డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

తెలుగు బ్లాగుల దినోత్సవంఅంటే, ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన. మీ ఊళ్ళో/నగరంలో/పట్టణంలో ఆ రోజు తెలుగు బ్లాగరుల సమావేశాన్ని నిర్వహించండి. మీరు హైదరాబాదులో ఉంటున్నట్లయితే, మాతో కలవండి.

ఏమేంచెయ్యొచ్చు:

 • అందరూ కలిసి ఏదైనా సామాజిక ప్రయోజనమున్న పని చేయవచ్చు.
 • బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవచ్చు.
 • అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
 • లేదా, జాలంలో తెలుగుకై మరింత గంభీరమైన పనులూ చెయ్యవచ్చు:

ఎలా:

 1. మీ ప్రాంతంలో ఉంటున్న బ్లాగరులెవరో తెలుసుకోండి. లేదా మీ ఊళ్ళో సమావేశం నిర్వహిద్దామనుకుంటున్నట్టు, తెలుగు బ్లాగు గుంపులోనూ, మీ బ్లాగులోనూ ప్రకటించండి. స్థలం మరియు సమయం నిర్ణయించి తెలియజేయండి.
 2. మిమ్మల్ని సంప్రదించగలిగే సమాచారం (ఫోను నంబరు, ఈ-మెయిలు చిరునామా, గట్రా) తెలియజేయండి.
 3. ఆ రోజు అనుకున్న స్థలంలో అనుకున్న సమయానికి అందుబాటులో ఉండండి.
 4. సమావేశం తర్వాత సమావేశం ఎలా జరిగిందీ వివరాలతో మీ బ్లాగులో టపా వ్రాయండి.

డిసెంబర్ రెండవ ఆదివారమే ఎందుకు:

 • 2007 డిసెంబరు నెల 13వ తేదీన తెలుగు బ్లాగు గుంపులో సభ్యుల సంఖ్య 1,000కి చేరుకుంది. ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఆదివారాలు అయితే జనాలకి ఖాళీ ఉంటుందని.
 • ప్రతీ నెలా రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల సమావేశం ఉంటుంది. మళ్ళీ బ్లాగుల దినోత్సవం కోసం ప్రత్యేక సమావేశం అవసరం లేకుండా, అదే రోజునైతే బాగుంటుందని.

పైన నేనుదహరించిన బొమ్మను మీ బ్లాగుల్లో వాడుకోవచ్చు.

తా.క.: హైదరాబాదు సమావేశపు నివేదికని e-తెలుగు సైటులో ప్రచురించాం.

ఆనంద బ్లాగాయనం!

33 thoughts on “డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!

 1. వీవెన్,
  సంతోషం, తప్పకుండా. సి బి రావు గారు కూడా ఈ-ఉత్తరములో నాకు సూచించారు. నాగరాజా వారి బ్లూమింగ్టన్ లో కానీ లేదా మా షికాగో లో కానీ సమావేశం ఏర్పాటు చేసి ఆ విశేషాలని అందరికీ తెలియచేస్తాము.

 2. ఆ రోజుకోసమే బ్లాగేర్ తపస్సు చేసేది,ఆ మాట కోసమే నెటిజెన్ ఎదురు చూసేది .ఈ బ్లాగోస్తావానికి ఎలాగైనా వీలు చూసుకుని రావాలన్నదే నా ద్రుడసంకల్పం. సంకల్ప సిద్ది కలుగు గాక మనమంతా కలువు గాక ఆ ఫై కెవ్వు కేక.

 3. నేనూ వస్తున్నాను, మౌనప్రేక్షకుడుగా !
  కానీ ఎక్కడికి రావాలి ? ఎప్పుడు రావాలి ? కృష్ణకాంతుని ఉద్యానానికేనా ? ఎప్పటిలా ?

  మఱొక విషయం. బ్లాగాయనమే సరైనది. ముందుపదంలో రకారం గానీ, షకారం గానీ ఉంటేనే ‘అయణం’ అనాలి.

 4. అయ్యా – మీ కో మంచి శుభవార్త ! తెలుగులో టి షర్టులు విన్నారా ? చూసారా ? రెండే రెండు డిసైనులు శాంపిలికి ఇచ్చాను. ఏవరైనా అడిగితే ఉచితంగా మంచి స్లొగన్ రాసి ఇస్తాను. వాటిని మీరు అసలైన టి షర్టు మీద ప్రింటు చేసుకోవచ్చు .”

 5. Hail Telugu Blogs!

  On Dec 14th: please discuss this issue-

  “Be the Change you belive in” అన్నాడు మహాత్ముడు. మనం అందరూ సంఘటితమై ఓ పల్లెటూర్లో, ఓ పూరిపాకలో, ఓ పాఠశాల ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? దాని కోసం మన బ్లాగర్లలందరమూ పూనుకొంటే ఎలా ఉంటుందంటారు? “కొత్తపల్లి” అన్న బ్లాగు నిర్వహిస్తున్న మా “చెన్నేకొత్తపల్లి” టింబక్టు వారి సహాయసహకారాలు తీసుకోవచ్చు. “కూడలి” అన్న పేరు పెడితే సముచితంగానూ ఉంటుంది. అప్పుడు మనం కూడా “నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను” అని కాస్తైనా తృప్తి చెందొచ్చు.

  ‘Timbaktu’ అంటే “సరిహద్దు రేఖ” అని అర్థం.
  http://www.timbaktu.org/index.html

  ఏమేం చేయొచ్చు?
  1.Contribute Your Skills: Volunteer your services
  2.Donate books, computers, lab equipment, games for the Childrens’ Resource Centre.
  3.Contribute financially : Raise funds
  Help Build A Corpus Fund.

  They are running the following schools with the help of various organizations:

  ‘టింబక్టు బడి’
  ‘వెన్నెల బడి’
  ‘ప్రకృతి బడి’
  ‘చిన్న బడి’

  అందరూ కలసి వస్తే, మనం కూడా ‘కూడలి బడి’ని తెలుగు భ్లాగుల తరఫున మొదలు పెట్టవచ్చు. పెద్దలు ఏమంటారు?

 6. ఇస్మాయిల్ గారు చెప్పిన ఐడియాకి నా పూర్తి మద్దతునీ, నా చేతనైనంత ఆర్ధిక సహాయాన్ని అందచేస్తానని బ్లాగర్లందరికీ తెలియజేసుకుంటున్నాను. కూడలి లో బ్లాగర్లు, వ్యాఖ్యాతలు చాలా మందే అయినారు కావున, ఇది ఇక్కడనుంచి, తరవాతి లెవెల్ కు తీసుకెళ్ళి ఒక నిర్మాణాత్మకమైన పనేదైనా చేసి, భవిష్యత్తు తెలుగు బ్లాగర్లందరికీ ఉదాహరణని ఇవ్వడం అని నాకనిపిస్తోంది.

  Kumar

 7. నేను కొంచెం అలస్యంగా ఈ టపా చూసాను.
  చాల సంతోషంగ వుంది.
  పశ్చిమ గోదావరి ఏలురు నందు కార్యక్రమం నిర్వహించ తలుస్తునాను.
  పరిసర ప్రంతాల బ్లాగర్లను స్పందించవలసినదిగ మనవి.
  email: aparanji_aparanji@rediffmail.com

 8. Subramanyam, టీషర్టులు మంచి ఆలోచన. e-తెలుగు తరపున వేయంచవచ్చు. మరిన్ని వివరాలు తెలుపండి.

  Dr.Ismail, మంచి ఆలోచన. చర్చిస్తాం.

  Aparanji Fire Arts, పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించాలని శివ కూడా ఆలోచిస్తున్నారు. చూడండి.

  RK, పాఠకులూ రావొచ్చు.

 9. పూర్తిగా తెలుగులో విద్యాభోధన అయిన పక్షంలో బడి అలోచనకు నా పూర్తి మద్దతు. నాకు వీలయినన్ని రోజులు వుచితంగా పాఠాలు చెప్పడానికి కూడ నేను సిద్దం. ప్రస్తుతం హైదరబాదు లో లేను కనుక సమావేశానికి హాజరు కాలేను.

  ప్రసాదం

 10. మంచి ఆలోచన , సమాజం బాగు కోసమే బ్లాగు లైతేనే హితం.నూత్న బ్లాగు ప్రక్రియ నూత్న ఒరవడి ని సృష్టించాలి.కొందరి బ్లాగులు ఆధ్యాత్మిక దారి పట్టాయి,మరికొందరివి వర్గాలను సృష్టించేవిగా,ద్వేషాలను వెళ్ళగక్కేవిగా ఉంటున్నాయి.ఈ బ్లాగు దినోత్సవాన్న ఆలోచిద్దాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.