పివిక్ అనేది జాల గణాంక విశ్లేషణల ఉపకరణం. ఇది గూగుల్ అనలిటిక్స్కి ఒక బహిరంగాకర ప్రత్యామ్నాయం. మన సైటు గణాంకాల విశ్లేషణ కోసం సైటు గణాంకాల భోగట్టాని ఇతరులచే గమనింపజేసి వారి వద్దే భద్రపరిచే బదులు, పివిక్ని మన సర్వరు లోనే స్థాపించుకుని మన భోగట్టాని ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం లేదా ఆ భయం నుండి తప్పించుకోవచ్చు. పివిక్ గురించి మరింత వారి సైటులో చూసి తెలుసుకోవచ్చు.
అయితే, దీని తెలుగీకరణని నేను ప్రారంభించాను. మీకోసం ఒక తెరపట్టు (పెద్ద చిత్రం కోసం బొమ్మపై నొక్కండి).
పివిక్ తెలుగీకరణలో మీరు కూడా పాల్గొనాలనుకుంటే, పివిక్ అనువాదాల పుట లోని సూచనలని పాఠించండి.
ఆనంద తెలుగీకరణం!