జనవరి 2010

నా ఆసక్తులకి సంబంధించిన పనుల/తాజా విశేషాల నివేదిక:

 • స్థానికీకరణ వేదిక ట్రాన్స్‌లేట్‌వికీ ఇప్పుడు మరింత మెరుగయ్యింది. కొత్త విశేషం: పాత అనువాదాల నుండి కొత్త వాటికి సలహాలను సూచిస్తుంది. ఉదాహరణకి క్రింది తెరపట్టుని చూడండి. అనువాద ప్రక్రియ వేగవంతమవడానికి మరియు అనువాదాలలో నియతత్వతకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద సలహాలు
  (1) అనువదించాల్సిన పాఠ్యం; (2) అనువాద సలహాలు; (3) అనువదించే చోటు. అనువాద సలహాల ఎడమ పక్కనున్న బాణాన్ని నొక్కితే, సలహా పాఠ్యం అనువదించే చోటులోనికి కాపీ అవుతుంది.

  ఐడెంటికా ప్రవేశపు తెర (తెలుగులో)

 • నేను స్టేటస్‌నెట్ అనువాదాలని కొనసాగిస్తున్నాను. క్రమేపీ దాని ముఖాంతరం తెలుగు లోనికి మారుతుంది. మీ కోసం ఓ తెరపట్టు కుడివైపున. ప్రస్తుతం 0.9 సంచిక బీటా స్థాయిలో ఉంది.
 • డ్రూపల్ 7 తయారవుతూంది. నెల మధ్యలో ఆల్ఫా1 విడుదలయ్యింది. ఆ వెంటనే దాన్ని అనువదించడానికి కూడా సిద్ధం చేసారు.
 • పోయిన నెల 19% వద్ద ఉన్న పాటలపిట్ట అనువాదాల ప్రగతి ఇప్పుడు 38% కి చేరింది.
 • ఎప్పుడో సంవత్సరం క్రింత కొంచెం చేసి మానివేసిన OLPC తెలుగీకరణని మళ్ళీ మొదలుపెట్టాను. 100 డాలర్లకి (చిన్నపిల్లల) అంకోపరుల ప్రాజెక్టు ఉంది కదా, అదే ఇది.
 • మంటనక్క 3.6 సంచిక విడుదలయ్యింది. ఇప్పుడే దింపుకోండి. (ఆగండి, మీరు ఇప్పటికే పాత మంటనక్కని వాడుతుంటే, Help మెనూ నుండి Check for updates… అన్న ఆదేశాన్ని ఇవ్వండి. సరిపోతుంది. కొత్త సంచిక విడిగా స్థాపించబడకుండా, పాతదే తాజాకరించబడుతుంది.)

అంతే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s