ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా!

ఈ రోజే (అక్టోబర్ 8న) ఓపెరా తన విహారిణి యొక్క 9.60 కూర్పుతో బాటుగా తెలుగు పాఠాంతరాన్ని కూడా విడుదల చేసింది. ఇది నిజంగా బ్రహ్మాండమైన వార్త! ఓపెరా జిందాబాద్!! ఓపెరా వారికి భారత దేశపు సైటు కూడా ఉంది, కానీ అది హిందీలో మాత్రమే లభ్యమవుతున్నట్టుంది.

దిగుమతి లింకు: opera.com/download (అక్కడ Telugu భాషని ఎంచుకోండి)

స్థాపన ప్రక్రియ అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. ఒక్కసారి స్థాపనమైన తర్వాత తెలుగందుకుంటుంది. అయితే చాలా వరకు తెలుగు పదాలు మనమనుకున్నవి లేవు. కానీ మంచి ప్రారంభం. మీకోసం కొన్ని తెరపట్టులు మరియు ఇతర వివరాలు.

తెలుగు ఓపెరా విహారిణిలో ఓపెరా.కామ్ వాకిలి
తెలుగు ఓపెరా విహారిణిలో ఓపెరా.కామ్ వాకిలి
తెలుగు ఓపెరాలో మెనూ అంశాలు
తెలుగు ఓపెరాలో మెనూ అంశాలు

ఓపెరా యొక్క విహారిణి చరిత్రలో (గతంలో మనం సందర్శించిన పేజీలలోని పాఠ్యంతో సహా) చిరునామా పట్టీ నుండే వెతకగలిగే సౌలభ్య సహాయంతో తెలుగులో కూడా వెతకవచ్చు.

ఓపెరాలో విహారిణి చరిత్రలో తెలుగు అన్వేషణ
ఓపెరాలో విహారిణి చరిత్రలో తెలుగు అన్వేషణ

మెనూలు మరియు ఇతర అంశాలు అన్నీ దాదాపుగా తెలుగులోనే ఉన్నాయి.

తెలుగు ఓపెరాలో ప్రాధాన్యతల (అ�ిరుచుల) కిటికీ
తెలుగు ఓపెరాలో ప్రాధాన్యతల (అభిరుచుల) కిటికీ

ఓపెరా తెలుగీకరణపై పనిచేసిన వారికి అభినందనలు! ఓపెరా జిందాబాద్!!

ఆనంద జాలా విహారణం!

20 thoughts on “ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా!

 1. చాలా మంచి వార్త…
  [లినక్సులో] మీ ఓపెరా విహారిణి తెలుగులో రావాలంటే ఈ లంకె కి వెళ్ళి తెలుగుకి సంబంధించిన లాంగ్వేజ్ ఫైలుని దిగుమతి చేసుకోండి.

  తర్వాత Tools > Preferences > General Tab కి వెళ్ళి Details మీద నొక్కి దిగుమతి చేసుకున్న లాంగ్వేజ్ ఫైలుని ఎంచుకోండి.
  మీ ఓపెరా విహారిణి తెలుగులో కనబడుతుంది.

 2. మంచివార్తను అందించారు.విజయదశమి శుభాకాంకాంక్షలు.ఆ లోకమాత మీకు ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ….

 3. ఓపెరా మినీ సంగతి మీరే చెప్పాలి మాస్టారు.చాలా రోజులుగా ఓపెరా మినీ , నా మొబైల్ లో తెలుగు అక్షరాలు కనబడేలా (కూడలి, మన బ్లాగులు చదువుకునేలా)దొరుకుతుందేమో అని చూస్తున్నాను. అయితే, వారి faqs లో మాత్రం , యూనీ కోడు తెలుగు కనిపించాలంటే, మొబైల్ ఫోన్ లోనూ, తెలుగు యూనీకోడ్ సపోర్ట్ ఉండాలి అని చదివాను. ఆ లెక్కన, ఈ తెలుగు ఓపెరా కూడా పనికొస్తుందో రాదో?

 4. వీవెన్ గారూ,
  నేను ఒపేరా విహారిణి 10.10 vఎర్షను స్థాపించుకున్నాను. దానిలో తెలుగు సైట్లు చూస్తుంటే తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ, అన్నీ అలుక్కుపోయినట్టు గా కనిపిస్తున్నాయి. FF3.5 లో పద్మా తో తెలుగు బాగా కనిపిస్తోంది. ఒఫేరాకి కూడా అలాంటి addons ఏమన్నా స్థాపించుకోవాలా? దయ చేసి సహాయం చెయ్యగలరు.

  1. మీరు వాడేది విండోస్ అయితే, ఈ లింకులోని మొదటి మూడు సోపానాలు పాఠించండి: telugublog.blogspot.com/2006/03/xp.html.
   మీకు ఓపెరాలో సరిగా కనిపించని ఒక సైటుని తెలియజేయండి.

   లినక్స్ ఓపెరా అయితే తెలుగుని సరిగా చూపించదు.

 5. మీ మొబైల్ లో ఒపేరా ని స్థాపించిన తరువాత address bar లో ఇది టైపు చెయ్యండి
  opera:config
  అందులో చివరి option
  “use bitmap fonts for complex scripts” కి yes
  ఎంచుకోండి
  settings ని save చెయ్యండి
  అంతే ఇక తెలుగు లో తీయదనాన్ని ఆనందించండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.