మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు

టూకీగా…

ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్ని మరింత మందికి చేర్చే ప్రయత్నం చేద్దాం.

ఈ విన్నపంపై మీరింకా సంతకం చేసివుండకపోతే, ఇప్పుడే వెళ్ళి సంతకం చేయండి. దీన్ని మీ మిత్రులతోనూ, మీకు తెలిసిన మొబైల్ కంపెనీల సిబ్బంది తోనూ పంచుకోండి. చేతిఫోన్లను తెలుగులో ఉపయోగించుకోవడంలో ఇబ్బందులుంటే, ఆయా కంపెనీలకు నివేదించండి.

తాపీగా…

చాలా మంది కేవలం “ఫోన్ తియ్యడానికి పచ్చ బటన్, పెట్టేయడానికి ఎర్ర బటన్” వరకే పరిమితమైపోయారు కదా!

మొబైళ్ళలో తెలుగును చూడవచ్చని మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. అయితే, అది కొన్ని ఫోన్లకే పరిమితం. మరి కొన్ని ఫోన్లలో జాల విహారిణి (వెబ్ బ్రౌజర్) వంటి కొన్ని ఉపకరణాల వరకే పరిమితం. తెలుగులో ఉన్న కొన్ని ఫీచర్ ఫోన్లు (ఇవి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయో లేదో తెలియదు) తప్పించి, మొబైళ్ళలో పూర్తిస్థాయిలో తెలుగు చూడగలగడం అన్నది ఇంకా కలే!

మొబైళ్ళలో తెలుగు టైపు చెయ్యడం కూడా (తెలుగు ఉన్న కొన్ని ఫీచరు ఫోన్లను పక్కన పెడితే) కొన్ని స్మార్టుఫోన్లకే పరిమితం, అందునా అది బయటి అనువర్తనాల ద్వారా మాత్రమే సాధ్యం.

ఈ సాధ్యాసాధ్యాలను అలా ఉంచితే…

ఈ రోజుల్లో రిక్షా తోలేవాడికీ సెల్ ఫోను ఉంది అని చెప్పుకుంటాం కానీ అందులోని సౌలభ్యాలను ఎంతమంతి వినియోగించుకోగలుగుతున్నారు? చాలా మంది కేవలం “ఫోన్ తియ్యడానికి పచ్చ బటన్, పెట్టేయడానికి ఎర్ర బటన్”కే పరిమితమైపోయారు కదా! మొబైళ్ళు తెలుగులో లభిస్తే, ఈ పరిస్థితి మారుతుంది. మొబైళ్ళను (ఆ సంబంధిత వ్యవహారాలన్నింటినీ) తెలుగులోకి తీసుకువచ్చే ప్రక్రియ వల్లే అనేక మంది తెలుగు సాంకేతిక నిపుణులకూ, భాషా పండితులకూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక మొబైల్ ప్రపంచం తెలుగు లోనికి మారిన తర్వాత ఆయా సేవలను వినియోగించుకొనే వారు పెరిగి వెల్లువెత్తే వ్యాపార అవకాశాలు అనూహ్యం.

ఊఁ, కానీ మొబైళ్ళకే ఎందుకింత ప్రాధాన్యం? చెప్పడం మర్చిపోయాను, రాబోయే రెండేళ్ళలో మొబైళ్ళ ద్వారా జాలాన్ని చూసేవారి సంఖ్య కంప్యూటర్ల ద్వారా జాలాన్ని వాడేవారి సంఖ్యను మించిపోతుందని ఒక అంచనా. మరో ఏడాది అటూ ఇటుగా మనదీ (తెలుగు వారిదీ) అదే పరిస్థితి కదా. అయినా సంఖ్యలో కంప్యూటర్ల కంటే ఫోన్లు చాలా ఎక్కువ. ఫోన్లు ఇంగ్లీషులోనే ఉంటే, రెండు తరాల పెద్ద వాళ్ళు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి దూరమైపోయినట్టే. అందుకే కంప్యూటర్ల కంటే చేతి ఫోన్లలో తెలుగు ఉండటం అనేది ఇప్పుడు ప్రధాన ఆవశ్యకం. చేతిఫోన్ల భవిష్యత్తు ప్రాభవాన్ని ఊహించబట్టే కదా కంపెనీలన్నీ వీటిసి సాఫ్ట్‌వేరే తయారుచేసే పనిలోపడ్డాయి. ఉదాహరణకు ఆపిల్ iOS (34 భాషలో లభ్యం), గూగుల్ ఆండ్రాయిడ్ (పలు భాషలు), మొక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ (25 భాషలు), మొజిల్లా Firefox OS (తయారీలో ఉంది), లినక్స్ ఫౌండేషన్ వారి టైజెన్, ఫోన్ల కోసం ఉబుంటూ, హెచ్‌పీ వారి Open webOS, బ్లాక్‌బెర్రీ, ఇంకా చిన్నా చితకా ఎన్నో!

ముందు ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాలి కాబట్టి, నేను ఈ కొత్త సంవత్సరాన్ని మొబైల్ కంపెనీలకు జాల విన్నపంతో మొదలుపెట్టాను. దీనిపై పెద్ద మొత్తంలో సంతకాలు నమోదైతే దీన్ని మొబైల్ కంపెనీల వద్దకు తీసుకువెళ్ళి మీరు మొబైళ్ళను తెలుగులో అందించండని అడుగుదామని నా ప్రణాళిక.

సంతకాలతోనే పనులు అయిపోవుకదా…

 • మీ మొబైళ్ళో తెలుగులో SMS పంపించడానికి అందుకోడానికి ఏవైనా ఇబ్బందులున్నాయేమో చూడండి. (స్మార్టుఫోన్లలో తెలుగు చూడడం, వ్రాయడానికి ఉన్న పద్ధతుల గురించి తెలుసుకోండి.)
 • మీ మొబైలుకు జాలానుసంధానం (నెట్ కనెక్షన్) ఉంటే, వివిధ తెలుగు జాల గూళ్ళను సందర్శించి చూడండి.
 • మీ మొబైలును ఎలా ఉపయోగించాలో సూచనలతో వివరించే పత్రావళి తెలుగులో ఉందా?
 • మీ ఫోనులో మీరు వాడుతున్న సేవ మొక్క ప్రణాళిక, ధరవరలు, నియమాలు గట్రాలు తెలుగులో ఉన్నాయేమో కనుక్కోండి.

ఊహూ అనొద్దు. మొబైలును మీరు ఉపయోగించినంత సమర్థవంతంగా మీ అమ్మానాన్నలు, వాళ్ళ అమ్మానాన్నలు కూడా ఉపయోగించగలగాలి కదా! పైన చెప్పినవి చేసి చూడండి.

మీ ఫోనులో మీరు తెలుగును వెతుక్కునే ప్రక్రియలో…

 • మీకు ఎదురైన సమస్యలూ వాటికి మీరు కనుగొన్న పరిష్కారాల గురించీ
 • మీకు దొరికిన తెలుగు అప్లికేషన్ల గురించీ
 • ఆయా మొబైల్ కంపెనీల నుండి మీరందుకున్న ప్రోత్సాహ నిరుత్సాహలనూ

మీ బ్లాగులోనో, ఫేస్‌బుక్కులోనో, ట్విటరులోనో, లేదా e-నాడు వంటి శీర్షికలకో వ్రాయండి.

ఆనంద జాల విహారణం!

4 thoughts on “మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు

  1. వీవెన్ గారికి…

   నమస్కారాలు..

   మీ బ్లాగు ఒకటి చదివి…తెలుగు ని మొబైలొ వినియొగించే విధంగా నేనొక మొబైల్ అండ్రాయీడ్ అప్ప్లికేషన్
   ఒక ఏడాది పాటు శ్రమించి తయారు చేయటం జరిగింది..ఇది పూర్తిగా ఉచితం…దయచేసి ఇ విషయం
   అందరి కి తెలియచేయగలరని ఆశిస్తున్నాను…

   అండ్రాయీడ్ అప్ప్లికేషన్ యొక్క అడ్రసు..

   https://play.google.com/store/apps/details?id=com.bhanu.akshara&hl=en

   ధన్యవాదాల తొ

   భాను ప్రకాష్..
   9490662500
   అనకాపల్లి

 1. dear memebers,
  like learning key board, the telugu learning of computer key board, like notes of english type writing notes should be send to all, in this system, or notes, like shift useage, ist letter, iind step letter, mixed letter, hints. all are should be there. See the example word in telugu, VISHWAHIAHSENUDU even telugu pandit cannot write perfectly. Like this telugu computer learning notes should be send with excersice like english tperwring notes.
  (Dr. R.S.R. ANJANEYULU, WORLD POET :- POET:- PASIPAPA (eNGLISH & TELUGU), WHO IS WHO AND GUNNEES BOOK RECORD HOLDER.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.