డాట్‌క్లియర్ అనేది ఒక బ్లాగింగ్ ఉపకరణం. ఇది బహిరంగాకరం (open source). మన స్వంత గూళ్ళలో దీన్ని స్థాపించుకోవచ్చు. దీనిలోని ప్రత్యేక సౌలభ్యాలు నాకు తెలిసినవి (ఓ రెండు గంటల ఉపయోగం తర్వాత) ఇవీ:
- ఒకే స్థాపనలో బహుళ బ్లాగులని సృష్టించుకోవచ్చు.
- టపాలను వికీ చంధస్సు (syntax) లో కూడా (WYSIWYG లేదా (X)HTML పద్ధతులతో పాటుగా) వ్రాసుకోవచ్చు.
దీన్ని తయారీదార్లు ఫ్రెంచి వాళ్ళు. దీన్ని తెలుగులోనికి నేను అనువదిస్తున్నాను (ఫ్రెంచి నుండి కాదు). తెలుగులో పరీక్షా బ్లాగుని చూడండి (దీని ప్రస్తుత తెలుగు అనువాద స్థితిని అక్కడ చూడవచ్చు).
మీ కోసం కొన్ని తెరపట్టులు.



ఆనంద స్థానికీకరణం!
ఇదేదో బాగానే ఉన్నటున్నది. మీరన్నట్టు కొంత కసరత్తు అవసరమేమో?
ఇంకా ఇంగ్లీషు పదాలే వాడుతున్నారు స్థానికీకరణలో ! ఉదాహరణకి లింకులు. మన తెలుగు పదం గుంపులో జనామోదం పొందిన పదాల్ని ఇకనైనా స్థానికీకరణలో సద్వినియోగానికి తేగలరు.
బాగుందండీ ఇదేదో.. చూడాలి.
idedo chala bagundi