కూడలి యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతల బదిలీ

కూడలి యొక్క యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతలను నేను కినిగె వారికి బదిలీ చేస్తున్నాను.

ప్రస్తుతం కూడలి మధ్యయుగానికి చెందిన నిర్మాణాకృతి/సాంకేతికతలపై పనిచేస్తుంది. :) దాన్ని మెరుగుపరచడానికి ఆకాశమంత అవకాశం ఉంది. ఈ మధ్య… ఉహూ ఎప్పడినుండో కూడలికి కేటాయించడానికి తగినంత సమయం నాకు దొరకడం లేదు. అందునా, నేను దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్న కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి.

కినిగె వాళ్ళు కూడలిని తెలుగు బ్లాగులోకానికే గాక తెలుగువారందరికీ మరింతగా ఉపయోగపడేలా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను.

గమనిక: కూడలికి సంబంధించిన ఈమెయిళ్ళను నా వ్యక్తిగత ఈమెయిలుకు కాకుండా support[at]కూడలి.orgకి పంపించండి. అలానే నాకు పంపించే వ్యక్తిగత సందేశాలను కూడలి చిరునామాకు కాక veeven@జీమెయిల్.కామ్ చిరునామాకు పంపండి.

అన్నట్టు, ఇన్నాళ్ళూ కూడలి పట్ల (తద్వారా నాపై) మీరు చూపించిన అభిమానానికీ మీరిచ్చిన సహకారానికీ కృతజ్ఞతలు. మరో ఉత్సాహకరమైన చేపట్టులో కలుద్దాం. :)

ప్రకటనలు

17 thoughts on “కూడలి యాజమాన్యం మరియు నిర్వహణ బాధ్యతల బదిలీ

 1. మీరు కూడలి నిర్వహణ బాధ్యతలనుండి తప్పుకోవాలన్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.
  ఇన్ని రోజులు సమర్ధవంతంగా నిర్వహించి, మాలాంటి ఎందరికో స్పూర్తినిచ్చిన మీరు మరో మంచి కార్యక్రమంతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.

  Good luck.

 2. వీవెన్‌
  చాలా సంతోషం, ఇన్నాళ్ళపాటు ఇన్ని బ్లాగుల్ని తెలుగు పాఠకులకి శ్రమ తీసుకుని అందించినందుకు చాలా కృతఙ్ఞతలు.
  You have commendable contribution through Teviki, koodali and so bringing all telugu bloggers onto a common platform.
  Kinige, being the ex-microsoft team I am sure ensures nothing misses on technically, but Bloggers deftly misses the personal touch that you always bought. I agree with what RK said, you’ve been an inspiration for most of us.
  I am sure you have much bigger plans,
  Cheers mate, Best of luck

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.