గూగుల్ ఇండిక్‌లో ఈ పదాలని ఎలా రాయాలి?

అఫ్‌లైనులో తెలుగు టైపు చేయాలనుకునే వాడుకరులకి (వారు ఇన్‌స్క్రిప్ట్‌కి సిద్ధంగా లేకపోతే) నేను గూగుల్ ఇండిక్ IMEని సిఫారసు చేస్తూంటాను. అయితే, దానిపై తరచూ నాకు వచ్చే ప్రశ్నలకి జవాబులు నాకు తెలియవు. తెలిసినవారు జవాబులు చెబుతారనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ ఉంచుతున్నాను.

 1. ఐడెంటికా. ఎన్ని విధాలు ప్రయత్నించినా రాలేదు. aidenti<space>kaa అని టైపు చేసి తర్వాత ఖాళీని తొలగించండి. అనిల్, హరిలకు నెనరులు.
 2. కళావైద్యం (కింగ్ సినిమా చూసారా? ;) ), ‘కళా’ అని ‘వైద్యం’ అని విడిగా రాసి తర్వాత వాటి మధ్య ఖాళీని తొలగించుకోవాలి.
 3. పొల్లు (హలంతం) పక్కనే హల్లు వచ్చే పదాలు:
  • ఫైర్‌ఫాక్స్ (దగ్గరగా వచ్చినది: ఫైర్ఫాక్స్, fire^faks అని టైపు చేసిన తర్వాత ^ని తొలగించాలి.)
  • డాష్‌బోర్డ్ (దగ్గరగా వచ్చినది: డాష్బోర్డు, Daash^board అని టైపు చేసిన తర్వాత ^ని తొలగించాలి.)
 4. కఱ్ఱ, బుఱ్ఱ: (gurram అని టైపించి Space మరియు Backspace కొడితే వచ్చే సలహాల్లో గుఱ్ఱం ఉంది. కానీ karra అన్నదానికి వచ్చే సలహాల్లో కఱ్ఱ లేదు.
 5. వాఙ్మయము

మీకెవరికైనా వీటిని గూగుల్ ఇండిక్‌లో ఎలా టైపు చెయ్యాలో (లేదా, మరింత సులభంగా ఎలా టైపుచెయ్యాలో) తెలిసుంటే, వ్యాఖ్యలలో పంచుకోండి. గూగుల్ వీటిని సులభంగా టైపుచెయ్యగలిగే అవకాశం కల్పిస్తుందని ఆశిద్దాం.

గమనిక: పొల్లు పక్కనే హల్లు వచ్చే ‘ఫైర్‌ఫాక్స్’ వంటి పదాలలో ZWNJ అన్న కనబడని యూనికోడ్ అక్షరాన్ని మధ్యలో ఇరికించాలి. ఇన్‌స్క్రిప్టులో అయితే Ctrl + Shift + 2 లేదా లేఖినిలో అయితే, ^ని ఉపయోగించవచ్చు..

ప్రకటనలు

6 thoughts on “గూగుల్ ఇండిక్‌లో ఈ పదాలని ఎలా రాయాలి?

 1. ఐడెంటికా – నాకు aident kaa సపరేట్ గా టైపు చేఅసి మధ్యలో స్పేస్ తీసివేస్తే వచ్చింది.

  ఫైర్ ఫాక్సు, డాష్ బోర్డు ఎలా ప్రయత్నించిన (మీరు చెప్పినట్టు కూడా) కలిపి రాయడానికి రాలేదు.

  కఱ్ఱ – ka rra సపరేటుగా టైపు చేస్తే rra కి ‘ఱ్ఱా’ అని సలహా వచ్చింది. అప్పుడు మధ్యలో స్పేస్ తీసివేస్తే కఱ్ఱా అయింది. అప్పుడు పదం చివరికి వచ్చి backspace తో చివరి కారెక్టర్ తొలగిస్తే కఱ్ఱ వచ్చింది. ఈ వ్యాఖ్య నేను ఇండిక్ ఇన్పుట్ తోనే వ్రాశాను.

  వాన్గ్మయము – నాక్కూడా రాలేదు.

 2. వీవెన్,

  ఆఫ్ లైన్ toll కావలంటే సూర్య గూడూరు గారు చేసిన్ tool చూడండి.

  http://sites.google.com/site/suryaguduru/

  అందులో అన్ని అక్షరాలను పదాలను type చేసే విధనం కూడా ఇచ్చారు

  కాముధ

 3. గూగుల్ ఇండిక్ పరికరం ఫక్తు వాడుకభాషాక్షరాల సాఫ్టువేరు. దాన్నుంచి సాహిత్యభాషలోని పదాల టంకనానికి తోడ్పాటుని ఆశించడం ప్రస్తుతానికి వృథా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.