సింటెల్ అన్నది స్వేచ్ఛా మృదూపకరణాలతో తయారుచేసిన 3D ఆనిమెషన్ సినిమా. ఇది ఓపెన్ సినిమా, అంటే, సినిమాతో పాటుగా సినిమా నిర్మాణంలో తయారైన మూల ఫైళ్ళు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి.
సింటెల్ తను సాకిన పిల్ల డ్రాగన్‌ని ఓ పెద్ద డ్రాగన్ ఎత్తుకో పోతే, తిరిగి పిల్ల డ్రాగన్‌ని పొందడానికి చేసిన సాహస యాత్ర ఈ 14 నిమిషాల సినిమా.
ఈ సినిమాని యూట్యూబు ద్వారా చూడండి:
లేదా, మరింత నాణ్యమైన దృశ్యానుభవం కోసం HD కూర్పుని లేదా ఇతర ఫార్మాటులని సింటెల్ సైటు నుండి దింపుకోవచ్చు.
ఈ సినిమాని బ్లెండర్ అనే బహిరంగాకర ఉపకరణంతో తయారుచేసారు. బ్లెండర్ ఇన్‌స్టిట్యూట్ వారు బహిరంగాకర చిత్రాల మరియు ఆటల తయారీని పెంపొందించడానికై ఈ సినిమాని రూపొందించారు. గతంలో వీరు బిగ్ బక్ బన్నీ (నా టపా) మరియు ఎలిఫెంట్స్ డ్రీమ్ అనే లఘుచిత్రాలనూ, యో ఫ్రాంకీ! అనే ఆటనీ కూడా తయారుచేసి ఉన్నారు.
ఆనంద వీక్షణం!
వీక్షణం నిజం గా ఆనందాన్ని కలిగించిందండి ! ధన్యవాదాలు .
Good link sir. Thank you.
చాలా బాగుంది. చివరిలో మెలికను ఊహించలేదు సుమీ…. అద్భుతం…
bagundhi