తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)

వికీపీడియా అకాడమీ గురించి ఇటీవలే అర్జున రావు ఓ టపా రాసారు. ఆయన మాటల్లోనే:

వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు ఉన్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.

ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇవీ వివరాలు:

  • వేదిక: chat.etelugu.org
  • సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు

మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు.

కొన్ని ఉపయోగపడే లింకులు:

ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. (ఒకవేళ మీరు ఈ సెషనులో పాల్గొనలేక పోతే, మీ సందేహాలను ఇక్కడ వ్యాఖ్యలుగానైనా లేదా తెవికీలో అయినా అడగండి.)

4 thoughts on “తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)

  1. మాకు కూడా వికీపీడియాలో సమాచారం చేర్చవచ్చని తెలిసినా, దాని ఫార్మాటులో ఎలా పెట్టాలో అని తెలియక, తాత్కాలికంగా వదిలేశాం. లేకపోతే, ఈ పాటికి కొన్నయినా వ్యాసాలు అందులో చేర్చగలిగే వాళ్ళం.

    నిజానికి, వికీపీడియాలో ఉన్న సైన్సు వ్యాసాలను తెలుగులోకి అనువదించాలని మా కోరిక. లేదా మా శాస్త్రవిజ్ఞానం బ్లాగులోని టపాలను అయినా చేర్చాలనుకుంటున్నాం. మీరు సహకారం అందిస్తామంటున్నారు కాబట్టి, తొందర్లోనే మా పని ప్రారంభిస్తాం. ధన్యవాదములు.

  2. మంచి అవకాశాన్ని కలిగిస్తున్నందుకు ముందుగా మీకు నా ధన్యవాదాలు. తప్పని సరిగా రేపు పోల్గొనే ప్రయత్నం చేస్తాను. నేను రెండు రోజులనుంచి వికీ సోర్సులో శ్రీ గీతామృత తరింగిణి పేరుతో భగవద్గీత మూల శ్లోకములు, శ్రీ పూడిపెద్ది వారి తెలుగు పద్యానువాదం మఱియు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారి తెలుగు తాత్పర్యం మూడూ కలిపి ఒకే పేజీలో టేబ్యులర్ ఫారమ్ లో వచ్చేలా చేసేటందుకు శ్రీ రాకేశ్వర గారి సహాయంతో ప్రయత్నిస్తున్నాను. ఇదే సమయంలో మీ ఆహ్వానం మాకు నిడంగా ఉపయోగకరం అనిపిస్తున్నది.

  3. తెవికీ ఈ-అకాడమీ జయప్రదంగా మొదలయ్యింది. అదీ సాఫ్ట్వేర్ స్వాతంత్ర దినం (19 సెప్టెంబరు) న ప్రారంభించటం ఇంకా ఆనందంగా ఉంది. ఇది కాకతాళీయమో లేక పథకం ప్రకారమో వీవెన్ తెలపాలి.

    ఈ సమావేశం పై చిన్న సమీక్ష:
    అర్జున, వీవెన్, మాకినేని ప్రదీప్, తెవికీ స్థాపకుడు రవి వైజాసత్య, నాగప్రసాద్,శీను, నరసింహా పాల్గొన్నారు.
    అర్జున అందరికి స్వాగతం చెప్పి, వెబ్ పరిచయ లింకులను లేదా వారి వారి బ్లాగు లింకులను తెలియ చేయమని కోరారు. నాగప్రసాద్ చాలా అనుభవం గల బ్లాగరు అయినా కంప్యూటర్ పరిజ్ఞానం అంతగా లేదని చెప్పారు.

    శీను, తెవికీ , రచ్చబండ అంటే ఎమిటని, ప్రదీప్, గూగుల్ ట్రాన్స్లేషన్ కిట్ గురించి, నాగప్రసాద్ తెవికీ పార్మాటు గురించి, మరియి అర్జున తెవికీలో పేజీకీ మార్పు జరిగినప్పుడు, ఈ మెయిల్ రావాలంటే ఏంచేయాలని అడిగాతే మిగతావాళ్లు వాటికి సమాధానాలు తెలియచేశారు.

    తెవికీ శోధన మెరుగయ్యిందని రవి చెప్పగా, వీవెన్ తెవికీ మీడియావికి పేజీ లింకు తెలియచేశారు. ఈ ఛాట్ సౌకర్యం తెవికీలో నే వుం టే బాగుంటుందని వీవెన్ చెప్పగా సర్వర్ శ్రమ తగ్గించటానికి అలా చెయ్యలేదని రవి అన్నారు. వీవెన్ దృష్టిలో ఇది సర్వరకిఏమంత ఇబ్బంది పెట్టదని చెప్పారు.
    ఈ ప్రయత్నం ద్వారా మరిన్ని తెవికీ సభ్యులు క్రియాశీలకమైతే, తెవికి ని మరింత ఉన్నత స్థాయికి చేర్చవచ్చని అందరూ అభిప్రాయపడ్డారు.

    కొందరికి ఛాట్ అనుసంధానంలో మధ్యలో కొంత అంతరాయం కలిగినా, వెంటనే వాటిని తొలగించుకొన్నారు.

    ఈ కార్యక్రమం సరియైన సమయానికి ప్రారంబమైనా, ఆసక్తికరమైన అంశాల చర్చకి రావడంతో, అరగంట ఆలస్యంగా ముగిసింది. దీనిని ముందు ముందు ఎలా కొనసాగించాలో నిర్ణయించటానికి, మీ సలహాలు తెలియచేయండి.

    పాల్గొన్న అందరికి ధన్యవాదాలు.
    అర్జున
    ***

Leave a reply to నాగప్రసాద్ స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.