స్వేచ్ఛ లినక్స్ 07

గమనిక: దాదాపు ఓ సంవత్సరం క్రితం స్వేచ్ఛ తెలుగు నిర్వాహక వ్యవస్థ గురించి పరిచయం రాద్దామనుకుని మొదలుపెట్టాను. కానీ రాయలేదు. :-( ఇప్పుడు ఇలా ప్రచురించేస్తున్నాను.

5 thoughts on “స్వేచ్ఛ లినక్స్ 07

  1. వీవెన్ గారు,
    “స్వేచ్ఛ” మన దేశానికి అత్యవసరమైనది. ఆ మార్గంలో పని చేస్తున్న మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా..! ప్రస్తుతం ఈ విషయం మీద పని చేయటానికి సమయం కేటాయించ లేనందుకు చింతిస్తున్నాను.
    దీని గురించిన పూర్తి సమాచారం ఎక్కడ లభిస్తుంది?
    ఇది CentOS / Ubuntu లకు ఏమైనా సంబంధం ఉందా..!?
    గత కొద్ది వారాల క్రితం release అయిన Cuba Linux సృష్టిస్తున్న సంచలనాలు మీరు గమనిస్తూనే ఉండొచ్చు. ఆ దిశ గా మన ప్రభుత్వాలు కూడ ఇటువంటి ప్రాజెక్టు లకు తోడ్పాటు నందించేదుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా..!?

    ఇంకొక వ్యక్తిగత ఎంక్వైరీ.., కొన్ని సంవత్స్తరాల క్రితం 2002~2003 కాలంలో.., విజయవాడ సిద్ధార్ధ అకాడెమీ వినయ కుమార్ గారు, సరిగా ఇటువంటి ప్రాజెక్టే చేస్తున్నామని చెప్పారు.., ఆ తరువాత నాఉద్యోగం లో పడి ఆ ప్రాజెక్టుకు ఏమీ సహాయం చేయలేక పోయాను. “స్వేచ్చ” ని చూసిన తర్వాత అది ఇదేనా అని కొంచెం ఉత్సుకత.

    –రాజ మల్లేశ్వర్.

  2. @రాజ మల్లేశ్వర్ కొల్లి,

    నేను స్వేచ్ఛ మీద పనిచేయట్లేదు. (కానీ వేరే చోట్ల తెలుగు స్థానికీకరణల్లో పాల్గొంటున్నాను.)

    స్వేచ్ఛ లినక్స్ డెబియన్ పై ఆధారపడింది. ఉబుంటూ కూడా డెబియన్ ఆధారితమే. స్వేచ్ఛ గురించి వారి వెబ్ సైటు swecha.orgలో తెలుసుకోవచ్చు. IndLinux Telugu వారి మెయిలింగు లిస్టు కూడా చూడండి.

    ఈ దిశగా మన ప్రభుత్వాలేమైనా చేస్తున్నాయేమో తెలియదు. నాకు సందేహమే.

  3. ఫిబ్రవరి 21 నాడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘తెలుగు భాషోద్యమ సమాఖ్య’ హైదరాబాద్ ఇందిరాపార్క్ లోని ధర్నాచౌక్ లో ఉదయం 9 నుండీ సాయంత్రం 7 గంటల వరకూ సామూహిక నిరాహారదీక్ష చేపట్టనుంది. ఈ ఉద్యమంలో తెలుగును ప్రేమించే అందరూ పాల్గొనొచ్చు.
    ఈ ఉద్యమదీక్ష ద్వారా ప్రభుత్వాన్ని కోరదలచిన విషయాలు ఈ క్రింది మూడు.
    1. తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలి: తెలుగు రాష్ట్రానికి ఒక భాషా విధానం ఉండాలి. తెలుగు రక్షణ, అభివృద్ధి-భాషావిధాన లక్ష్యాలుగా ఉండాలి. తెలుగు భాషా సాహిత్యాల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఈ శాఖను ప్రాధమిక విద్యాశాఖతో పాటూ ఒకే మంత్రి అధీనంలో ఉంచాలి.
    2. మాతృభాషలోనే ప్రాథమిక విద్య: ప్రాధమిక విద్యను మాతృభాషలోనే బోధించడం శాస్త్రీయమైన, హేతుబద్ధమైన పద్దతి. ప్రభుత్వ,ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని శ్రద్ధతో అమలు చెయ్యాలి.
    3. ప్రజల భాషలోనే పరిపాలించాలి: చట్టసభలు, అన్ని స్థాయిల్లో పరిపాలన, న్యాయస్థానాలు తెలుగులోనే నడవాలి. ఇందుకోసం ప్రత్యేకించి తెలుగు ప్రాధికార సంస్థను అన్ని అధికారాలతో ఏర్పరచాలి.

Leave a reply to వీవెన్ స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.