‘యాహూ మెయిల్’ అని తెలుగులో ఎందుకు వెతుకుతున్నారు?

ఆశ్చర్యకరంగా నా బ్లాగుకి చాలా మంది “యాహూ మెయిల్” అని తెలుగులో శోధించి (ఈ టపాకి) వస్తున్నారు. జనాలు యాహూ మెయిల్ గురించి అంత ఎక్కువగా ఎందుకు వెతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రింది తెరపట్టులలో మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్న కీపదాల సందర్శనలకి తేడాని గమనించండి. పొంతనే లేదు. (ఇదేమైనా గూగుల్ బాంబు లాంటిది కాదు కదా?)

గత 30 రోజులలో పై ఐదు కీపదాలు, వాటి ద్వారా నా బ్లాగుకి వచ్చిన సందర్శనలు:

"యాహూ మెయిల్" కీపద శోధనతో నా బ్లాగుకి వచ్చిన సందర్శనలు

ఇది ఇటీవలి పరిణామం కాదు, గత మూడు నెలలు… ఊహూ… సంవత్సరంగా కూడా:

పై 5 కీలక పదాల సందర్శకులు - గడచిన 3 నెలల్లో

పై 3 కీలకపదాల ద్వారా సందర్శనలు - గడచిన సంవత్సరంలో

మీ బ్లాగుల్లో ఏమైనా ఇలాంటి తమాషా ధోరణులు కనిపెట్టారా? ఒకవేళ, మీరు యాహూ మెయిల్ అని వెతికి ఈ బ్లాగుకి వస్తే గనక తెలుగులో ఎందుకు వెతికారో (చెప్పదలిస్తే) చెప్పండి.

తా.క.: అన్నట్టు, జాలాన్ని తెలుగులో వెతకవచ్చని మీకు తెలుసుకదా!

8 thoughts on “‘యాహూ మెయిల్’ అని తెలుగులో ఎందుకు వెతుకుతున్నారు?

  1. యాహూ మెయిల్ అని టైపు చేసి సెర్చ్ నొక్కితే మొదట వచ్చేది మీ టపానే, ఎందుకంటే మీరు అందులో రాసిన “యాహూ మెయిల్‌లో తెలుగు!” టపానే కారణం.

  2. నాకు గుర్తు సుమారు ఏడాది క్రితం యాహూలో (ఈ సమస్య జీ-మెయిల్ లో ఉండేది కాదు) యూనికోడ్ ఫాంట్ లో మెయిల్ పంపిస్తుంటే, పంపినవాడికి డబ్బాలు కనిపిస్తుంటే గూగుల్ లో సెర్చ్ చేసి కొన్ని గూగుల్ గ్రూపులను, బ్లాగులను సందర్సించివట్లు గుర్తు. వాటి లో వీవెన్ గారి పోస్ట్లుకూడా చూసినట్లు గుర్తు.
    అదేమయినా ఒక కారణం అయి ఉండొచ్చు.

  3. నా కీ బోర్డు తెలుగు లో వుండగానే అది ఇంగ్లిష్ కి మార్చకుండా యాహూ మైల్ అని టైప్ చేశా ,,,ఇదిగో ఇలా మీరు ప్రత్యక్షమయ్యారు …యెమయినా గాని భూత శాంతి చేయండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.