కూడలి దృక్పథం

ఈ టపాకి నేపధ్యం ఈపాటికి మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా, కూడలి గురించిన ప్రాముఖ్య విషయాలను ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. కూడలి గురించి ఆసక్తి ఉంటే ఈ టపా మీకు ఉపయోగపడుతుంది.

ముందుగా నేను ఓ సంవత్సరం క్రితం ఒకరికి పంపిన ఈ మెయిలుతో ప్రారంభిస్తాను. అందులో కూడలి విధానాన్ని నేను చెప్పాను. దాన్నుండి అవసరమైన భాగం.

It’s not just me who has a say on what is allowed in Koodali. It’s mainly the readers. People even objected English posts appearing on Koodali.

Even if I include, readers complaints would lead to removal from Koodali.

My policy is to include blogs that are not embarrassing/offensive/shocking. My experiences proved that my level (of being offended/shocked) is higher than many readers. I needed to (re)move more than a handful of blogs.

People read Koodali from offices, homes, with their families and children in some cases.Magazines and newspapers are worse these days. I cannot argue that with people.

దీనితో పాటు క్రింది వక్కాణింపులు (assertions) నా దృక్పధాన్ని స్పష్టం చేస్తాయి.

 • మీ బ్లాగుపై సర్వహక్కులూ మీవే.
 • Koodali is my website run and maintained by me for the general benefit of Telugu Bloggers.
 • కూడలి బాగుకై తగిన నిర్ణయాలు తీసుకునే హక్కు నాకుంది.
 • కూడలిపై పూర్తి బాధ్యత కూడా నాదే. అలాగని నేను నిరంకుశత్వంగా వ్యవహరిస్తే బహుశా కూడలిలో నా ఒక్కడి బ్లాగే మిగిలి ఉంటుంది.
 • తెలుగు బ్లాగర్లు లేకుంటే కూడలి లేదు.
 • తెలుగు బ్లాగర్ల అందరి సౌకర్యార్థం కనుక బ్లాగర్లందరి హక్కులని, భావాలని నేను గౌరవించి, అందరికీ తగిన రీతిలో కూడలిని నిర్వహిస్తాను. నాకు మెయిళ్ళు, ఫోన్లు, కబుర్లు, మామూలు మాటల సందర్భంలోనూ, బ్లాగు టపాల్లోనూ రకరకాలుగా వారివారి అభిప్రాయాలు తెలియజేస్తారు.
 • కూడలిని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించట్లేదు. కానీ నేను తీసుకునే నిర్ణయాలు నాకు చేరిన అందరి అభిప్రాయాలను బట్టి, ఆలోచనతో కూడలి బాగుకై తీసుకున్నవే అయివుంటాయి.
 • కూడలిలో ఎటువంటి బ్లాగులను/టపాలను అనుమతించాలి అన్న స్వేచ్ఛ కూడలికి ఉంది.
 • కూడలి తనపట్ల కనీస మర్యాదని ఆశిస్తుంది. అది డిమాండు చెయ్యడం ఎంతమాత్రం కాదు. బేషరతుగా అందరికీ కూడలి తరపున నేను ఆ మర్యాదనిస్తాను. పరస్పర గౌరవానికి అవకాశం చూపించని డిమాండులను, అభ్యర్థనలను, వేడుకోల్లను నేను మన్నించను.
 • కూడలి అనేది మీ బ్లాగుల నుండి టపాలను ఒక చోట చేర్చి ప్రదర్శించే సంకలిని మాత్రమే.
 • కూడలి మీ అభిప్రాయాలకు వేదిక కాదు. మీ భావ ప్రకటన వేదిక మీ బ్లాగు.
 • కూడలిలో నుండి మీ బ్లాగుని తీసేసినందువల్ల మీ భావ స్వేచ్ఛకి విఘాతం వాటిల్లదు.
 • కూడలిలో చూపించే ఇతరుల టపాలపై నా భావాల ప్రభావం ఉండదు. అలా ఉంటే గనక, ఇంతటి వైవిధ్యమైన, ఇన్ని విలక్షమైన బ్లాగులని కూడలి ద్వారా మీరు చూసివుండేవారు కాదు.
 • కూడలిలో ఓ బ్లాగుని చేర్చమని/తొలగించమని కూడలి చదువరులు అభ్యర్థించవచ్చు.
 • కూడలి మార్పుకి వ్యతిరేకం కాదు. ఏ ఒక్క వాదానికీ, వర్గానికీ కొమ్ముకాసేదీ కాదు. అలాగని నచ్చనివి అణిచివేసే ధోరణీ చూపించదు.
 • మీ మనోభావాలని దెబ్బతీయాన్న ఉద్దేశం కూడలికి ఏమాత్రం లేదు.

పై విషయాలు కూడలి యొక్క మరియు దాని నిర్వహణలో నా దృక్పధాన్ని స్పష్టం చేసాయనుకుంటున్నాను. మీకు పై విషయాలలో సందిగ్ధత గానీ, సందేహాలు గానీ ఉంటే, నాకు (veeven ఎట్ జీమెయిల్.కామ్ కి గానీ) లేదా కూడలి తోడ్పాటుకి (support ఎట్ koodali.org కి గానీ) వేగు పంపించవచ్చు. లేదా ఇక్కడ వ్యాఖ్యగానైనా గానీ వ్రాయవచ్చు. నేను వీలువెంబడి నా స్పందనని పంపిస్తాను/వ్రాస్తాను.

ప్రకటనలు

58 thoughts on “కూడలి దృక్పథం

 1. ౧. కూడలి లో ఓ బ్లాగు ను తొలగిస్తే, ఆ తొలగించడానికి గల కారణాలను వివరిస్తే, కొన్ని అపోహలను తొలగించిన వారవుతారు.

  ౨. నాకు నచ్చని వ్యక్తి బ్లాగును నేను తొలగించమని అభ్యర్తించాననుకోండి. అప్పుడు కేవలం ఓ బ్లాగరు (ఓ గొప్ప బ్లాగరు అనుకోండి) అభ్యర్థననే పరిగణనకు తీసుకుంటారా, లేదూ ఆ అభ్యర్థన వెనుక గల కారణాలను వివరించమంటారా?

  ఇవి నా సందేహాలు. దయ చేసి చెప్పగలరు.

 2. @రవి
  ౧. అపోహలకు అవకాశముండకూడదనే ఈ టపా. మీరన్నట్టు కూడలినుండి బ్లాగులని ఏయో సందర్భాలలో తొలగిస్తానో వివరిస్తాను.

  ౨. గొప్ప బ్లాగరు, చిన్న బ్లాగరు అన్న బేధం లేదు. చర్య తీసుకునేది నేను కాబట్టి కారణాలు అడుగుతాను.

 3. మంచి వివరణ. Agreed. ఓ రెండ్రోజులు ముందు ఈ టపా వచ్చుంటే, చాలా అపోహలు తొలిగేవి.

  ఒక సూచన: “కొందరి అభిప్రాయాలు” బ్లాగుల తీసివేతకు కారణం కావచ్చు అనేది చాలా subjective గా వుండి, ambiguity కి ఆస్కారమిస్తొంది. That can be mis-used as well. కాబట్టి, కూడలిలోని బ్లాగుల సంఖ్యనిబట్టి ఎంతశాతం మంది అభ్యంతరం వ్యక్తపరిస్తే అనే ఒక clause వుంటే మరింత మెరుగ్గా వుండోచ్చు. “ఏక పక్షనిర్ణయం” అనే అపోహకి కారణం బహుశా అదే అనుకుంటాను. అభ్యంతరాలు లేవనెత్తినవారి పేర్లు అవసరం లేకపోయినా, కనీసం ఇంతమంది (సంఖ్య) చెప్పారు అన్న quantification would strengthen the decision.

 4. ఇదేదో అప్పుడప్పుడూ రామోజీరావు స్వదస్తూరీతో ఈనాడు మొదటి పేజీల్లో రాసే లేఖలా ఉందేమబ్బా :-) మీ వివరణ బాగుంది. మీడియం ఏదైనా, ఆ మాత్రం హద్దులు ఉండాల్సిందే. అవధుల్లేని భావప్రకటనా స్వేచ్చ అంత మంచిది కాదు.

 5. వీవెన్‌ – మీ అభిప్రాయాన్ని చక్కగా వ్యక్తీకరించారు. మా బ్లాగర్లందరి తరుపునా (ఇందులో చేరము అనుకునేవారు – ఇక్కడకి వచ్చి ఖండించవచ్చు) కూడలికి మా క్షమాపణలు అందచేయండి.
  మహేష్ – ఇది వేదిక కాదు. కానీ చెప్పాల్సి వచ్చింది. రెండ్రోజుల ముందు మీరు విమర్శ ప్రారంబించే ముందు కూడలిని వివరణ అడిగి ఉంటే హుందాగా ఉండేది. మళ్ళీ శాతాలూ, సంఖ్యలూ మాట్లాడుతున్నారు మీరు. కూడలి ఏమీ రాజకీయ పదవి కాదు – మెజారిటీ ఓటింగు ద్వారా నిర్ణయించడానికి. 250 పైగా బ్లాగులు రిజిస్టర్ అయ్యి ప్రతివాళ్ళూ వాళ్ళకి నచ్చిన అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఏళ్ళు గడుస్తున్నాయి. ఎవరికీ వారి భావప్రకటనా స్వేఛ్చ లో సమస్యలేమీ ఉన్నట్లుగా అనిపించలేదు. సంఘటన జరిగినప్పుడు కూడలి integrity ని శంకించేముందు ఒక్కసారి కూడలిని కారణం ఏమిటి అని అడగడం నైతికధర్మం అనుకుంటాను.

 6. మీ వివరణకు కృతజ్ఞతలు. మహేష్ కుమార్గారు చెప్పినట్లు ఒక వ్యక్తిపై నిర్ణయంలో అందరూ పాలుపంచుకోవటం మంచిది. బహిరంగ చర్చ/ఎన్నిక ఉంటే మంచిది.

 7. వీవెన్ గారు, మీ దృక్పథం పూర్తిగా సమంజసంగా ఉందని నేను భావిస్తున్నాను.

  “కూడలిని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించట్లేదు. కానీ నేను తీసుకునే నిర్ణయాలు నాకు చేరిన అందరి అభిప్రాయాలను బట్టి, ఆలోచనతో కూడలి బాగుకై తీసుకున్నవే అయివుంటాయి.”
  అని స్పష్టంగా చెప్పిన తర్వాత, ఎంత శాతంమంది అభ్యంతరం వ్యక్తపరిస్తే తొలగిస్తారు వంటి ప్రశ్నలు అర్థరహితంగా నాకు తోస్తునాయి. బ్లాగులు చేర్చడం కానీ తొలగించడం కానీ ఖచ్చితంగా వీవెన్ గారి subjective నిర్ణయమే. ఇందులో mis-use అన్న ప్రసక్తే లేదు. తన నిర్ణయం సమంజసమైనదే అని వీవెన్ గారికి నమ్మకం ఉంది. అతని నిర్ణయ సామర్ధ్యంపై అనుమానం ఉన్నవారు రవిగారిలా మర్యాదగా అడిగి తెలుసుకొనే ప్రయత్నం చెయ్యవచ్చు. అంతేకాని డిమాండు చెయ్యడం హాస్యాస్పదం. ఒకవేళ వీవెన్ గారు కారణాలు చెప్పినా, అది సమంజసం కాదని అనిపించవచ్చు. అతని ధోరణి ఏమాత్రం నచ్చనివాళ్ళు కూడాలి సహాయం తీసుకోవలసిన అవసరం లేదు. అంతేకాని అతని నిర్ణయం గురించి వ్యాఖ్యానించడం అసమంజసం, నిరర్థకం, నిరుపయోగం.

 8. Hi,
  Though I am in sync with your thoughts more or less,except here and there in few points, I am just wondering are not readers “sensible enough” to decide to read a post or not. And I see (I know it does not matter how I see it) Koodali as telugu ‘feed aggregator’ and makes life easy for readers to read what ever they are “interested in”. I don’t think there is “chance” for anyone to force someone to read a blog.

  So somehow this ‘special treatment’ looks little odd to me although the reasons given were ‘politically accepted’.

  “I know many books which have bored their readers, but I know of none which has done real evil” — Voltaire

  –Vamsi.

 9. వీవెన్ : “కారణాలు అడుగుతాను”…అన్నారు కాబట్టి, మీరు చెప్పింది, సమంజసంగానే ఉంది.
  ఇక పోతే, ఆ కారణాలు కూడలిలో ప్రకటిస్తే (అభ్యంతరం కాని పక్షంలో) ఇక సందేహాలకు తావు ఉండకపోవచ్చు. ఇంకో ఉపయోగం ఆ తొలగించబడ్డ బ్లాగరు కు ఆత్మ విమర్శ (చేసుకోగలిగితే) చేసుకునే అవకాశం దక్కవచ్చు. ఇవి నా ఊహలు మాత్రమే. వీవెన్ గారి administrative ఇబ్బందుల గురించి నాకు అవగాహన లేదు.

 10. వీవెన్ గారు ఇంతకన్నా సూటిగా, స్పష్టంగా తమవిధానాన్ని ఎవరూ చెప్పలేరు. మీరు స్వచ్చందంగా నిర్వహిస్తున్న కూడలి మాఅందరికీ ఉపయోగకరంగానూ, అభిమాన పాత్రంగానూ ఉందనడంలో సందేహంలేదు. రమారమి కూడలి పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా తెబ్లా లందరి సలహాలు మీరు పరిగణనలోకి తీసుకుంటూనే ఉన్నారు. మీకూడలికి మీరు సు’మను’ లయినా, మేం ప్రభాకరుల్లాగానే వ్యవహరించాం. ఈమధ్యలో తెబ్లాలోకంలో కి వచ్చిన వారు కామెంటే ముందు, కాస్త మన గూగుల్ గుంపు లోని సంభాషణలు చదివి రాస్తే అపోహలు వచ్చే అవకాశం ఉండదు. keep up the good work.

 11. వీవెన్ గారు,
  నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.ఏదైనా ఒక బ్లాగుని కూడలి నుంచి తొలగించేటప్పుడు కారణాలను వివరించటంతోపాటు, బ్లాగులోని అభ్యంతరాలను సరిచేసుకోని మళ్ళీ ఒక నెల తర్వాతైనా కూడలిలో చేరటానికి అవకాశం కల్పించండి.

 12. “కూడలిలో ఎటువంటి బ్లాగులను/టపాలను అనుమతించాలి అన్న స్వేచ్ఛ కూడలికి ఉంది.”

  పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ సాలెగూడు (కూడలి) వీవెన్ గారి సృష్టి. ఆయన యొక్క మానస పుత్త్రిక. ఆయన యొక్క ప్రైవేట్ ఆస్తి. అది ఎలా ఉండాలో, అందులో ఏం ఉండాలో, ఏం ఉండకూడదో నిర్ణయించే హక్కు, అధికారం సర్వంకషంగా ఆయనదే. ఈ విషయంలో ఎవరికైనా విభిన్నాభిప్రాయం ఎందుకుండాలో నేనూహించలేను. కూడలిలో తమ బ్లాగు లేధనీ, లేదా తొలగించారనీ బాధపడేవారు తమ సొంత సంగ్రాహక గూడేదైనా ప్రారంభించుకోవచ్చు. (కానీ నా అనుమానం – ‘కూడలి’ అంత నిష్పాక్షికంగా ఏదీ ఉండదని). దానికి వీవెన్ గారు అవరోధం కాదు గదా !

  ఈ విషయంపై వీవెన్ గారు ఇంత పెద్ద టపా రాశారంటే వందలాదిమంది బ్లాగర్లలో ఒకఱిద్దఱు ఆయన్ని ఎంత బాధపెట్టి ఉంటారో నేనూహించగలను. మనుషుల సహనం చచ్చేదాకా పట్టిపల్లార్చడం నాగరికత కాదు.

  ప్రజాస్వామ్యమూ, నా తలకాయ !

  నేను ప్రజాస్వామ్యం మీద ఒక మహాగ్రంథమే రాశాను. కాని ఎన్ని చెప్పినా ప్రజాస్వామ్యం ఒక రాజకీయ కాన్సెప్టు. మన జీవితంలో అన్ని రంగాల్నీ చుట్టబెట్టేటంత సీను దానికుందని నేను భావించను.

 13. good job, Veeven.
  పదే పదే ప్రజాస్వామ్య భజన చేసే వారు పైన తాడేపల్లి గారు చెప్పిన ముక్కలు కూడా మనసుకి పట్టించుకోమని నా విన్నపం.
  There are many states/scenes/occasions in life democracy is not even a remote possibility. All married folks would attest to that. And yet, we gladly subject ourselves to such states and even rejoice in them – why crib about such small thing as blogs! :)

 14. కూడలికి మనం ఓనర్లు కాదు, అందులో మనకు షేర్లు కూడా లేవు. అసలు ఈ టపా వ్రాయాల్సిన అవసరం కూడా వీవెన్‌కి లేదు. ఐనా వీవెన్ తన విలువైన సమయాన్ని వెచ్చించి ఇంత పెద్ద టపా వ్రాశాడు. “బ్లాగు ఎందుకు తొలగించారు?” అని సంజాయిషీ అడిగే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవడం మంచిది. అది బ్లాగరి/వీవెన్‌కు సంబంధించిన విషయం. వోటింగు నిర్వహించడం , అందరు బ్లాగర్ల అభిప్రాయం తెలుసుకోవడం లాంటివి అసాధ్యం .
  (నాకు తెలిసి “ఆ” బ్లాగును కూడలి నుంచి తీసెయ్యడం ఇది రెండో సారనుకుంటా(?))

 15. కొన్ని బ్లాగులను తప్పనిసరి పరిస్తితులలో తొలగించి కూడలిని క్లీన్‌ గా ఉంచాల్సిన బాద్యత వీవెన్‌ మీద ఉంది . ఆ బాద్యతని ఆయన నెరవేర్చారు . ఆ మాత్రం దానికి ఆయనకి ఉద్దేశ్యాలు ఆపాదించి విమర్శించటం తగని పని .

 16. వీవెన్ గారికి నమస్కారాలు!

  ఈ టపాకి ఎందుకు అవసరం పడిందో, ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు తెలుగు బ్లాగులు శ్రద్ధగా పరిశీలిస్తున్న వారికి తెలుసు. కానీ ఈ టపా ఆయుష్షు కూడా ఇంకో నాలుగు రోజులు, వ్యాఖ్యలు వచ్చేదాన్ని బట్టి! ఆ తర్వాత ఇదీ పక్కన పడిపోతుంది, అన్నింటి లానే! మరలా ఇలాంటి సమస్య రానూ వచ్చు, అప్పుడు మరలా మీరు ఇలా రాయాల్సి వస్తుందేమో.

  అందుకని, ఈ టపాని యధావిధంగా కాకపోయినా, కొన్ని ముఖ్యమైన పాయింట్లతో కూడలి/ గురించి పేజీలో ప్రచురించండి. ఇప్పటికే కూడలి / కొత్త బ్లాగు పేజీలో ఈ వాక్యం ఉంది

  “మీ టపాలు అభ్యంతర రీతిలో ఉంటే, ఎటువంటి నోటీసు లేకుండానే మీ బ్లాగుని కూడలినుండి తొలగిస్తాం.”

  ఎంత మందికి అది అర్ధం అయ్యిందో, నాకర్ధం కావటం లేదు కానీ, i really don’t enjoy you sparing time to explain things time and again. Let people have clear idea from the word GO.

  Hope I made sense.

  పూర్ణిమ

 17. కూడలిని, లేఖిని ని అభివృద్ధి చేయడానికి, ప్రాచుర్యం లోకి తీసుకురావడానికి వీవెన్ ఎంత శ్రమ తీసుకున్నారో ఆయన ప్రమదావనానికి విశిష్ట అతిథిగా వచ్చినపుడు తెలిసి నిజంగా ఆశ్చర్యమేసింది. ఈ రోజు ఇంతమంది తెలుగు బ్లాగర్లు తమ భావాలను ఇతరులతో తమకిష్టమైన రీతిలో పంచుకుని స్నేహితులుగా మారారంటే అది వీవెన్ చలవే!

  ఆయన స్వంతం కూడలి! అటువంటి కూడలి లో ఎటువంటి బ్లాగులను ప్రచురించాలన్న విషయాన్ని వీవెన్ గారికే వదిలేయాలి. ఆయన ఇటువంటి “సంజాయిషీ” తరహా వివరణ బ్లాగు రాయడం నాకు కష్టంగా ఉంది. ఆయనకు ఉద్దేశాలు అంటగట్టడం అర్థం లేని పని!

  “బ్లాగు ఎందుకు తొలగించారు?” అని ప్రశ్నించే ముందు, “ఎటువంటి కంటేంట్ ఉంది అందులో” అని తమని తాము ప్రశ్నించుకుంటే మంచిది.

 18. వీవీన్ గారు ఎవరి మీదా కక్షగట్టో,మరొక కారణం వల్లో ఇలా చేయరు.సదరు శరత్ గారికి ఒక పాత బ్లాగు వుండేది.అందులో టపాలు బహు అభ్యంతరకరంగా వుండేవి.[చాలా దారుణంగా,చివరికి చిన్నపిల్లల్ని మాయచేసి చిత్రీకరించిన బూతు చిత్రాలను మహదానందంగా ఎంజోయ్ చేసాను అంటూ ఘోరాతి ఘోరంగా వర్ణించిన టపాలు కూడా వున్నాయి.నా దురదృష్టం అది మామూలు బ్లాగే అనుకుని చూస్తే మొదట నాకంటపడింది ఆ టపానే.]అందుకు అప్పట్లో ఒకమారు తొలగించారు.ఆతరువాత ఆయన మంచిగా రాస్తారనే వుద్దేస్యంతోనేకదా ఇంకో అవకాశం ఇచ్చి కూడలిలో చేర్చారు.నిజానికి వీవీను కి ఆయన మీద కోపం వుండి వుంటే,నిరంకుశంగా కూడలిని నడపాలనుకుంటే సరత్ గారికి మళ్ళా అవకాశం ఎందుకు ఇస్తారు.అవకాశం ఇచినప్పుడు వారి మధ్య ఏవో మాటలు జరిగే వుంటాయి కదా.కూడలిలో మళ్ళా చేర్చారన్న ఆనందంకన్నా శరత్గారికి వారి మొదటి బ్లాగు తొలగించేసారన్న బాధ ఎక్కువగా వుంటుంది ఎప్పుడూ.చివరకు తెలుగుబ్లాగుల గురించి ఏదో వీడియో చేసి దానిలో కూడా నా బ్లాగు తీసేసారు అనేవాపోయారు.నిజానికి ఆయన మొదటి బ్లాగుతో పోలిస్తే ఇప్పుడున్న బ్లాగు కాస్త బాగానే రాస్తున్నట్టులెక్క.కానీ అందరూ వుండే చోట,అందరూ చూస్తున్నప్పుడు మూత్రవిసర్జన ఎలా చేయమో ఈ శృంగారానికి సంబంధించిన బ్లాగు కూడా ఇలాంటి కూడలిలాంటి చోట్ల వుండకూడదు.దానికి బోలెడన్ని ఫోరంస్ వున్నాయి.అలాంటి సైట్లకి సెపరేటు జనాలు,సెపరేటు ప్లేసులు వుంటాయి.అక్కడ ఆయన వాణి వినిపిస్తే జనాలు చప్పట్లు కొడతారు.నిజానికి శరత్ గారి బ్లాగులాంటి వాటికే జనాలు ఎక్కువ వుంటారనుకుంటాను.కానీ కూడలి మాత్రం సరైన ప్లేసుకాదు ఆబ్లాగుకి.

 19. సుజాత గారు, తాడేపల్లి గార్ల వ్యాఖ్యలు నాకు చాలా నచ్చాయి.

  శరత్ గారి బ్లాగు లో మొదట నేను ‘యప్పీ – గో ఆన్ !’ అని వ్యాఖ్యేను గానీ, తరవాత టచ్ లేకపోయింది. తరవాత, ఆయన బ్లాగు నేను పెద్దగా చదవలేదు. కూడలి తెరవగానే, తెలిసిన బ్లాగులే చదవడం నాకు అలవాటు. ఉదా : సుజాత, కొత్త పాళీ, మనిషి, జ్యోతి లాంటి పేరు కనపడగానే చదివుతాను. ఇవి నా మనసుని ఆహ్లాదపరుస్తాయి. నిజం, సత్యం లాంటి బ్లాగులు చాలా డిస్టర్బ్ చేసేవి. నేను కూడలి తప్ప, వేరే సైట్లు చూడను. అసలు కూడలి కున్న ప్రమాణాలు నాకు చాలా నచ్చుతాయి. ‘అడ్డమైన గడ్డీ’ ఎలో చెయ్యకపోవడం వల్ల కూడలి ని నేను చాలా మంది తెలుగు చదివే స్నేహితులకు రిఫర్ చేస్తాను.

  కాబట్టి… వీవెన్ గారికి ఒక సలహా ! అన్ని సైట్ ల లాగే, ఆయన, ఈ కూడలి లో చేరే వారి చేత, ‘I Agree’ అని కొన్ని మౌలిక, ప్రాధమిక నియమావళి (చదివించి &) ఒప్పుకునే లా చేసి, కూడలి లో చేర్చుకొనుండాల్సింది.

  అపుడు, ఈ అనవసర వాదనలూ, నొచ్చుకోవడాలూ ఉండకపోయి ఉండేవి. రాధిక గారి వ్యాఖ్య చదివాక, నాకు అదే అనిపించింది. ఇలా, వీవెన్ గారు స్పష్టీకరరించడం.. పూర్ణిమ అన్నట్టు, కొన్నాళ్ళ తరవాత జనం మర్చిపోయి, ఫైటింగ్ మొదలుపెట్టొచ్చు.

  నేను అధికప్రసంగం చేసి వుంటే, క్షమించండి.

 20. సమయ ముంది కదా అని అనవసరమైనదానికి కూడా స్పందిస్తూ చిన్న దాన్ని పెద్దది చేయకుండా సయమనం పాటించడమెలాగో వీవెన్‌ దగ్గరి నుండి నేర్చుకోవాలి. (చాలా రోజుల క్రితం జ్యోతక్క బ్లాగు పై ఎవరో ఒక బ్లాగు రాసారు. ఎవరూ దానికి స్పందించలేదు. ఇపుడది వుందో లేదో ఎవరికీ తెలీదు.) కొద్ది రోజుల కిందట ఎగిసిన నిప్పు రవ్వలు అక్కడక్కడా ఎగిరి పడి మంటలు లేస్తున్నా ఎంతో హుందాగా వ్యవహరించారు వాటిని మరింత ప్రజ్వలింపచేయకుండా. భేషో. ఇలాంటి స్తితప్రజ్ఞత అందరూ చూపించగలిగితే కొన్ని అపోహలు వాటంతటవే పోయి గట్టి సంబంధాలు నెలకొంటాయి.

  కొన్ని టపాలు కొందరికి నచ్చుతాయి. కొందరికి నచ్చవు. అలాగే కొన్ని బ్లాగులు కూడా. కూడలిలో ఎన్ని బ్లాగులుండాలో, ఎలా వుండాలో కూడలి నిర్వాహకుడి ఇష్టం. నచ్చని విషయాలకు నిరశన వ్యక్తం చెయ్యొచ్చు. అంతే కానీ పని కట్టుకుని బురద జల్లడం ఏ మాత్రం అభిలషణీయం కాదు. వెన్నెముకలు, తొత్తులు, చాదస్తాలు లాంటి అసందర్భ ప్రేలాపనలు ఇలాంటివే. కొన్ని పత్రికలలో శృంగార పరమైన విషయాలు రావచ్చు గాక. అవి బ్లాగుల్లా ఇంటరాక్టివిటీ వున్నవి కాదు గదా. శృంగారం..వాటి బై ప్రాడక్ట్సు ను అందరూ తెలుసుకోవాలనే రూలేమీ లేదు. తునకలు తింటామని ఎముకలు మెళ్ళో వేసుకుని తిరగము.

  వీవెన్‌, కాలంతో పాటు చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడొస్తున్న మార్పు అదే. మీరు కూడలిలో Disclaimer, Privacy Policy,Abuse report లాంటివి పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. కూడలికి మీరే లెనినూ, స్టాలినూ,
  సుమనూ. మీరు చెప్పినదాంట్లో ఎమీ తప్పు లేదు. నేను వేలుకో ఇంకు ముద్ర వేసుకొని వోటు వేసి 20 వోట్లతో మిమ్మల్ని బలపరుస్తున్నా.

  — విహారి

 21. ఈ విషయం మీది చర్చని నెను మొదటి నించీ ఆసక్తి తో గమనిస్తూనే ఉన్నాను.

  ఇంత జరిగాక నేను నా రెండు వాక్యాలు రాయకుంటే అంతకు మించిన బాధ్యతారాహిత్యం ఇంకోటి ఉండదు అని నాకనిపించిన తక్షణం ఇది రాస్తున్నాను.

  వీవెన్ గారు చెప్పిన దాంట్లొ నాకు ఏ రకం గానూ తప్పు కనిపించట్లేదు. కూడలి లొ రావటానికి, రాక పోవటానికి , భావ ప్రకటనా స్వేచ్చ కి ఏ మాత్రం పొంతన లెదు. మనం వెరే దెశం వెళ్ళినప్పుడు మొదట చెసే పని అక్కడి పద్దతులు కనుక్కొని, అక్కడి చట్టాల్ని గౌరవించడం. ఇది కూడా అంతే.

  /ఉమాశంకర్

 22. మీ assertionsని అంగీకరిస్తున్నాను అలాగే మీ కృషిపై గానీ నిబద్ధతపై గానీ ఎవరికీ సందేహాలు ఉన్నాయి అనుకోను. అయితే ప్రస్తుతం లక్షకు ఒక్కరు కూడా తెలుగులో బ్లాగులను వ్రాయడం లేదు, ఉన్న ప్రతీ ఒక్కరినీ గౌరవించడం ఎంతో అవసరం – నచ్చినా నచ్చకపోయినా.

  సేకరణలకు ఒక ప్రత్యెక వర్గం పెట్టినట్టే, “పెద్దలకు మాత్రమే” అని ఒక ప్రత్యేక వర్గాన్ని పెడితే సరిపోయేది, అప్పుడు ఎవరిని ఎంచి (జడ్జి చేసి) అవమానించాల్సిన అవసరం ఉండదు. ఇష్టం ఉన్న వారు మాత్రమే చదివుతారు – చదివే వారు, రాసే వారు అందరు హ్యాపీ.

  ఇలా మంచి చెడులను నిర్ణయించడం అన్నది అనవసరపు శ్రమ, counter productive. మనందరినీ కలిపేది తెలుగు భాష మీద ప్రేమ, అభిమానమే తప్ప అభిప్రాయాలు కావు – అది ఎంత బాగా గుర్తుంచుకుంటే అంత మంచిది.

 23. @ రాధిక గారూ,

  చిన్న పిల్లల వీడియో చూసి ఎంజాయ్ చేసానని నేను రాసానని మీరు చెబుతున్న మాట పచ్చి అబద్దం. మీకు నేను నచ్చకపోవచ్చు – కానీ దయచేసి అటువంటి దారుణమయిన దుష్ప్రచారాలు చేయకండి. మీరు హద్దులు దాటి అభాండాలు వేస్తే మరి నేనూ అదే పని చేయాల్సివస్తుంది! ప్రజలకి నచ్చేవి నిజాలు కాదు వినోదం. మీరు వినోదం ఇద్దామంటే నేను రెడీ.

  నా పాత బ్లాగ్ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నానని మీరు ఆవు కథ వుదాహరణతో వ్యంగ్యంగా వ్యాఖ్య రాస్తే నేను తప్పు ఒప్పుకొని సరిదిద్దుకున్నాను. నేను నా అవు ని మరచిపోయాను – మీరు నా ఆవుని ఇంకా మరవలేదు :))
  @ పూర్ణిమ గారూ,

  ఆ మధ్య పొద్దు పత్రిక గారు శపించారు – నేను సుమను లా అవుతానని. ఇప్పుడు మీరు శపిస్తున్నారు – కానివ్వండి. సరే. ఒక విషయం చెప్పనా? నిజానికి టెక్ష్ట్ బ్లాగింగ్ చేసే ఓపిక నాకు వుండదు. నేను వీడియో బ్లాగింగ్ చేస్తుంటాను. అంతర్జాలం కోసం కొన్ని లఘు చిత్రాలను తీయాలనుకొని నా వీడియో కెమరా ఇండియా కి పంపించి ఇంకొకటి ఇంకా కొనలేదు. సో ప్రస్తుతానికి వీడియో బ్లాగింగ్ చేయలేక ఇలా ఈ బ్లాగ్ మీద పడ్డాను అంతే. నాకు దాంట్లో కాస్త ఆదరణ వుంది – నాకు అది చాలు. తిప్పి తిప్పి కొడితే ఓ వెయ్యి మంది వుంటారేమో మొత్తం ఈ ఒకరి backyard పాఠకులు. ఒక టపా మహా ప్రాచుర్యం పొందితే మహా అంటే ఓ 300 హిట్స్ వస్తాయి. మామూలుగా రోజుకి ఓ వంద నుండి రెండు వందలు హిట్స్ వస్తే గొప్పే – అదీ కాస్త మంచి టపా అయితేనే. ఇదివరలో యు ట్యూబ్ లో ఇంకా బాగా స్పందన వచ్చేది. ఆ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని తీసేసాను – బాగా హిట్ అయినవి కూడా. మళ్ళీ శ్రద్ధగా అది చేయాలనుకుంటున్నను. యుట్యూబ్ ఇలా తెలుగు సుమను వారి ఆధ్వర్యంలో లేదు కాబట్టి స్వేచ్చ ఎక్కువ. అక్కడ మన పని ఏంటో మనం చేసుకుపోవడమే. ఏదన్నా మరీ నచ్చకపోతే ఆ వీడియో తీసేస్తారు అంతే మొత్తం నా చానల్ ని తీసివేయరు. నాది ఇంతవరకు ఒక్కటి తీసివేసారు – ఒక చిన్న పొరపాటువల్ల – దానిని సవరించుకున్నాను. ఏదయినా తీసివేస్తే ఎందుకు తీసివేస్తున్నది చెప్పి తీసివేస్తారు – కనీస మర్యాద పాటిస్తారు. పద్దతిగా వుంటారు – అందుకే మనమూ పద్దతిగా వుంటాం. నా వీడియో హిట్స్ 224,820. ఒకే. ఒక్క మంచి సినిమా పాట వేస్తే ఎన్నొ హిట్స్ వస్తాయి. కానీ నేను అలా చేయటం లేదు. అన్నీ నా స్వంత వీడియోలు. అలా అని నేను బూతు వీడియోలు చేయడం లేదు. నాకు తెలిసిన సమాచారం పంచుతున్నాను అంతే. ఆ పై హిట్స్ కూడా ఏదో అరకొరగా, ఎదో అప్పుడప్పుడు తీసిన వాటి వల్ల. కొత్త కెమెరా కొన్న తరువాత ఫుల్ స్వింగ్ లో రాబోతున్నాను. అందుచేత మీరు మీ పెరడు లూ నాకో లెక్క కాదు. కాస్త తీరికగా వున్నానని ఇక్కడ కాలక్షేపం చేస్తున్నను – తెలుగు బ్లాగులూ, సంకలనాలు దృశ్యం ఏంటో చూస్తున్నాను అంతే. సో మీరూ మీరూ పండగ చేసుకోండి. ఈ నా తెలుగు బ్లాగ్ పెద్ద లెక్క కాదు. మీరు అనుకునేదానికంటే నేను చాలా ముదురు అన్నసంగతి ఈ పాటికి మీకు అర్ధమయ్యే వుండాలి. మీ భావం మీరు చెప్పుకోండి అంతే కానీ శాపనార్ధాలు పెడితే బావుండదు.

 24. ఆలస్యంగా ఈ టపాను చూసాను. అయితే ఏమిటి గానీ వీవెన్, నేను మీతో పూర్తిగా ఏకిభవిస్తున్నాను. ఏ బ్లాగులను వుంచాలో, ఏ బ్లాగులను తొలగించాలో, నిర్ణయించే పూర్తి అధికారం మీకుంది.

  ఆజయ్ గారూ, మీరు చెప్పింది కూడా నిజమే కానీ మీరు సమస్యను నెమ్మదిగా తప్పుదోవ పట్టిస్తున్నారు. లైంగిక విజ్ఞానం , శృంగారం, బూతు ఈ మూడు వేర్వేరు విషయాలు. మూడింటిని కలిపేయకండి. లేదా మొదటి రెండింటి పేరిట మూడవదాన్ని సమర్థించకండి.

  విజ్ఞానం కోసం అయితే ఎంచక్కా తెలుగు వికీ లో కావలసినన్ని వ్యాసాలు రాయండి. తెలుగు వికీ వాళ్ళు మీ స్థాయి లైంగిక జ్ఞానాన్ని హర్షించకపోతే హాయిగా మీ బ్లాగుల్లో రాసుకోండి. కానీ దాన్ని కూడలిలో కూడా ప్రచురించాలని ఒత్తిడి చేయడం కాని పని అవుతుంది.ఆసక్తి గలవారు కూడలి మాదిరి మరో బ్లాగు అగ్రిగేటర్ ను తయరు చేయండి. మరీ అంత కష్టమైన పని కాదే అది.

  మీ స్నేహితుడెవరైనా తను సేకరించుకున్న సమగ్ర శృంగార బూతు సాహిత్యమంతా మీ నట్టింట్లో ప్రదర్శిస్తాను అంటే మీరు ఒప్పుకుంటారు అని నేను అనుకోను. ఇదీ అంతే, తను నిర్మించిన కూడలి లో ఏం ప్రదర్శించాలి అనేది నిర్మాత గా వీవెన్ నిర్ణయించాల్సిన విషయం.

  లైంగిక శృంగార విజ్ఞాన వేత్తలు తమ తమ బ్లాగుల్లో తమ అభిరుచిని, ఆసక్తిని అపరిమితంగా పరిచేయండి. మాకెవ్వరికి అభ్యంతరం లేదు. కాని కూడలి లో ప్రచురించాలని ఒత్తిడి చేయడం సరైన సంస్కారం కాదు.

  ప్రసాదం

 25. అందరికీ,

  కూడలి అన్నది వీవెను స్వంత backyard – నలుగు రోడ్ల కూడలి కాదు కాబట్టి తన ఇంటి backyard లో ఎవరెవరు ఉండాలి ఎవరెవరు వుండొద్దు అనది తన ఇష్టమే. అది ఎవరయినా అంగీకరిస్తారు. అది అర్ధం చేసుకోవడానికి ఇంత పెద్ద చర్చ అక్కరలేదు – అది రాకేట్ శాస్త్రమూ కాదు. అయితే తేడా ఎక్కడొచ్చింది? నేను నా ఆ టపా లో కోరిందేమిటి?

  వీవెను విచక్షణ ప్రకారమే జరుగక తప్పదు – తన స్వంత సైట్ కాబట్టి. మరి అయితే సమస్య ఏంటి? :) చెప్పుకోండి చూద్దాం.

  తన విచక్షణా జ్నానం పెరగాలి – విచక్షణ ఇంకా బ్రాడ్ గా వుండాలి. తన విచక్షణ అన్నది ఇలాంటి బ్లాగులని కూడా అంగీకరించేలా కావాలి. ప్రజలకి అన్ని రకాల సమాచారం అందేలా చూడాలి. అంటే ఏంటి స్థూలంగా? వీవెను లో మార్పు రావాలి. మార్పు అనేది ఎవ్వరిలోనయినా ఆవశ్యం. ఇక్కడ మనం రావాలనుకుంటున్నది మంచి మార్పే కదా – వారి స్వంత సైటే – అందుకే కోరుతున్నాం. వారి మార్పు మీద ఆధారపడుతున్నాం – ఎందుకంటే వేరే మంచి ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి వారిలో మార్పు కోసం ఆశిస్తున్నాం. అన్యధా శరణం నాస్తి లా!

  ధర్నా: ఎందుకు ధర్నా అంటూ చేసేం? మనది అనుకున్నాం కాబట్టే చేసాము. ఆ సన్నిహితత్వం, ఒక కుటుంబం లా వుంటున్నాము కాబట్టి, నాలుగు వీధుల మధ్య కూడలి అని భ్రమించి చేసాం. మిగతా వాటిదగ్గర ఇలా హడావుడి చేస్తామా? కనీసం చేయాలనే ఆలోచన వస్తుందా? ఆ కూడలి లో చర్చ ద్వారా నన్నా తనలో మార్పు వస్తుందేమో అని చేసాము. వస్తే వస్తుంది – లేకపోతే పోయేదేమీ లేదు కదా. కనీసం ఒక చక్కటి విషయం పై చర్చ అన్నా నడుస్తుంది. ఇది ప్రజా కూడలి కాబట్టి ఇలా అడుగుతున్నాను – కాదు నా స్వంత ఆస్తి అనే అనుకుంటే ఇక చెప్పేదేమీలేదు అని కూడా అన్నాను. ఇది ప్రజా కూడలి కాదు – స్వంత సైటు అన్న తరువాత ఇంకా చర్చించడానికి ఏముంటుంది? ఇది మన అందరిదీ అనుకొని డెమోక్రాటిక్ ప్రాసెస్ కోసం తపించాము . కాదు అంటున్న తరువాత ఇంకా మిగిలేదేం వుంది? కావాలంటే వీవెను కాళ్ళ బేరం తప్ప :)) – అవసరం మాది అనుకున్నప్పుడు తప్పదు కదా.

  It’s up to you your honour!

  నా కోసం కాదు – అందరికీ వైవిధ్యమయిన సమాచారం అందడం కోసం ఆలోచించండి – ఆ సమాచారం కొంత మంది ఇష్టపడకపోవచ్చు – కొంతమంది ఇష్టపడవచ్చు. మారుతున్న సమాజాన్ని బట్టి మీ విచక్షణ ని కూడా మెరుగుపరుచుకుంటారని ఆశిస్తాను. మీ విచక్షణ మీదే. నాలాంటి అభాగ్యుడు ఎవరో చెప్పినంత మాత్రాన మీరు మారాల్సిన అవసరం లేదు కానీ మీ విచక్షణ ను common good కి ప్రయోజనం చేకూర్చేలా ఉపయోగించండి.

  నాకూ ఎన్నో ఇష్టం లేని సైట్లు వున్నాయి. ఎన్నో బ్లాగులు మూఢ విశ్వాసాలని, అభివృద్ధి నిరోధక సనాతన వాదాన్ని, మత్తులాంటి మతాన్ని నూరి పోస్తున్నాయి. వాటిపట్ల నాకు అభ్యంతర వుంది. వాటిని తీసివేయండి. ఈ బ్లాగావరణమ్లో ఎంతో మంది హేతువాదులు వున్నారు. వారికి కూడా అటువంటివి నచ్చవు – కానీ పెద్దగా అలా కోరరు కదా. ఎందుకంటే ఎవరి స్వేచ్చ వారిది కాబట్టి. నేనూ మీ కూడలి పాఠకుడినే – మరి నా అభ్యంతరం కొద్దీ వాటిని తీసివేస్తారా? ఎనం అభ్యంతరాలు కావాలి? సేకరిస్తాను. లేకపోతే నేనే వేరే ఐడిలు పెట్టుకొని వచ్చి మిమ్మల్ని కోరుతాను. అయినా ఒక బ్లాగు తీసివేయాలంటే మీకు ఒక్క అభ్యంతరం చాలు కదా. ముఖ్యంగా తాడేపల్లి గారి బ్లాగ్ తీసివేయండి :))

  That’s all your honour!

 26. అయ్యా ! బుద్ధిలేని బుద్ధిజీవిగారూ ! మీకు నా మీదున్న కసికి జోహార్లు. నలుగుఱికి సంబంధించిన విషయాల్ని చర్చించేటప్పుడు వ్యక్తిగతాలు పనికిరావు. మీరు ఆ లక్ష్మణరేఖ దాటుతున్నారు. కాబట్టి మీ పట్ల కూడా ఱేపు జనం ఆ లక్ష్మణరేఖ దాటుతారు.

  మీlలాంటి అజ్ఞానులకు ఒక విషయం చెప్పి తీఱాలి. నా బ్లాగుని కూడలిలో చేర్చమని నేనెప్పుడూ వీవెన్ గారిని కోరలేదు. జల్లెడ నిర్వాహకుల్నీ కోరలేదు. వారంతట వారే నా బ్లాగు నచ్చి వారి గూళ్ళలో స్థానమిచ్చారు. ఈరోజు మీలాంటివారు దాన్ని తీసెయ్యమని వీవెన్ గారి గొంతు మీద కూర్చున్నా నాకు నష్టం లేదు. ఎందుకంటే Web-stats ప్రకారం నా బ్లాగుకున్న స్వతంత్ర హిట్స్ దానికున్నాయి. కూడలిలోంచి తీసేసినా దాని popularity ఏమీ చెక్కుచెదరదని, అది అఖండంగా కొనసాగబోతున్నదనీ, ఇప్పుడున్న హిట్స్ కంటే చాలా ఎక్కువ హిట్స్ రాబోతున్నాయనీ తమరికీ, తమలాంటి కుళ్ళుమోతులకీ ఉడుకుబోతులకీ మనవి చేసుకుంటున్నాను. మీరంతా అంతర్జాలం నుంచి నిష్క్రమించిన తరువాత కూడా నా బ్లాగు కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాను. సరేనా ?

  ఎందుకబ్బా తమరికి నా మీద ఇంత కసి ? మీ నోటి దగ్గఱి నుంచి మీ కూడు నేనేమైనా తీసేశానా ? నా బ్లాగులో నా విశ్వాసాలు రాసుకుంటా. ఏంటి మీకు బాధ ? మీరు మీవి రాసుకుంటే నేను వద్దన్నానా ? లేదా ఏదైనా వేఱే బ్లాగుని కూడలిలోంచి తీసెయ్యమని నేనెప్పుడైనా ఢిమాండు చేశానా ?

  మూఢవిశ్వాసాలట. మూఢవిశ్వాసాలు. ఒక మాట చెబితే కుళ్ళికుళ్ళి ఏడుస్తారు. విశ్వాసమంటేనే మూఢమైనది. అది ఏదైనా గానీ ! ఱేప్పొద్దుటికి మీరు బతికుంటారనుకోనవడం కూడా మూఢవిశ్వాసమేనని తెలుసుకోండి ! మీ తండ్రికి మీరు పుట్టారని అనుకోవడం కూడా మూఢవిశ్వాసమే మీ కుళ్ళు, కుత్సితం ప్రదర్శించడానికి వీవెన గారి బ్లాగు వేదిక కాదని తెలుసుకోండి.

  సరే ! నా బ్లాగు నా విశ్వాసాల గుఱించి ప్రకటిస్తుంది కనుక దాన్ని కూడలిలోంచి తీసేద్దాం. అంతటితో మీ సమస్య తీరిపోతుందా ? ఈ దేశంలో ప్రతిరోజూ వందలాదిగా ప్రచురితమౌతున్న ఆధ్యాత్మిక గ్రంథాల సంగతేంటి ? దేవాలయాల సంగతేంటి ? అవన్నీ మీరు మూయించగలరా ?

  మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి.

 27. కుటుంబ సభ్యుల చేతిలో అత్యాచారానికి గురై తల్లి దండ్రులతో చెప్పుకోలేని అశక్తతో కుమిలిపోయే ఆడపిల్లలు,
  నెలసరి అంటే తెలియని గిరితనయలు,పసిదానితో శృంగారం లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుందని భావించే పశువులు…..ఎవరండీ వీళ్లంతా? సమాజంలో ఉంటే ఉంటారేమో, ఉన్నారేమో….! కాదన్ను! వీరిలో ఒక్కరు కూడా మన బ్లాగర్లలో లేరు….కనీసం మా పరిసరాల్లో కూడా లేరు. హోమోలు, లెస్బియన్స్ కూడా లేరు(ఘంటా పథంగా చెప్పగలను) మరి పై సమస్యలను గురించిన సమాచారాన్ని మాకెందుకు పంచిపెడుతున్నారు?

  అందుకని మీరు చెప్పినవి సమస్యలు కావని నేను అనను. గిరితయనలు తెలుసుకోవలసిన నెలసరి సమస్యలను బ్లాగర్లకు చెప్పి ఏమి ప్రయోజనం? సమస్యలను చర్చించే బ్లాగులున్నాయి. కానీ సభ్యత, సంస్కారాల మధ్య సాహిత్యం,కళలు, సమాజం(మీరు చెప్పే లైంగిక విశృంఖలత్వం నిండి ఉన్న సమాజం కాదు. అంతకంటే పెద్ద సామాజిక సమస్యలతో నిండి ఉన్న సమాజం) వీటన్నిటి ప్రాతిపదిక కా కూడలి లో బ్లాగులు నడుస్తున్నాయి.

  “మీ పిల్లలకు మీ ఇద్దరి బ్లడ్ గ్రూపులు కాక వేరేది వచ్చిందంటే(సరిగ్గా ఇవే పదాలో కాదో నేను ఇప్పుడు చెప్పలేను, ఆ బ్లాగు చూడలేను కాబట్టి) ‘దాల్ మే కుచ్ కాలా హై, ఏదో మతలబు ఉందన్నమాట” అని సాటి బ్లాగర్ల వ్యక్తిగత జీవితాలపై(ఇవి బ్లాగర్లకేగా చెప్తున్నారు) చులకనగా చెణుకులు విసిరే రాతలు సెక్స్ విజ్ఞానం కంటే పంచుతున్నది ఏమిటో ఒక్కసారి ప్రశ్నించుకోవాలి!

  తెలుగు బ్లాగర్లందరూ ఉన్నత విద్యావంతులే! లైంగిక పరిజ్ఞానం ఉన్నవారే, సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వారే!(ఇలాంటి కామెంట్ రాయడానికే ఏదోగా ఉంది) బ్లాగులు చదివి పరిష్కరించుకోవలసిన అవసరం లేనివారు!

  సెక్స్ విజ్ఞానం అవసరమే! కాని అది పంచడానికి కూడలి తగిన వేదిక కాదు, కాదు,! ఆ విషయాలు చర్చించే వేదికలు వేరే ఉన్నప్పుడు అక్కడే చర్చించాలి!

 28. @వీవెన్
  లేఖిని ద్వారా, కూడలి ద్వారా తెలుగు బ్లాగు ప్రపంచానికి నీవు చేసిన సేవ బహూధా ప్రశంసనీయం. కానీ కూడలి నీ స్వంత సైటు అనే స్థాయిని ఎప్పుడో దాటిపోయింది. ఇది కూడలిలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ చెందుతుంది. మీకు కూడలి నిర్వాహకుడిగా ఏ బ్లాగు ఉంచాలో? ఏ బ్లాగు తొలగించాలో? నిర్ణయం తీసుకొనే హక్కూ ఉంది. అలానే అవతలి వారికి తమ బ్లాగు ఎందుకు తీసివేయబడ్డదో? అని ప్రశ్నించే అధికారమూ ఉంది. మరి ఈ మధ్య గురువు గారి బ్లాగులో నాకు అభ్యంతరకరంగా తోచే టపాలు ఉన్నాయి( చాలా విషయాల్లో వారిని గురుపూజ్యంగా గౌరవిస్తాను కూడా) అంత మాత్రాన నాకు వారి టపాలు కనిపించకూడదు కూడలి నుంచి తీసివేయండి అని అడిగితే భావ్యమా? ఆయన అభిప్రాయాలు బలంగా చెప్పుకోవడం ఆయన హక్కు! ఆయనతో విభేదించే వారు వ్యాఖ్యల ద్వారా చెప్పుకొంటారు…ఇప్పుడు అదీ కట్టడి చేశారు-కానీ అది ఆయన సొంత ప్రపంచం. మరి ఇందులో కూడలి పాత్ర ఎంత? అందుచేత ఎవరి హద్దులు వారే నియంత్రించుకోవాలి. ఇందులో ప్రముఖంగా అజయ్ గారి వ్యాఖ్యను అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. “రోజు పేపర్ లో చదివే పది ఆత్మహత్యల్లో ఆరు కడుపు నొప్పితో చేసుకున్నవే వుంటాయి”…దారుణమైన నిజం- పోస్ట్ మార్టెమ్ స్వయంగా చేసి నిర్ధారించుకొన్న నిజం. శరత్ గారి మొదటి బ్లాగును చూసి జడుసుకొన్న వారిలో నేనూ ఒకన్ని, కానీ ఎవరి అభిప్రాయాలు వాళ్లవి:-)

 29. హాయ్ అజయ్
  నా గురించి మీరు చేసిన విశ్లేషణ నచ్చింది – ఎందుకంటే అది నిజం కాబట్టి. నిజమే – నా క్లోజ్ సర్కిల్ కూడా అపరిచుతుడు అని సరదాగా అంటారు. నాలో చాలా కోణాలు వున్నాయి. ఒక కోణం మరొకరికి జెనెరల్ గా తెలియదు. నాది స్ప్లిట్ నే కాదు మల్టి పర్సాలిటీ అని అంటుంటారు నా గురించి బాగా తెలిసిన మిత్రులు, బంధువులు :) నా బ్లడ్ గ్రూపు AB కావడం వల్ల అలా నా వ్యక్తిత్వం వచ్చిందేమో అని సరదాగా అంటుంటాను.

  నల్లమోతు శ్రీధర్ గారికి, ఇతర మిత్రుల వ్యాఖ్యలకు ఇవాళే రిప్లయ్ ఇచ్చాను. మీరన్నట్లు శ్రీధర్ గారు అన్నది నిజమే. బయట చాలా సాత్వికంగా వుంటానండి – ఎందుకో ఈ కూడలి లోనే కాస్త దురుసుతనం ఎక్కువయ్యింది – తగ్గిద్దామనుకుంటున్నాను. ఇవాళే మరొక సందర్భం లో జ్యోతి గారితో ఈ విషయం ప్రస్తావించి నాలో మార్పు తీసుకువస్తాను అని చెప్పి కొందరి మనసులు నొప్పించినందుకు మన్నించమని కోరాను. నిజానికి నేను ధర్నా చేపట్టనక్కరలేదు – నిరసన వ్యక్తం చేయవచ్చు – ఆ విషయాలనే సూటిగా అడగవచ్చు – అప్పటికీ స్పందన లేకపోతే ధర్నా చేపట్టవచ్చు ( ఇది వారి ప్రయివేటు సైటు కాబట్టి అన్నీ వృధా ప్రయేసే అనుకోండి – అది పక్కన పెడితే) – ఏకంగా ధర్నా చేయడం అన్నది కొద్దిగా నా పొరపాటు చర్య. నా భావం, ప్రశ్నలు సహేతుకమే – అయితే అవి వెల్లడించడం లో జరిగింది కొంత పొరపాటు నా వైపు నుండి. వీవెను కి ఈమెయిల్ ఇవ్వచ్చు కదా అంటారు కొంతమంది – దాని వల్ల లాభం లేదు – వారి విచక్షణ ఏపాటిదో నాకు తెలుసు – అందుకే పబ్లిక్ గా వచ్చాను – చర్చ వల్ల నన్నా తనలో ఏమయినా మార్పు వస్తుందేమో నని.

  మీ సలహాలు దృష్టిలో పెట్టుకుంటాను. అయితే మీరు చెప్పినవి కొన్ని ఏకీభవించలేకపోతున్నాను. ఈ తెలుగు బ్లాగావరణములో ఒక చిన్న సమస్య వుంది. వున్నది కొద్ది మందే కాబట్టి – ఏది చేసినా విషయం తక్కువ – రభస ఎక్కువవుతున్నది. అందరూ సన్నిహితులవుతున్నారు – ఎవరినీ ఇబ్బంది పెట్టలేని పరిస్తితి అవుతోంది. అంటే అందరూ మిత్రులని కాదు – ఏదో రకంగా దగ్గర అవుతున్నారు. దానితో నా భావాలని వ్యక్తపరచడములో ఇబ్బంది అవుతోంది. అదే యు ట్యూబ్ లోనయితే ఎవరికీ ఎవరు పెద్దగా తెలియదు కాబట్టి ఇష్టమున్నవారు చూస్తారు – ఇష్టం లేనివారు చూడరు. అక్కడ పెద్దగా చర్చలు వుండవు. రకరకాల వ్యాఖ్యలు వస్తుంటాయనుకోండి – కానీ ఎవరూ పెద్దగా సన్నిహితం కారు. నా పనేదో , నా భావాలేవొ హాయిగా చెప్పేసుకోవచ్చు – అది సుమను నిర్వహణ లో లేదు కాబట్టి :)) అంటే వాళ్లకి రూల్స్ లేవా అంటే వున్నాయి కానీ అవి పట్టించుకోరు. అరుదుగా పట్టించుకున్నా పెద్దగా సమస్య వుండదు.

 30. ఇస్మాయిల్ గారు చెప్పినట్లు, బ్లాగులు లేకపోతే కూడలి లేదు, కూడలి లేకపోతే బ్లాగులకి ఇంత ఆదరణ వుండేదికాదు. Both are mutually dependent. అందుకే హక్కులూ, అధికారాలు ఇద్దరికీ సమంగానే వుంటాయి అని నా భావన. సామరస్యంగా సాగే చర్చలకు, వాదనలకు, అభిప్రాయాల సేకరణకూ, ఖండనకూ తగినంత స్థలం ఈ forum లో వుండాలని మాత్రమే “ప్రజాస్వామ్యం” అనే పదం వాడటం జరిగింది.

  ప్రజాస్వామ్యం కేవలం ఒక రాజకీయ ఆలోచన కాదు, అదొక పరిణితిచెందిన జీవన విధానం. తమ నమ్మకాల్ని అమలుపరుస్తూనే ఇతరుల అభిప్రాయాలకి గౌరవమిచ్చే ఒక సాంప్రదాయం ప్రజాస్వామ్యం. అందుకే దానికి అనుగుణంగా బ్లాగులూ – అగ్రిగేటర్ల మధ్య ఒక process based decision making mechanism ఉండటం కూడలిని మరింత మెరుగు పరిచే విధంగా ఉండగలదని మాత్రమే నేను ఆ సూచన చెయ్యటం జరిగింది.

  దేశసమగ్రతకి గొడ్డలిపెట్లు, విచ్చలవిడితననికి ప్రోత్సాహం, మూఢ విశ్వాసాలు, వర్గ ధూషణలు, వ్యక్తి ధూషణ, వ్యక్తిత్వ హననానికి పూనుకునే టపాల్ని మనం ఖండించినా ఆ బ్లాగుల్ని మిగతా విలువల దృష్ట్యా అంగీకరించడమేగాక గౌరవించే సాంప్రదాయం గల మనం, ఈ ఒక్క బ్లాగుని కూడలి నుంచీ తొలగించి ఆ ప్రజాస్వామ్య విలువలని కొంత మసిబారనిచ్చేట్లు చెయ్యడం నాకు కొంత ఖేదాన్ని కలిగించింది.

  కానీ, వీవెన్ గారు తమ విచక్షణను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడంతో, వారి ధృక్పధాన్ని గౌరవిస్తూ కేవలం సూచన మాత్రమే చేసాను. అయితే, ఇప్పుడు చర్చలు మళ్ళీ “తప్పొప్పుల” moral judgment ల వైపుగా సాగుతుండటం విచారకరం.

 31. వీవెన్, బ్లాగును కూడలి నుండి తీసివేసే విషయమై మీరు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాను. మీకున్న హక్కును మీరు వినియోగించారు -సద్విచక్షణతో! భేష్! ప్రజాస్వామ్యం, బహిరంగ చర్చ.. ఇలాంటివి పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ జరుగుతున్నదే అయ్యేది, మీరు చెయ్యదలచిన పని ఇప్పటివరకూ చెయ్యలేకపోయేవారు. బహిరంగ చర్చల పద్ధతి మొదలెడితే అనుచితమైన కోరికలు తలెత్తుతాయి. చూస్తున్నారు కదా.. ఇప్పటికే ఫలానా బ్లాగంటూ ఇక్కడ కొందరు బ్లాగరులు వేలెత్తి చూపడం కనబడుతూనే ఉంది. అవకాశం దొరికితే చాలు..

  ఈ బహిరంగ చర్చలూ అవీ పెట్టుకుంటే, రేపింకొకాయన వచ్చి ‘ఫలానా బ్లాగులో ఫలానా మతాన్నో కులాన్నో సమర్ధించాడు, మరో ఫలానా మతాన్నో కులాన్నో విమర్శించాడు.. అంచేత దాన్ని తీసెయ్యండి’ అంటూ చెబుతారు. దానిపై చర్చ మొదలెడతాం.. ఇలాగే కొట్టేసుకుంటాం, కొన్నాళ్ళపాటు.

  ఎల్లుండి, కృష్ణో మరొకడో వచ్చి ‘నా మనోభావాలు దెబ్బతిన్నాయ్, నాకసలు ఏ బ్లాగూ నచ్చలేదు, ఫలానా బ్లాగొక్కటే బావుంది. దాన్నొక్ఖదాన్నీ ఉంచి, మిగతావాటన్నిటినీ తీసెయ్యి వీవెన్, కావాలంటే నీది కూడా ఉంచుకోలే’ అని అంటాడు. మళ్ళీ చర్చ మొదలు.

  మరొకాయన ‘ఇదిగో, ఫలానాయన దేవుడున్నాడని చెబుతున్నాడు. లేడని నేను చెబుతుంటే ఇంటం లేదు. ఇక లాభంలేదు, ఈ బ్లాగును తీసిపారెయ్’ అంటూ వస్తాడు. మళ్ళీ చర్చ..

  అంచేత బహిరంగ చర్చల జోలికి పోవద్దు. మీరెలాగూ సరైన నిర్ణయం తీసుకుంటారని ఇక్కడున్న చాలా మంది అభిప్రాయపడుతున్నారు. పైగా అది ధృవపడింది కూడా. కాబట్టి, మీ నిర్ణయాలు మీరు తీసుకోండి.

  ఎవరి అభిప్రాయాలు వారివెలాగో.. మీ అభిప్రాయాలు మీవి. ” – ఈ ముక్క మన పురోగామి మిత్రులు గ్రహిస్తారనీ, గ్రహించాలనీ ఆశిద్దాం.

 32. వీవెన్ గారూ, మీకృషిని అభినందిస్తున్నాను. పైన కొందరు చెప్పినట్టు ఇది మీ పాలసీ స్టేట్ మెంటుగా కూడలిలో ఎప్పుడు ఎవరికి కావలసినా చూసుకోడానికి వీలుగా పెట్టితే బాగుంటుంది. కూడలి మీబ్లాగు. మీదే తుది నిర్ణయం.
  ఇదివరకు ఒకసారి చెప్పేను. మళ్లీ చెప్తున్నాను. మీకూడలిలో నాబ్లాగు నమోదు అయినతరవాత పాఠకులసంఖ్య మూడు, నాలుగు రెట్లు అయింది. థాంక్స్. – మాలతి

 33. Hi friends,

  Ee vivaadaanikantatikee chakkati parishkaaram spurinchindi. Ippudu nenu office lo vunnaanu kaabatti vivarangaa chehppalenu. Morning (IST) teliyparustaanu – vivarangaa. Aa solution andarikee nacchutundane anukuntunnaanu.

  Chinna hint! Aaa solution ‘Aparichitudu’ type lo vuntundi. Naa multi personality ni multi blogs lo choopistaanu. Soft face maatrame koodali lo kanapaduthundi (indulo meeku nacce sodi vutundi) (Veeven oppukuntene lendi) – Inko face ki link vuntundi (andulo srungaaram pai samaacaaram vutundi) – inko face meeku kanapadane kanapadu(indulo srungaaram vutundi) – alaa alaa…

  Please stand by!

 34. @ శివ,

  చాలా ధన్యవాదాలు.

  @ అందరికీ,

  ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగకుండా, అందరికీ వీలుగా మూడు అంతస్తులుగా నా బ్లాగులు నిర్వహించుకుందామనుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులూ, విమర్శకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఇలా ఆలోచిస్తున్నాను.

  1. మొదటి దాంట్లో చాలావరకు నా సోది నే వుంటుంది. మన వాళ్ళు పెద్దగా అభ్యంతర పెట్టనిది, ఇష్టపడేది అదేకదా. ఈ బ్లాగ్ శరత్ ‘కాలం’ కూడలి లో వస్తుంది. లైంగికత గురించి ఇందులో వుండదు.
  2. ఇందులో లైంగికత గురించి, ఆధునిక శృంగారం గురించి వుంటుంది. ఇది కూడలి లో రాదు. ఈ టాపిక్స్ లంకెలు మాత్రం మొదటి దాంట్లో టపాలుగా వస్తాయి కానీ కంటెంట్ రాదు. అందువల్ల మొదటి బ్లాగ్ ద్వారా కూడలిలో లంకెలు మాత్రం వస్తాయి
  3. ఈ బ్లాగ్ లో పూర్తిగా శృంగారం వుంటుంది. ఈ బ్లాగ్ కి లంకె రెండవ దాంట్లో వుంటుంది. దీని గురించి ఏమీ కూడలి లో రాదు.

  ఇవి పోగా నా యుట్యూబ్ ఛానల్ వీడియో లంకెలు నా మొదటి దాంట్లో టపాలుగా వస్తాయి. కంటెంట్ రాదు.

  ఇదీ నా ప్రతిపాదన. మీ అభిప్రాయాలు తెలపండి.

 35. @శరత్, Buddhi Jeevi, Sarath

  పైన మరియు ఇతర చోట్ల మీ వ్యాఖ్యలు చూసాకా, నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుందామన్న ఆలోచన నాకు కలగలేదు. నా నిర్ణయంపై బహిరంగ చర్చలు నేను చేయదల్చుకోలేదు.

 36. “ఎవరి అభిప్రాయాలు వారివెలాగో.. మీ అభిప్రాయాలు మీవి. ”
  @ చదువరి
  ఈ మధ్య చదువరి గారికి నాపై చురుకులు వేయడం సరదాలాగుంది:-) నేను చేసిన వ్యాఖ్యలో ఈ కింది వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా చదివి మరీ వేయాల్సింది చుఱుకు!
  “మీకు కూడలి నిర్వాహకుడిగా ఏ బ్లాగు ఉంచాలో? ఏ బ్లాగు తొలగించాలో? నిర్ణయం తీసుకొనే హక్కూ ఉంది.”
  మొత్తానికి బ్లాగు లోకంలో ముసలం పుట్టింది:-(

 37. కూడలి ఒక బ్లాగ్ అగ్రిగేటర్ మాత్రమే కాదు, అది కొందరు స్నేహితులు కలుసుకునే ట్రీ హౌస్ కూడా. అందులో ఒక్కరి ఎంట్రీ పాస్ తీసేస్తే వాతావరణం బాగుంటుందంటే ఆ ఇంట్లో ఓ మూల బొమ్మలు గీసుకునే నాకు సంతోషమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.