ఫాంట్‌స్ట్రక్ట్ మరియు చుక్కాని (అసంపూర్ణ తెలుగు ఫాంటు)

ఫాంట్‌స్ట్రక్ట్ అనేది పిక్సెల్ ఫాంట్లు తయారుచేసుకోడానికి ఓ అద్భుతమైన (జాల-ఆధారిత) పరికరం. నేనంత బాగా చెప్పలేను గానీ చూసి తెలుసుకోడానికి వారి వెబ్ సైటుని సందర్శించండి.

పిక్సెల్ ఫాంట్లు అనేవి సూక్ష్మ పరిమాణాల్లో కూడా చదవగలిగే విధంగా ఉండటానికి తయారుచేసే ఫాంట్లు. వీటిని ఎక్కువగా ఫ్లాష్ ఉపకరణాలలో ఉపయోగిస్తారు. (లెడ్ లైట్ల బోర్డులకి ఇవి చాలా అనువుగా ఉంటాయనుకుంటున్నాను.)

ఫాంట్‌స్ట్రక్ట్ వారి పరికరం లోని భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది. ఇంకే, నేను ప్రయత్నించి చూసాను. తెలుగుకి సంబంధించినంత వరకూ విడి అక్షరాల వరకూ అయితే పర్లేదు. కానీ, గుణింతాలూ సంయుక్తాక్షరాలు వంటి వాటికి దీనిలో ఇంకా తోడ్పాటు లేదు. ఒత్తులూ గుణింతాలకై GSUB, GPOS వంటి ఓపెన్‌టైప్ సౌలభ్యాలకి తోడ్పాటు ఉండాలి. వీళ్ళని సంప్రదిస్తే, సమీప భవిష్యత్తులో ఆ అవకాశం లేదన్నారు. :(

చుక్కాని
ఫాంట్‌స్ట్రక్టుని ఉపయోగించి నేను తయారుచేసిన తెలుగు అక్షరాల నమూనా:
తెలుగు పిక్సెల్ ఫాంటు నమూనా

అదే ఫాంటు కాస్త పెద్ద పరిమాణంలో:
తెలుగు పిక్సెల్ ఫాంటు పెద్ద పరిమాణంలో

అసంపూర్ణ ఫాంటుని ఔత్సాహికులు ఫాంట్‌స్ట్రక్ట్ నుండి దింపుకోవచ్చు. దీనిలో గుణింతాలూ ఒత్తులూ ఇంకా లేవు గనుక మీరు దీన్ని పెద్దగా ఉపయోగించుకోలేరు.

మీ కోసం ఓ రెండు ఫాంట్‌స్ట్రక్ట్ యొక్క తెరపట్లు:

ఫాంట్‌స్ట్రక్ట్ యొక్క ప్రధాన తెర:
ఫాంట్‌స్ట్రక్టులో తెలుగు అక్షరం చ

మనం ఒక్క లాగివేతతో మనం వాడుతున్న ఇటుక ఆకృతిని మార్చివేసి, కావలసిన వైవిధ్యాన్ని పొండవచ్చు. ఇలా (నక్షత్రాకార ఇటుక స్పష్టంగా కనబడాలంటే, బొమ్మని నొక్కి పెద్ద పరిమాణంలో చూడండి):
ఫాంట్‌స్ట్రక్టులో చతురస్త్రపు ఇటుక బదులు నక్షత్రాకార ఇటుకతో తెలుగు అక్షరాలు

ఈ మధ్య జాలంలో మీ స్వంత ఫాంట్లు తయారుచేసుకోవచ్చు అంటూ కొన్ని సైట్లు వచ్చినట్టు చదివాను. ఎవరైనా వాటి ద్వారా తెలుగు ఫాంట్లు తయారీకి ప్రయత్నించారా? అయితే, మీ ప్రయత్న విశేషాలను పంచుకోండి.

ఈ దిశగా ప్రయోగాలు చేయలనుకునేవారికి ఈ టపా తగినంత ప్రేరణని ఇస్తుందని ఆశిస్తున్నాను.

ప్రకటనలు

ఫాంట్‌స్ట్రక్ట్ మరియు చుక్కాని (అసంపూర్ణ తెలుగు ఫాంటు)”పై 5 స్పందనలు

  1. బాగానే వుంది, కానీ అసలు తెలుగు లో ఒక చిహ్నం పూర్తిగా మాయ మయిపోయింది. వుదాహరణకి చందమామ అనేది ఇప్పుడు మనం చక్రం లో “చ” ని వాడుతున్నాం. కానీ మొదట్లో, అంతే నా చిన్నప్పుడు కూదా కింద ఒక వొత్తు లాంటిది వొచ్చేది.ద్వని “చ” ని “స” ని కలిపితే వచ్చే ద్వని అయ్యేది.జల్లెద కూడా అనతే.తెలుగు అక్షరాలు మిగాతా భాషలకి లాగా కాకుండా ద్వనికి ప్రాధాన్యత నిచ్చి యేర్పరచారు. దాన్ని యెలా తీసుకు రావాలో ఆలోచించండి!

  2. వస్తున్నాయ్!ఇక నుంచీ వాట్ని అలాగే రాస్తాను, మీరు కూదా అలాగే రాస్తే బాగుంటుంది, మన యెంటిటీ పట్ల యెంత చాదస్తంగా నైనా వుండొచ్చు, తప్పు లేదు – కదూ?!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s