కొన్నాళ్ళ కిందట పొద్దులో నేను జాలంలో శ్రమదానం అనే శీర్షికతో ఓ సంపాదకీయం రాసాను. దానికి కొనసాగింపుగా మరిన్ని వివరాలతో ఒక్కో అంశాన్ని సృషిస్తూ మరికొన్ని టపాలు రాయాలనుకుంటున్నాను. స్థానికీకరణల గురించి నేను రాసిన మరో టపాకి ఇది పరిచయం.
జాలంలో మనం తోడ్పడదగ్గ పనుల్లో వివిధ మృదూపకరణాలని తెలుగులోనికి స్థానికీకరించడం (లేదా తెలుగీకరణ) అనేది ఒకటి.
ఆయా ఉపకరణాలు వాడే సాంకేతికతలని బట్టి వాటి స్థానికీకరణ ప్రక్రియల సరళత లేదా క్లిష్టత ఉంటుంది. స్థానికీకరణ ప్రక్రియలలోని కష్టాలని తొలగించి, తేలికపరచి, ఎక్కువ మంది (కార్యక్రమణ పరిజ్ఞానం (programming knowledge) లేనివారు కూడా) పాల్గొనేలా చేయడానికి ప్రయత్నాలు ఎప్పట్నించో జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్థానికీకరణలని సులువైన అంతరవర్తి (interface) తో, ఎక్కువ మంది ఒకేసారి చేయగలిగేలా జాల ఉపకరణాలు (web applications) తయారవుతున్నాయి.
ఇప్పటికే, చాలా ఉపకరణాల స్థానికీకరణలని జాలంలోనే చేయవచ్చు. తెలుగు స్థానికీకరణని చెయ్యదగిన వివిధ జాల నెలవుల గురించి, వాటిల్లోని కొన్ని ప్రాజెక్టుల ప్రస్తుత తెలుగీకరణ స్థితి గురించి మీకు పరిచయం చేసే టపాని నేను Crossroadsలో రాసాను: జాలంలో మనం తోడ్పడదగ్గ వివిధ ఉపకరణాల స్థానికీకరణలు.
ఈ తెలుగీకరణల ప్రయత్నాలలో మీరూ ఓ చేయి వేస్తారని ఆశిస్తున్నాను.
ఆనంద స్థానికీకరణం!
Veven gaaru,
చాల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మీటింగ్స్ అటెండ్ అవుదామని కాని వెళ్ళు చిక్కడం లేదు .l10n లో ఓ చెయ్యి వేయాలి.
PS-FIREFOX3 పార్టీ లో కలిసాం గుర్తుందా వీవెన్ గారు.
నేను సిద్దమే, కాకపొతే నేను మొత్తంగా జావా UI (swing ఉపయోగించి) లో కొద్దిగా సిద్దహస్తుడను (సొంత డబ్బా కాదు) నేను ఏ విధంగా సహాయ పడగలనో తెలియచెయ్యగలరు.
నా మెయిల్-ఐడి d.prathap@gmail.com
@Dr.Pavan మీరు గుర్తున్నారు!
@ప్రతాప్, స్థానికీకరణకి జావా అవసరం ఉండదు. నేనిచ్చిన సైట్లలో ఖాతా సృష్టించుకుని అనువాదాలు చెయ్యడమే.