉపయోగించి wordpress.comను తయారుచేసారు. అయితే, అక్కడ అదనంగా బ్లాగు గణాంకాల వంటి సౌలభ్యాలు, చెల్లించిన వారికి మాత్రమే అందుబాటులో ఉండే సౌలభ్యాలు, బ్లాగర్ వంటి ఇతర బ్లాగు సేవల నుండి టపాలను దిగుమతి చేసుకోడానికి కావల్సిన అదనపు సాఫ్ట్‌వేరు కూడా ఉంటుంది.

ఇక స్థానికీకరణ విషయానికి వస్తే, wordpress.com మరియు wordpress.org రెంటినీ ప్రస్తుతం పైన ఇచ్చిన లంకెలలో విడివిడిగా స్థానికీకరించాలి. అయితే, ప్రాథమిక వర్డ్‌ప్రెస్‌ను ఒకసారి wordpress.orgలో అనువదిస్తే ఆ అనువాదాలను wordpress.comలో కూడా వాడుకునే విధంగా స్థానికీకరణ నిర్వాహకులు ఈ అనువాదాలను wordpress.com లోనికి దిగుమతి చేసుకోవచ్చు.

మీ అందరి తోడ్పాటుతో త్వరలోనే వర్డ్‌ప్రెస్ పూర్తిగా తెలుగులో లభిస్తుందని ఆశిస్తున్నాను.

One thought on “తెలుగులో వర్డ్‌ప్రెస్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.