బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు – 2

దుకాణాల నామఫలకాలపై కూడా యూనికోడ్ తెలుగు వాడటం మొదలైంది.

చబిల్ దాస్ మాణిక్ దాస్ & బ్రదర్స్ వారి నామఫలకం తెలుగు యూనికోడులో

పై బోర్డులో ఉన్న తెలుగు అక్షరాలు విండోస్ XPలో ఉండే తెలుగు ఖతి గౌతమివి. ఈ దుకాణం, హైదరాబాదులో కృష్ణనగర్ నుండి జూబ్లిహిల్స్ వెళ్ళే దారిలో ఉంది. పటపు లంకె.

థామస్ కుక్ వారు కూడా తమ నామఫలకాలపై తెలుగుని ఉపయోగించారు. పోతన ఖతిలా అనిపించింది. (సికిందరాబాద్ లోని ఆనంద్ సినిమా హాలు దగ్గర) వెళ్తూన్న బస్సులో నుండి చూసాను, పరీక్షగా చూసే అవకాశం రాలేదు. ఎవరైనా చూసి ఉంటే, అవునో కాదో నిర్ధారించండి.

బయటి ప్రపంచంలో మీరు కూడా ఎక్కడైనా యూనికోడ్ తెలుగుని చూసి ఉంటే తెలియజేయండి.

ప్రకటనలు

7 thoughts on “బయటి ప్రపంచంలో యూనికోడ్ తెలుగు – 2

  1. ఆ షాప్ వారు ఫ్లెక్స్ బోర్డ్ అంటించారా? GIMP ఫొటో ఎడిటర్ లో తెలుగు యూనికోడ్ పనిచేస్తుంది. ఆ ఎడిటర్ ని ఫ్లెక్స్ బ్యానర్లు డిజైన్ చెయ్యడానికి వాడొచ్చు.

  2. నా ఆఫీస్ ముందు పెట్టిన సైన్ బోర్డ్ ఫ్లెక్స్ బ్యానర్ మీద ప్రింట్ చెయ్యించి ఇనుప గజాల ఫ్రేమ్ కి తగిలించినది. ప్లెక్స్ బ్యానర్ ప్రింట్ చేసిన డిజైనర్ అడోబ్ ఫొటో షాప్ లో బ్యానర్ డిజైన్ చేసి తెలుగు అక్షరాలకి అను ఫాంట్స్ సాఫ్ట్వేర్ వాడడం జరిగింది. అతను యూనికోడ్ వాడలేదు. GIMP ద్వారా కూడా ఫ్లెక్స్ బ్యానర్లు డిజైన్ చెయ్యొచ్చు. లినక్స్ లో గ్రాఫిక్స్ డిజైనింగ్ మరియు యూనికోడ్ టైపింగ్ కి GIMP వాడడమే సులభం.

    1. ప్రవీణ్ శర్మ, మీ ఆఫీసు బోర్డుని మీరే GIMPలో మీరే డిజైన్ చేసి ఉంటారనుకున్నాను.

      మీరు గ్రాఫిక్ డిజైనింగుకి ఇంక్‌స్కేప్ ఉపయోగించరా? ఇంక్‌స్కేప్‌లో తెలుగుకి తోడ్పాటు ఉంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s