ఇటీవల గూగుల్ ట్రెండ్స్‌లో ‘telugu’ మరియు ‘తెలుగు’ ల అన్వేషణల ధోరణి చూసాను. (క్రింది చార్టు చూడండి.) ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది తెలుగు అక్షరాలలో అన్వేషణ గురించి. గత సంవత్సర కాలంగా చెప్పుకోదగ్గ (అంటే గూగుల్ వాడు గుర్తించి ట్రెండ్స్‌లో చేర్చదగినన్ని) అన్వేషణలు జరుగుతున్నాయన్న మాట. 2009 ఏప్రిల్ తర్వాత ఎర్రగీత కొంచెం పైకి చూస్తుంది కదూ. లేక నాకే అలా అనిపిస్తుందేమో ;). తెలుగు అక్షరాలలో ప్రస్తుతం వెతకగలుగుతునప్పటికీ, వెతుకుతున్నవారు తక్కువేనేమో.
తర్వాత నా బ్లాగుకి తెలుగు పదాలతో అన్వేషణలు ఎన్ని ఉన్నాయో చూస్తే, గత 30 రోజులలో వచ్చిన వివిధ అన్వేషకులు 49 కీలకపదాల ద్వారా నా బ్లాగుని కనుగొన్నారు. ఒక్కో కీలకపదాన్నీ ఎన్నిసార్లు ఉపయోగించారన్నది కాకుండా, మొత్తం మీద 49 ప్రత్యేకమైన పదబంధాలు. వీటిల్లో 25 తెలుగు అక్షరాలతో కూడి ఉన్నాయి. అంటే, సగం కంటే కొంచెం ఎక్కువ.
మరి మీ బ్లాగుకి లేదా సైటుకి రావడానికి సందర్శకులు తెలుగు కీలకపదాలని వాడుతున్నారా?
తెలుసుకోవడం ఎలా? మీ వర్డ్‌ప్రెస్ బ్లాగులో అయితే ఇలా తెలుసుకోవచ్చు:
- మీ బ్లాగు నిర్వహణా కేంద్రానికి (డాష్‌బోర్డుకి) వెళ్ళండి. అక్కడినుండి, బ్లాగు గణాంకాలకి వెళ్ళండి.
- తర్వాత, “శోధనాంత్రాల పదాలు” అన్న శీర్షికపై నొక్కండి. (ఇది గత 7 రోజులలో మీ బ్లాగుకి వచ్చిన అన్వేషణల్ని చూపిస్తుంది.)
- ఆ తర్వాత, “30 రోజులు” అన్న లింకుపై నొక్కండి.
- తెలుగు అక్షరాలలో ఎన్ని అన్వేషణలు ఎన్ని ఉన్నాయో, మొత్తం అన్వేషణలు ఎన్ని ఉన్నాయో లెక్కగట్టి శాతం తీయండి.
గూగుల్ అనలిటిక్స్‌లో అయితే, ఎడమ పట్టీలోని Traffic Sources విభాగంలో Keywordsకి వెళ్ళండి.
(కీలకపదాలని తెలుగు మరియు ఆంగ్లం అంటూ విడగొట్టి చూపే సౌలభ్యమేదీ ఈ గణాంక ఉపకరణాలలో లేదు కాబట్టి మీరు కొంత కష్టపడక తప్పదు. అంత తీరికా ఓపికా లేకపోతే, కనీసం కీలకపదాలని పైకీ కిందికీ ఓ సారిచూస్తే ఓ అంచనాకి రావచ్చేమో ప్రయత్నించండి.)
అనుబంధ టపా: Searching the Web in Telugu.
నాకు ఈ విధంగా కీ వర్డ్స్ సమాచారం తెలుస్తుంది.

తెలుగురత్నకి గూగిల్ సెర్చ్ ద్వారా నెలకి సుమారు ౩౦౦ మంది వస్తారు.
ఈ నెల aw stats
—————————————————————
Search Percent
——————————————————————-
telugu 25 10.3 %
teluguratna 13 5.3 %
అరుంధతి 10 4.1 %
తెలుగు భాషలో 8 3.3 %
telugu ratna 8 3.3 %
స్వీట్స్ 6 2.4 %
సినిమా పరిశ్రమ 4 1.6 %
teluguratna.com 4 1.6 %
vilasandhra.com 4 1.6 %
వదినా 3 1.2 %
Other phrases 157 64.8 %
నా కంట్రోల్ పానెల్ లో కూడా aw stats ప్లగిన్ ఉంది. లినక్స్ సర్వర్లలో ఎక్కువగా CPanel, దానికి అనుబంధంగా aw stats ప్లగిన్ వాడుతారు.
Find my opinions here
తెలుగు బ్లాగర్లంతా తెలుగులోనే శోదిద్దాం …
తెలుగులోనే శోధిద్దాం ..వీవెనుడి గారి టెక్కు నిక్కులు అప్పుడప్పుడు ఆలోచనలు రేకిట్టిస్తుంటాయి.ఆయన బుర్రలోనే పరిశోధనా శాల కట్టుకున్నట్లున్నారు. నాకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ .తెలుగులో మాత్రమే శోధించగలిగే ప్రత్యామ్నాయాలు తెలుప గలరు ….మనం తెలుగులోనే శోధిద్దాం . …నూతక్కి రాఘవేంద్ర రావు.
తెలుగులో వెతకగలగడానికి ఈ లింకులు చూడండి:
* Searching the Web in Telugu
* లేఖిని నుండి గూగుల్ శోధన