అత్యుత్తమ తెలుగు బ్లాగులు (రెండవ దఫా)

మీకు నచ్చిన, మీరు మెచ్చిన పది తెలుగు బ్లాగులు ఏవి అని క్రితం సారి నేను అడిగి సంవత్సరం గడిచింది. (కూడలి 100కి ఆ జాబితాలే మూలం.) అప్పుడు చాలా మంది తమకు నచ్చిన బ్లాగులను ఎన్నుకున్నారు. మరోసారి ఆలాంటి అంతర్మధనానికి సిద్ధంకండి.

ఈ సంవత్సర కాలంలో చాలా కొత్త బ్లాగులు వచ్చాయి, పాతవి కొన్ని మూగబోయాయి, మరి కొన్ని మూతబడ్డాయి.

ఇప్పుడు తాజాగా మీరు మెచ్చే మరియు తప్పక చదివే  పది (పది మరీ తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, లేదా మీకు నచ్చినన్నే ఇష్టమొచ్చినన్ని) బ్లాగులేవి?

నియమాలు ఇవీ:

 1. మీ స్వంత బ్లాగు(ల)ని మీ జాబితాలో చేర్చకండి. మీ బ్లాగుకి అంత సీనుంటే ఇతరులు చేరుస్తారు కదా.
 2. ఆ బ్లాగు తప్పక అత్యధిక శాతం చదువరులకు నచ్చుతుందని, బ్లాగేతరులకు తెలుగు బ్లాగులపై సదభిప్రాయం కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు.
 3. ఆ బ్లాగునుండి క్రమం తప్పకుండా టపాలు రాలుతుంటాయి. (ఎంత తరచూ అనేదికూడా మీ ఎంపికే.)

మీ జాబితాని ఇక్కడ వ్యాఖ్యగా గానీ లేదా మీ బ్లాగులో టపాగాగానీ ప్రచురించండి.

ఈ బ్లాగ్మధనం వల్ల ప్రయోజనాలివీ:

 • కూడలి 100 జాబితా తాజా అవుతుంది.
 • మీరు ఆయా బ్లాగులు ఎందుకు మీకు నచ్చుతున్నాయో చెప్తే, మిగతా వారు మరింత మెరుగ్గా బ్లాగులు రాయడానికి ప్రయత్నిస్తారు.
 • మీరు ఇప్పటివరకూ తెలియని బ్లాగులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

మీ జాబితాలు ప్రచురించండి మరి.

(తా.క.: దీన్ని మరో అంచె ముందుకు తీసుకెళ్ళి, మీకు నచ్చని బ్లాగులేవో కూడా రాయొచ్చు. ఎందుకు నచ్చట్లేదో నిర్మాణాత్మకంగా రాస్తే, తెలుగు బ్లాగ్లోకానికి చాలా ప్రయోజనం.)

65 thoughts on “అత్యుత్తమ తెలుగు బ్లాగులు (రెండవ దఫా)

 1. ఎక్కువమంది చదివినదే ఉత్తమ బ్లాగ్ అన్న ఒక నిబంధన బాగాలేదు. చాలామంది చెత్త రచనలూ, ఉబుసుపోక కబుర్లూ, సంచలనాలూ కూడా బాగా చదువుతారు. ఉత్తమ బ్లాగు అన్నది తక్కువమంది చదివినదీ అయివుండవచ్చు.

 2. ఈ ఎంపిక ఎలాగూ వ్యక్తిగతంగా నచ్చడం గురించికాబట్టి శరత్ గారు లేవనెతిన అభ్యంతరం పెద్ద valid కాదనుకుంటాను.రెండవ బిందువులో ఎక్కువమంది చదవడంతో పాటూ “తెలుగు బ్లాగులపై సదభిప్రాయం కలిగిస్తుందని” అని both quantity quality aspects మన వీవెన్ గారు కవర్ చేసేసారు. ఇక కింద ‘బద్దలయ్యే’ మెలిక కూడా పెట్టి నచ్చనివాటి గురించి రాయమన్నారుగా. This is a fine democratic process. చాలా మందికి నచ్చిన బ్లాగులు కూడా కొందరికి అస్సలు నచ్చని అవకాశంకూడా ఉంటుంది. Any way its a “purposeful fun”. నా అభినందనలు.

  ఇప్పుడే నాకు నచ్చిన బ్లాగుల గురించి ఒక టపా రాసేస్తాను.

 3. ఇది వరుసక్రమం కాదు.

  1.పూర్ణిమ-ఊహలన్ని ఊసులై..
  1.దిలీప్-ఏకాంతవేళ…ఉప్పొంగే భావాల
  1.క్రాంతి-అప్పుడు ఏమిజరిగిందంటే
  1.రమ -మనలోని మాట నా మనసులోని మాట
  1.నిషి-మానసవీణ
  1.మాలతిగారి తెతూలిక
  1.మీనాక్షి
  1.శ్రీవిద్య- బ్లాగువనం
  1.మహేష్- పర్ణశాల
  1.చదువరి

 4. @Sarath,

  మీ అభ్యంతరం రెండవ నియమం పైనని అనుకుంటున్నాను. మీరన్న ఉద్దేశం ప్రకారమైతే, ఉత్తమ బ్లాగులని అందరినీ చెప్పమని అడగాల్సిన పనిలేదు. గణాంకాలే చెప్పేస్తాయి. రెండవ నియమంలోని ముఖ్యాంశాలని గమనించండి:

  ఆ బ్లాగు తప్పక అత్యధిక శాతం చదువరులకు నచ్చుతుందని, బ్లాగేతరులకు తెలుగు బ్లాగులపై సదభిప్రాయం కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు.

  ఇది ఎక్కువమంది చదువుతున్నారు అన్న వాస్తవం కాక, మీ వ్యక్తిగత అభిప్రాయానికి ప్రాధాన్యత ఉంది. అందరి అభిప్రాయాలని ప్రతిబింబించే ఉత్తమ తెలుగు బ్లాగుల జాబితాని రూపొందిస్తున్నట్టు కాక, మీ తరపున మీకు నచ్చినట్టు ఉత్తమ తెలుగు బ్లాగుల జాబితా రూపొందిస్తున్నట్టు ఆలోచించండి.

  పైన మహేష్ చెప్పినట్టు, మీకు నచ్చడం ముఖ్యం.

 5. 1.శ్రీవిద్య- బ్లాగువనం
  2.మీనాక్షి
  3.మహేష్- పర్ణశాల
  4.పూర్ణిమ-ఊహలన్ని ఊసులై..
  5.బొల్లోజు బాబా- సాహితీయానం
  6.కల-కలలో కన్నీటి అల లో
  7.సుబ్రహ్మణ్యం మూల-ఏటి ఒడ్డున
  8.సుజాత-మనసులో మాట
  9.జ్యోతి
  10.వీవెనుడి టెక్కునిక్కులు

 6. 1) “SALABHANJIKALU”: Amazing knowledge and excellent felicity with words. But sadly, the author says he’s confining this blog only for private view. We must protest this grave injustice. [http://salabanjhikalu.blogspot.com/]

  2) “KALHARA”: What do you care for quantity when quality is THIS good. [http://swathikumari.wordpress.com/]

  3) “UHALANNI USULAI”: “Spontaneous” is the word for Purnima. But she is above my head when she writes about Cricket and raises profound questions like “why should we girls cook?” In my opinion she should minimize her quantity. [http://oohalanni-oosulai.blogspot.com/]

  4) “V.B.SOWMYA”: I read her when she reviews the books that I have already read. The freshness I feel here is, she speaks her own mind. But I wish she did her English book reviews too in Telugu. [http://vbsowmya.wordpress.com/]

  5) “MANISHI”: Ranare spurts occasional brilliance; but accentuated language is a big put off for me. I would really like to read him if he writes in plain language, and in third person. “I beseech ye RANARE, just once, for me!” [http://mynoice.blogspot.com/]

  These are the blogs that occasionally condescend to write about literature—the only thing that I really care about. These are the ones, when I happened to see their entry in Koodali Home Page, I definitely chek them out once.

  And ofcourse:

  6) “RENDU RELLA AARU”: The guy is damn funny. He can make you laugh even if you tightly stich your mouth. [http://thotaramudu.blogspot.com/]

  These are strictly subjective opinions. By the way, Veeven, I don’t agree with your maxim of quantity. Quality is what that really counts. And what about that “blogs we don’t like” thing? That won’t do nobody any good. These are the 6 blogs that I recommend (if I can) to any curious reader that enters first time into blogosphere. I tried hard to add another four, but I don’t read much of them. So I couldn’t come up with any.

 7. స్నేహమా… [snehama.blogspot.com]

  మానసవీణ… [nishigandha-poetry.blogspot.com]

  ఊహలన్నీ ఊసులై.. [oohalanni-oosulai.blogspot.com]

  విహారి [blog.vihari.net]

  చదువరి [chaduvari.blogspot.com]

  కలగూరగంప [tadepally.com]

  పర్ణశాల [parnashaala.blogspot.com]

  విశాల ప్రపంచం [venugaanam.blogspot.com]

  సాహితీ యానం [sahitheeyanam.blogspot.com]

  అనామిక [anaaamika.blogspot.com]

  నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు [computerera.co.in/blog/]

  వీవెనుడి టెక్కునిక్కులు.. [veeven.wordpress.com]

  నా ప్రపంచం [naprapancham.blogspot.com]

  మనసులోని మాట [manishi-manasulonimaata.blogspot.com]

  మనలోని మాట.. నా మనసులోని మాట… [manalomanamaata.blogspot.com]

  మీనాక్షి [meenakshir.blogspot.com]

  తెలుగు తూలిక [tethulika.wordpress.com]

  తెలుగు”వాడిని” [teluguvadini.blogspot.com]

  తెలు”గోడు” [anilroyal.wordpress.com]

  బ్లాగు వనం [srividya4u.blogspot.com]

  ఎందుకో కూడా రాద్దామని ఉన్నా, ఊరేళ్ళే హడావుడిలో ఉండి సమయం చిక్కక రాయలేకపోతున్నా… వచ్చే సరికి ఆలస్యమయిపోతుందని ఇప్పుడే రాస్తున్నా…

 8. నిన్న హడావుడిలో కొన్ని మర్చిపొయా.
  ఇది వరుసక్రమం కాదు.

  1.పూర్ణిమ-ఊహలన్ని ఊసులై..
  1.దిలీప్-ఏకాంతవేళ…ఉప్పొంగే భావాల
  1.క్రాంతి-అప్పుడు ఏమిజరిగిందంటే
  1.రమ -మనలోని మాట నా మనసులోని మాట
  1.నిషి-మానసవీణ
  1.మాలతిగారి తెతూలిక
  1.మీనాక్షి
  1.శ్రీవిద్య- బ్లాగువనం
  1.మహేష్- పర్ణశాల
  1.చదువరి
  1.తెలుగువాడిని
  1.తెలుగోడు
  1.అనామిక
  1.కల
  1.ప్రతాప్
  1.సాహితీయానం
  1.ఏటిఒడ్డున
  1.మనసులోని మాట
  1.విహారి

 9. @Phani,

  ఈ జాబితాలు సబ్జెక్టివ్‌గా ఉండాలన్నదే ఉద్దేశం. నాణ్యతకి ప్రాముఖ్యతనివ్వడానికి, పది బ్లాగులు అన్న దగ్గర కాస్త మార్చి ఇప్పుడు కనీసం పది కావాలన్న అర్థం రాకుండా చేసాను. అలాగే క్రమం తప్పని టపాలు అన్న నియమం దగ్గర ఎంత తరచూ అన్నది జాబితా తయారుచేసేవారి నిర్ణయమని స్పష్టం చేసాను.

  ఇక నచ్చని బ్లాగులు గురించి అంటే, మనకి నచ్చే బ్లాగుల్లో నచ్చని అంశాలపై ఫీడుబ్యాకుగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. You are caught in double negative when you said that. :)

 10. నేను దాదాపు ప్రతి బ్లాగూ తప్పక చదువుతాను. వ్యాఖ్యలు అన్నింటికీ రాయలేకపోవచ్చు. ఆ లెక్కన చూస్తే నేను తరచూ ఇష్టంగా చూసే బ్లాగుల జాబితా…వరుసగా అని ఏమీ లేదు.

  పర్ణశాల
  చదువరి
  తేటగీతి
  సాహితీ-యానం
  అప్పుడేమి జరిగిందంటే
  విహారి
  ఏకాంతవేళ..మదిలో ఉప్పొంగే..
  దీప్తిధార
  ఉహాలన్నీ ఊసులై
  నా ప్రపంచం
  మానసవీణ
  స్నేహమా
  తెలుగువా ‘డి ‘ని
  మనలోని మాట-నా మనసులో మాట.
  తెలుగు తూలిక
  వీవెనుడి టెక్కునిక్కులు

  వివరంగా రాయాలంటే చాలా ఉంది. ఈ మధ్య కొత్తగా మొదలైన బ్లాగుల్ని కూడా చేరిస్తే జాబితా మరింత పెద్దదవుతుంది.

 11. నాకు నచ్చినవి ఇవి, ఒక క్రమంలో లేవు. ఇంకా చాలా ఉన్నాయి ….కాని మహా (కామెంట్) భారతమయిపోతుంది.

  విహారి [blog.vihari.net]

  చదువరి [chaduvari.blogspot.com]

  విశాల ప్రపంచం [venugaanam.blogspot.com]

  సాహితీ యానం [sahitheeyanam.blogspot.com]

  అనామిక [anaaamika.blogspot.com]

  నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు [computerera.co.in/blog/]

  వీవెనుడి టెక్కునిక్కులు.. [veeven.wordpress.com]

  నా ప్రపంచం [naprapancham.blogspot.com]

  మనసులోని మాట [manishi-manasulonimaata.blogspot.com]

  కొత్త పాళీ [pratibimbamu.blogspot.com]
  [kottapali.blogspot.com]
  [vinnakanna.blogspot.com]

  ఊహలన్నీ ఊసులై.. [oohalanni-oosulai.blogspot.com]

  మీనాక్షి [meenakshir.blogspot.com]

  తెలుగు తూలిక [tethulika.wordpress.com]

  తెలుగు”వాడిని” [teluguvadini.blogspot.com]

  తెలు”గోడు” [anilroyal.wordpress.com]

  బ్లాగు వనం [srividya4u.blogspot.com]

  కలగూరగంప [tadepally.com]

  పర్ణశాల [parnashaala.blogspot.com]

 12. revised:

  విహారి [blog.vihari.net]

  చదువరి [chaduvari.blogspot.com]

  విశాల ప్రపంచం [venugaanam.blogspot.com]

  సాహితీ యానం [sahitheeyanam.blogspot.com]

  అనామిక [anaaamika.blogspot.com]

  నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు [computerera.co.in/blog/]

  వీవెనుడి టెక్కునిక్కులు.. [veeven.wordpress.com]

  నా ప్రపంచం [naprapancham.blogspot.com]

  దిలీప్ [ekantham.blogspot.com]

  మనసులోని మాట [manishi-manasulonimaata.blogspot.com]

  కొత్త పాళీ [pratibimbamu.blogspot.com]
  [kottapali.blogspot.com]
  [vinnakanna.blogspot.com]

  ఊహలన్నీ ఊసులై.. [oohalanni-oosulai.blogspot.com]

  మీనాక్షి [meenakshir.blogspot.com]

  తెలుగు తూలిక [tethulika.wordpress.com]

  తెలుగు”వాడిని” [teluguvadini.blogspot.com]

  తెలు”గోడు” [anilroyal.wordpress.com]

  బ్లాగు వనం [srividya4u.blogspot.com]

  కలగూరగంప [tadepally.com]

  పర్ణశాల [parnashaala.blogspot.com]

  స్నేహమా… [snehama.blogspot.com]

 13. పరమ చెత్త బ్లాగు :పర్ణశాల http://parnashaala.blogspot.com

  ఇదో అసలుసిసలు పిడివాద బ్లాగు .పరమచెత్త ఎక్కడ దొరికినా వ్రాస్తూ చదివేవారి బుర్ర తినటం ఈ బ్లాగు ప్రత్యేకత . కొత్తగా బ్లాగులోకంలోకి వచ్చినవారు సాద్యమైనంత వరకూ ఈ బ్లాగుని చదవకపోవటం మంచిది . ఒకవేల చదవాలనుకుంటే తలపోటు బిల్లలు పక్కన పెట్టుకుని చదవటం మంచిది .

  తీవ్రవాదులకు సానుభూతి చూపిస్తూ … దేశ సమగ్రతకు గొడ్డలి పెట్టులా వ్రాయటం ఈ బ్లాగుకు మాత్రమే ప్రత్యేకమైన విషయం .

  మీరు గనుక తీవ్రవాద మరియు వేర్పాటువాద సానుభూతిపరులు , భారతీయులను వ్యతిరేకించే వారు అయితే ఈ బ్లాగు మీకు నచ్చుతుంది …

 14. 1. సౌమ్య: (http://vbsowmya.wordpress.com) నేను చదివిన మొదటి తెలుగు బ్లాగు ఇది. తను చదివే పుస్తకాలనూ, చూసిన సినిమాలనూ అంతే ప్రేమతో పంచుకునే తన సింప్లిసిటీ నాకు నచ్చింది.

  2.సుజాత :(మనసులోని మాట ) నా బ్లాగులో వచ్చిన ఒక వ్యాఖ్యననుసరించి వీరి బ్లాగు చేరాను.తన రచనాశైలి, వాఖ్యనిర్మాణం,అభివ్యక్తి విధానం సింపుల్గా ఉండి చదివించే గుణాన్ని మెండుగా కలిగివుంటాయి.

  3.సుజాత: (గడ్డిపూలు) వీరి బ్లాగులోఉన్న విషయవైవిధ్యం నన్నాకట్టుకుంది.ఒక persobalsed శైలి వీరి సొంతం. ఎంత సీరియస్ acedemic/science విషయం రాసినా,అది వారు రాసినట్టే ఉండటం ఆ బ్లాగు అందం.

  4.కొత్తపాళీ: వీరికి నేను ఏకలవ్య శిష్యుడిని.బ్లాగులో గౌరవప్రదంగా ఎలా ఉండాలో వీరిని చూసి నేర్చుకోవాలి. కాకపోతే ఇప్పటివరకూ నాకావిషయం అంతుబట్టలేదు. కాబట్టి, నా బొటనవేలు మాత్రం ప్రస్తుతానికి భద్రం.

  5.రాధిక:(స్నేహమా) కవిత్వమంటే టైంపాసుకిచేసే అర్థంకాని అడ్డగోలు సంభాషనలనే నా అపోహని అరికట్టిన కవితల బ్లాగు ఇది.అందుకే వారి కవితని ఆస్వాదించినా,అర్థం చేసుకునే ప్రయత్నంలో విభేధింఛినా ఆనందం మాత్రం గ్యారంటీగా లభించింది.

  6.బొల్లోజుబాబా: (సాహితీ యానం)స్నేహమా బ్లాగు కవితని ఆస్వాదించడం నేర్పితే,బాబాగారు కవితని అనుభవించడం,ఆలోచించడం, ప్రతిస్పందించడాన్ని నేర్పారు. తనెంచుకునే సామాజిక కోణాలూ,ఆవిష్కరించే జీవితాలూ నా జీవితంలో కొన్ని విలువల్ని అందించాయని ఖచ్చితంగా చెప్పగలను.

  7.స్వాతి కుమారి: (కల్హర)తను రాసిన ‘త్వమేవాహం’ ఒక్కటిచాలు వంద బ్లాగుల అభిమానాన్ని అందిపుచ్చుకోవడానికి.ఆ భావగాంభీర్యం అదే క్షణాన భాషలో లాలిత్యం కథలో తను అద్దే కవితాత్మకతక అభినందనీయం.అలాగే తను కథలో పాత్రల వ్యక్తిత్వాల్నికాక వారి ఆత్మల్ని ఆవిష్కరించే విధానం అనూహ్యం.

  8.పూర్ణిమ (ఊహలన్ని ఊసులై): ఈ బ్లాగొక కొత్తబంగారు లోకం.ఆధునిక తెలుగు నగర ప్రపంచానికి అక్షరరూపం.‘నగర’ అని ఎందుకంటున్నానంటే,తన రచనల్లో తను మనస్ఫూర్తిగా జీవించిన నగరజీవనం ప్రతిఫలిస్తుంది. అదే క్షణాన, ఒక social aweareness,human responsibility కనిపిస్తుంది.తనకే తెలియని ఒక భావుకత,ideology లోతులు తన రచనల్లో సహజంగా,స్వాభావికంగా కనబడతాయి. రాబోయేకాలంలో urban youth identify చేసుకోగలిగే విషయాలు ఈ బ్లాగు సొంతం.

  9.అబ్రకదబ్ర: (తెలు-గోడు):నేను నా బ్లాగులో కొత్తసన్నాయినొక్కులు నొక్కినప్పుడలా,ఒక మద్దెల చేతబట్టుకుని నన్ను వాయింఛే బ్లాగరి. కాకపోతే నాకు తన బ్లాగు మాత్రం నిత్య తొలకరే. సరదాగా రాసినా,స్వియానుభవాలు తెలిపినా, సీరియస్ విషయాలు చర్చకుపెట్టినా మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేయటంలో సఫలమౌతాడు.

  10.మీనాక్షి:నేనూ బ్లాగుతానండీ! అంటూ వచ్చి,తన హాస్య చతురతతో, అమాయకపు నవ్వులతో పువ్వులు పూయించిన బ్లాగు మీనాక్షి. కొంత చిలిపితనం, కొంత అమాయకత్వం,కొంత అతితెలివి, కొంత సినిమాజ్ఞానం, బొత్తిగా తెలియని లోకజ్ఞానాన్ని భోళాగా బయటపెట్టి మనల్ని భళ్ళున నవ్విస్తుంది. ఈ బ్లాగు చదవాలంటే పక్కనెవరూ లేకుండా చూసుకోవడం మంచిది. లేకుంటే చూసినవారు మనల్ని పిచ్చోళ్ళనుకునే అవకాశం కల్పించగల బ్లాగిది.

  వీటితోపాటు జ్యోతి, మానసవీణ,ఏకాంతం దిలీప్ బ్లాగులకి నేను regular visitor ని. నాకు నచ్చి నేను స్పందించే బ్లాగులివి.

 15. శ్రీవిద్య (బ్లాగువనం)మరో హాస్యపు తునక (ఎలా మిస్సయ్యానబ్బా!).
  మాలతి (తెలుగు తూలిక) వారి బ్లాగుని గౌరవంగా చూడటమే!
  రెండు రెళ్ళ ఆరు : ఈ హాస్యవల్లరి ఆగిపోయినట్టుంది.

 16. మెచ్చిన బ్లాగులు…వరుస క్రమంలో (నచ్చిన కారణం)

  1.కలం కలలు-ఫణి (చక్కటి ఆలోచనా స్రవంతి)
  2.సాలభంజికలు-మరో ఫణీంద్రుల వారు(మేధో మధనం)
  3.కొత్తపాళీ-నాశీ గారు (అరవై నాలుగు కళలు)
  4.కల్హర-స్వాతికుమారి (చిక్కటి కవితలు)
  5.సౌమ్య (పుస్తకాల పురుగు)
  6.రెండురెళ్లుఆరు/ విహారి (హాస్యం)
  7.రానారె (స్వగతం-మాండలికం)
  8.గుండెచప్పుడు (నిబద్ధత)
  9.కలగూరగంప (భాష)
  10.పర్ణశాల (భావం)

 17. @శివగారు: మీరలా మరీ బ్లాగు అడ్రస్స్ ఇచ్చి మరీ పరం చెత్త బ్లాగు అనడం బాగోలేదు. బ్లాగర్లకి ఇబ్బంది గా ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళకి అడుగులు నేర్పాలి కాని ఇలా కాదేమో ఆలోచించండి. వచ్చేవాళ్ళు దడుసుకొనే ప్రమాదం ఉంది.

  వీవెన్ గారు: నచ్చని బ్లాగులు చెప్పమనడం అంత సమంజసంగా లేదు, మరీ ఒక మతాన్నో, కులాన్నో జాతి నో అవమానిస్తుంటే కొంచం జాగ్రత్తగా ఉండి మీరే ఆ బ్లాగులని బ్లాక్ చేసేస్తున్నారు కదా! ఇక నచ్చని బ్లాగుల ప్రసక్తి ఎందుకు? రెపొద్దున ఎవరన్నా నా బ్లాగు బాగోలేదు అంటే నా మనో భావాలు దెబ్బ తినవా చెప్పండి? నచ్చని బ్లాగుల ఊసు వద్దసలు అనిపిస్తొంది ఆలోచించండి.

  నచ్చనివి అంటే ఉమ్మడిగా చదువుతున్నప్పుడు ఇబ్బంది పెట్టేవి అని, ఏదో మల్టీ లెవెల్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించో,హద్దులు దాటే శృంగారం గురించో లేదా అందరూ అభిమానిస్తున్న ఓ అంశం ఘాటుగా విమర్శిస్తేనో కలిగే ఇబ్బంది నచ్చకపోవడం అలాంటివేమన్నా నిరభ్యంత్రంగా చెప్పొచ్చు.అంతేనంటార వీవెన్ గారు?

 18. కూడలి లో ప్రత్యక్షమయ్యే టపాల వేగం అందుకోలేక చాలా టపాలు, బ్లాగులు చూడలేకపోయాను. అప్పుడప్పుడు కొన్ని మంచి బ్లాగులు దొరికినా దురదృష్టవశాత్తు లంకెలు జారవిడుచుకున్నాను. పోగా ప్రస్తుతం నాకు నచ్చి, నేను తరచూ చూసే బ్లాగులు ఇవి…

  – లీలామోహనం – http://vijayamohan59.blogspot.com/
  నా కళ్ళకు ఇంపైన ఏకైక బ్లాగు.

  – free hugs…
  గాఢమైన భావాలను తేటగా, సున్నితంగా చెప్పే బ్లాగు. టపాలు చాలా అరుదుగా వచ్చినా, ఎదురుచూపును నిరాశ పరచని బ్లాగు. Rare and beautiful.

  – పర్ణశాల – http://parnashaala.blogspot.com/
  ఇక్కడ వడ్డించని టాపిక్ లేదు. :)

  – కలం కలలు..- http://naagodava.blogspot.com/
  ఈ బ్లాగును వర్ణించేంత సాహసం నేను చేయలేను.

  – స్నేహమా… – http://snehama.blogspot.com/
  ఈ బ్లాగులో రాసే కవితలు చదివిన ప్రతి సారీ మదిలో ఎక్కడో ఒక రాగం మొదలవుతుంది..సన్నగా, చిన్నాగ, దురంగానే అయినా స్పష్టంగా వినిపిస్తుంది..

  – ఊహలన్నీ ఊసులై – http://oohalanni-oosulai.blogspot.com/
  బ్లాగు సముద్రంలో అనుకోకుండా ఎదురైన ఒక స్వాతిముత్యం. పేరుకు తగ్గట్టు ఊహలన్నిటినీ ఊసులుగా మలిచే బ్లాగు. Symbol of sensible, strong and balanced blog. Natural humour passes as an underlying current in the writings.

  – ఆకాశం లో సగం – http://nirmalak.blogspot.com/
  ఈమె వృత్తి పరంగా రచయిత్రి అని చదివి ఈమె కథలు, వ్యాశాలు చదవటం మొదలుపెట్టాను. ఒక సన్నివేశం కళ్ళ ముందు కదిలించగల రచనలు.

  – ఏకాంత వేళ… ఉప్పొంగే భావాల… – http://ekantham.blogspot.com/
  రోజూ కళ్ళ ముందు మెదిలే సంఘటనల ఆధారంగా ఏర్పడ్డ భావాల అలలు. ఒక్కొక్కటిగా ఒకదాని తరువాత మరొకటి వచ్చి తాకే సుతిమెత్తని అలలు, అందమైన పద చిత్రాలు, ముచ్చటైన వర్ణనలు..

  – కళాస్పూర్తి… – http://pruthviart.blogspot.com/
  చిత్రాల ద్వారా nalugurinI AkaTTukOvaTamE kAka, komtamamdiki ప్రేరణ కలిగించే రంగుల ముగ్గు ఈ బ్లాగు.

  టపాలలోనే కాకుండా, వ్యాఖ్యల్లో కూడా అదరగొట్టే తెలుగు బ్లాగర్లు చాలా మంది ఉన్నారు… అలాగే ప్రోత్సాహకులు, తప్పులు చేస్తే మెత్తగా మందలించేవారు, పెద్దలూ… .నేను భాష పరంగానే కాకుండా, వైజ్ఞానానిక, మానసిక పరంగా కూడా ఎదిగేందుకు తోడ్పడుతున్న తెలుగు బ్లాగరులందరికీ కృతజ్ఞతలు, అభినందనలు.

 19. శివ గారు నా బ్లాగును చెత్త బ్లాగనడానికి వారికి పూర్తి అధికారం ఉంది.కాకపోతే వీవెన్ గారు, ఎందుకునచ్చలేదో “నిర్మాణాత్మకంగా” చెప్పమన్న షరతును వారు పాటించని ఒకే ఒక్క కారణం చేత నేను ఇక్కడ వారి వ్యాఖ్యను ఖండిస్తున్నాను.

  వ్యక్తిగతంగా నా బ్లాగు నచ్చని విషయం సాధికారంగా చెప్పడానికి శివగారికి హక్కున్నా,”ఎవరూ చదవకపోవడం మంచిది” అని బ్లాగర్లందరికీ సలహా ఇవ్వడాన్ని నేను గర్హిస్తున్నాను. పైపెచ్చు “ఒకవేల చదవాలనుకుంటే తలపోటు బిల్లలు పక్కన పెట్టుకుని చదవటం మంచిది” అని అవమానకరంగా మాట్లాడటం వారి cheap mentality కి చిహ్నంగా నేను తప్పనిసరి పరిస్థితుల్లో భావించడానికి ఆస్కారం కల్పించింది.

  ఇప్పటివరకూ నా బ్లాగులో 87 టపాలున్నాయి. వాటిల్లో ఏఒక్కటీ “దేశసమగ్రతకు గొడ్డలిపెట్టుల్లాంటివి” లేవని ఖచ్చితంగా చెప్పగలను. నా అభిప్రాయాలు వారికి భిన్నమైనంత మాత్రానా, నేనొక భారతీయవ్యతిరేక బ్లాగరిని అనే అపోహల్ని కల్పిస్తున్న శివగారి వ్యాఖ్యలను నేను బ్లాగ్ముఖంగా ఖండిస్తున్నాను.

 20. నచ్చిన బ్లాగులను ఎంచమంటే కొంచెం ఇబ్బంది గానే ఉంది.
  కొన్ని బ్లాగులు ఎందుకు నచ్చుతాయో మహేష్ గారు ఇచ్చిన వివరణ దాదాపు సార్వజనీనమైన భావనలె అని అనుకొంటాను. (with exception to my blog sincerely).

  సుబ్రహ్మణ్యం మూల-ఏటి ఒడ్డున
  అనామిక [anaaamika.blogspot.com]
  పర్ణశాల [parnashaala.blogspot.com]
  స్నేహమా… [snehama.blogspot.com]
  ఏకాంతపు దిలీప్: ఏకాంతవేళ..మదిలో ఉప్పొంగే..
  సుజాత :(మనసులోని మాట )
  సుజాత: (గడ్డిపూలు)
  కొత్తపాళీ గారి బ్లాగులు
  ప్రతాప్ http://dprathap.blogspot.com/
  కల: http://kala-lo.blogspot.com/
  క్రాంతి-అప్పుడు ఏమిజరిగిందంటే
  ఊహలన్నీ ఊసులై.. [oohalanni-oosulai.blogspot.com]
  YaminiCR – http://yaminiabhipraayaalu.blogspot.com/
  మేధ: నాలోనేను
  తెలుగు తూలిక [tethulika.wordpress.com]
  మీనాక్షి [meenakshir.blogspot.com]
  కలం కలలు-ఫణి
  బ్లాగు వనం [srividya4u.blogspot.com]
  నా ప్రపంచం [naprapancham.blogspot.com]
  కలగూరగంప [tadepally.com]
  అబ్రకదబ్ర: (తెలు-గోడు)
  తెలుగువా ‘డి ‘ని
  నరసింహ గారి బ్లాగులు
  వీవెనుడి టెక్కునిక్కులు.. [veeven.wordpress.com]
  చదువరి [chaduvari.blogspot.com]
  పూర్ణిమ (ఊహలన్ని ఊసులై)
  నిషిగంధ: మానస వీణ
  దేవర పల్లి రాజేంద్ర గారి బ్లాగులు

  పైవి నాకు నచ్చిన నేను తరచూ సందర్శించే బ్లాగులు. పైన ఉన్నటువంటి వరుస క్రమం యాదృచ్చికమే తప్ప ఆర్డర్ ఆఫ్ మెరిట్ కాదు.

  బొల్లోజు బాబా

 21. పర్ణశాల బ్లాగుపై శివ గారి వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉంది. మీకు నచ్చకపోతే చదవొద్దు, కామెంటొద్దు, వదిలెయ్యండి! ఇతర్లు కూడా చదవొద్దని,తలపోటు బిళ్లలు పక్కన పెట్టుకుని చదవాలని చెప్పడం విడ్డూరంగా ఉంది.

  నిజానికి పర్ణశాల బ్లాగే ఒక పెద్ద కూడలి. సందడిగా ఉండే బ్లాగు!బోలెడు చర్చకు ఆస్కారముండే బ్లాగు. ఎందుకు నచ్చలేదో వివరంగా చెప్పకుండా’పిడివాద బ్లాగు, చదవొద్దు,’ అనడం సమంజసంగా లేదు.

 22. శివ గారి రిమార్కులు చాలా డిరొగేటరీ గా ఉన్నాయి.
  ఆలోచన రెకెత్తించే భావాలతో ఉన్న పోష్టులను రాస్తున్న బ్లాగరిపై ఈ విధంగా వ్యక్తి గత దాడికి దిగడం సరికాదు. సంస్కారం అంత కన్నా కాదు.
  బొల్లోజు బాబా

 23. నేను తరచూ చూసే బ్లాగులు..

  స్నేహమా – రాధిక
  కల్హార – స్వాతి
  తెతూలిక – మాలతి
  ఊహలన్నీ ఊసులై – పూర్ణిమ
  మనసులో మాట – సుజాత
  మీనాక్షి – మీనాక్షి
  గడ్డిపూలు – సుజాత
  బ్లాగువనం – శ్రీవిద్య
  మనసులోని మాట-నా మనసులో మాట – రమణి
  కలలో కన్నీటి అలలో – కల
  మోహనరాగాలు – పద్మ
  కొత్తపాళీ – కొత్తపాళీ
  విన్నవీ కన్నవీ – కొత్తపాళీ
  నేను చెప్పేది ఏమిటంటే – నిరంజన్
  నా మదిలో – ప్రవీణ్
  ఏకాంతంలో.. ఉప్పొంగే భావాల – దిలీప్
  పర్ణశాల – మహేష్
  సాహితీయానం – బొల్లోజు బాబా
  నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు – శ్రిధర్
  జ్ఞాపకాల కెరటాలు – ప్రతాప్

 24. “మీరు మెచ్చిన బ్లాగులు” అని ఈ టపా శీర్షిక అయ్యుంటే నేను కనీసం ఓ ఇరవై బ్లాగులు కారణాలతో సహా చెప్పేదాన్ని!! కానీ “అత్యుత్తమ” అన్నారు కావున, దానికి లోబడి నా దృష్టిలో తెలుగు బ్లాగింగ్ కి ఒక “విశిష్ట స్థానాన్ని” కలిగించిన మూడు బ్లాగులు గురించి చెప్తాను.

  ౧. నా గొడవ (ఫణీంద్ర): ఊరుకోకుండా ఉండలేక, ఊసుపోక “టైం పాస్” కి రాసేవి బ్లాగులు అన్న నా “నమ్మకాన్ని” తుంచివేసిన బ్లాగిది. నా బ్లాగుని నేను “నా మనసుకి రఫ్ నోట్స్” అన్నట్టుగా వాడుకోడానికి కూడా ఈ బ్లాగే కారణం. ఇందులో మహా అయితే పాతిక టపాలు కూడా ఉండకపోవచ్చు, కానీ ఒక్కోటి ఎన్ని సార్లైనా చదువుకునేలా ఉంటాయి. చేసే ప్రతీ చిన్న పనినీ “సీరియస్” గా ఆస్వాదించే నాకు, ఈ బ్లాగులోని సీరియస్ నెస్ పెద్ద ఖజానా!! I’ve not come across another blog of this nature.

  ౨. రెండు రెళ్ళ ఆరు (గౌతం): “మీరు మీలాంటి మనిషే, నేను నా లాంటి మనిషే!!” ప్రతీ మనిషీ ప్రత్యేకం అని వివరిస్తూ నా కమ్మెంట్ కి ఫణిగారు ఇచ్చిన జవాబు. నిజమే, అందరూ మనుషులమే, ఇంచుమించు అవే అశయాలు, ఆవేదనలు, అభిప్రాయాలు, ఆలోచనలు, అయినా ప్రత్యకం ఎందుకు? తనకి జరిగిన అనుభవాలను అందరికీ హాస్యంగా పంచిపెట్టే తోటరాముడు గారు నాకు నేర్పింది “Learning two distinctly different lessons from the same experience is what seperates people.”!! వారికి ఎదురైన సంఘటనలు నాకు ఎదురయ్యుండచ్చు. నేనే చెప్పాల్సివస్తే “విరక్తి” కలిగేలా చెప్తా!! అదే వారైతే వద్దన్నా నవ్వించి తీరుతారు. Sometimes, I seriously wonder if he knows how good he is at writing!! I wish he knows. ఇకపోతే, I’ve never seen him replying to any of the comments to his blog or elsewhere. I thoroughly admire the way he uses the blog stage and vanishes away!! :-)

  ౩. యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి (రానారె): నాకు “యాస” లో మాట్లాడాలంటే చాలా ఇష్టం. కారణాంతరాల వల్ల నాకే యాస వంటబట్టలేదు కానీ, ఈ బ్లాగులో ఉన్న రాయలసీమ యాస నాకు మహా బాగా నచ్చుతుంది. స్వగతాన్ని కథలుగా అల్లి, అందులో జీవిత సత్యాలను అందంగా అమర్చే తీరు అమోఘం. I’m rich by the experiences of life అన్నది రానారె పరిచయ వాక్యాలు. ఆ రిచ్ నెస్ అంతా ఈ బ్లాగుల లంకెబిందెల్లో ఉందన్నది నా నమ్మకం!!

  బ్లాగింగ్ తో నా తొలి పరిచయం ఒరెమునా బ్లాగుతో జరిగినా; కూడలి, జల్లెడలు తెలిసాక తప్పక అన్నీ టపాలు చదివి, కమ్మెంటడం అంతగా చేత కాకపోయినా ఓ రాయి అలా అలా విసురుతూ బ్లాగులోకాన్ని చాలా వరకూ మిస్స్ కాకుండా జాగ్రత్త పడతాను. సౌమ్య మరియు “మీరు చదివారా” రవి గారి బ్లాగుల వల్లే నా బ్లాగులో అడపాదడపా పుస్తక పరిచయాలుంటాయి. తెలుగు పద్యం బ్లాగు, కొ.పా గారి http://telpoettrans.blogspot.com/ నేను పూర్తిగా మర్చిపోయిన పద్యాలను కొత్తగా పరిచయం అయ్యాయి!! స్వాతి గారి కల్హర గురించి కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఇంక నేను కమ్మెంటినా కమ్మెంటకపోయినా చాలా వరకూ బ్లాగులన్నీ చదువుతాను.

  @phani: సాలభంజికల విషయంలో ఖండిస్తే సరిపోదేమో, ఉద్యమాలు లేవదీయాల్సిందే!! నాకీ బ్లాగు గురించి తెలిసేటప్పటికి చాలా ఆలస్యం అయ్యిపోయింది. I wanna read it petty badly!! :-(

 25. అనేది సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలంటారు.. సహేతుకం, NIRMANATMAKAM అనేది ఒక్క విమర్శ కే వర్తిస్తుందా.. ఎందుకని పొగడ్తకి వర్తించదు?? అంటీ.. పొగడ్తలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండక్కరలేదా?? విమర్శలు మాత్రమె సహేతుకంగా ఉండాలా?? ఎంత చెత్త రచనని అయినా ఆహా ఒహో అని పోగుడితే, డబ్బా కొడితే.. చాలా… అప్పుడు సహేతుకం గుర్తుకి రాదా?? నా దృష్టిలో పొగడ్త కి విమర్శకి రెంటికి సహేతుకం అవసరం. చెత్త రచనకి ఆహా అని ఒహో అని అంటే చాలు ప్రచురించేస్తారు. అదే కొంచం విమర్శిస్తే చాలు.. బుట్ట దాఖలు. ఏమి ఈ న్యాయం. ఇంతవరకు ఎవరూ DARE చేసి.. పొగడ్తలు విమర్శలు కూడా సహేతుకంగా, విమర్శనాత్మకంగా ఉండాలని అడిగివారిని చూడలేదు, చదవలేదు.. చూద్దాం అంత దమ్మున్న వారిని మున్ముందు…

 26. పొగడ్త =విమర్శ. ఇప్పుడు BLOGS లో కాని, అప్పట్లో పత్రికలలో విమర్శ అనేది సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలంటారు.. సహేతుకం, NIRMANATMAKAM అనేది ఒక్క విమర్శ కే వర్తిస్తుందా.. ఎందుకని పొగడ్తకి వర్తించదు?? అంటీ.. పొగడ్తలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండక్కరలేదా?? విమర్శలు మాత్రమె సహేతుకంగా ఉండాలా?? ఎంత చెత్త రచనని అయినా ఆహా ఒహో అని పోగుడితే, డబ్బా కొడితే.. చాలా… అప్పుడు సహేతుకం గుర్తుకి రాదా?? నా దృష్టిలో పొగడ్త కి విమర్శకి రెంటికి సహేతుకం అవసరం. చెత్త రచనకి ఆహా అని ఒహో అని అంటే చాలు ప్రచురించేస్తారు. అదే కొంచం విమర్శిస్తే చాలు.. బుట్ట దాఖలు. ఏమి ఈ న్యాయం. ఇంతవరకు ఎవరూ DARE చేసి.. పొగడ్తలు విమర్శలు కూడా సహేతుకంగా, విమర్శనాత్మకంగా ఉండాలని అడిగివారిని చూడలేదు, చదవలేదు.. చూద్దాం అంత దమ్మున్న వారిని మున్ముందు…

 27. @ramani
  మీ మనోభావాలను నేను గాయపర్చి ఉంటే క్షమించండి .

  @కె.మహేష్ కుమార్
  ఎందుకు నచ్చలేదొ పై కామెంట్ లోనే నిర్మాణాత్మకంగా వివరించాను. మరొక్కసారి చదవండి …

  మీమాట “ఎవరూ చదవకపోవడం మంచిది” అని బ్లాగర్లందరికీ సలహా ఇవ్వడాన్ని నేను గర్హిస్తున్నాను.”

  అలా అని నెను అనలేదు . మీరు నా కామెంట్ ని మీరు వక్రీకరించారు …
  నేను ఇలా అన్న్నాను . కావాలంటే పైన చూడండి .మరొక్కసారి నా కామెంట్ ను చదవండి .
  “కొత్తగా బ్లాగులోకంలోకి వచ్చినవారు సాద్యమైనంత వరకూ ఈ బ్లాగుని చదవకపోవటం మంచిది . ఒకవేల చదవాలనుకుంటే తలపోటు బిల్లలు పక్కన పెట్టుకుని చదవటం మంచిది .”

  మీరు ఇలా అన్నారు :
  పైపెచ్చు “ఒకవేల చదవాలనుకుంటే తలపోటు బిల్లలు పక్కన పెట్టుకుని చదవటం మంచిది” అని అవమానకరంగా మాట్లాడటం వారి cheap mentality కి చిహ్నంగా నేను తప్పనిసరి పరిస్థితుల్లో భావించడానికి ఆస్కారం కల్పించింది.

  నా సమాధానం :
  అలగే భావించుకోండి . సరే మరి మీరు ఒక మహిళా బ్లాగర్ని వ్యక్తిగతంగా ఇలా అవహేలన చేసారు పై కామెంట్స్ లో “మీనాక్షి:నేనూ బ్లాగుతానండీ! …….. కొంత అమాయకత్వం,కొంత అతితెలివి, బొత్తిగా తెలియని లోకజ్ఞానాన్ని ” ఈ మాటలు అవమానకరం కాదా సాటి బ్లాగరికి.

  మీ మాట “ఇప్పటివరకూ నా బ్లాగులో 87 టపాలున్నాయి. వాటిల్లో ఏఒక్కటీ “దేశసమగ్రతకు గొడ్డలిపెట్టుల్లాంటివి” లేవని ఖచ్చితంగా చెప్పగలను.”

  నా సమధానం :
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_17.html
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_19.html
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_08.html

  @చదువరి
  ఎందుకో కారణాలు నా కామెంట్ లో ఉన్నాయి . మరొక్కసారి చదవండి ..
  నేనెవరినీ నిందించటంలేదు .ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవు . విబేదాలు కూడా లేవు . నాకు నచ్చని కారణాలు చెప్పా…

  @ సుజాత , బాబా
  అది వ్యక్తిగత దాడా? నేను బ్లాగు మీద అభిప్రాయం చెప్పా తప్ప వ్యక్తి మీద కాదు . అదైనా అడిగితేనే … స్పందించండి తప్ప ఎదురు దాడులొద్దు . సద్విమర్శ చేసినవాడు సంస్కార హీనుడా .. సంస్కారం లేదన్న బూతు /తిట్టు పదం వాడిన మీరెంత సంస్కారవంతులు ?

  @KRISHNA RAO JALLIPALLI

  బాగా చెప్పారు మీరు . ఎదురు దాడికి బయపడే సద్విమర్శ చేయడానికి బయపడుతున్నారు ..

 28. పైన బొల్లోజు బాబా గారి జాబితాలో నాపెరుండటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్షా!ఈ నచ్చిన,నచ్చని బ్లాగులజాబితాలకు మనకూ చాలా దూరం బాబా గారు,అయినా నన్ను గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు :)
  @శివ మీకు నచ్చిందా లేదా అన్నది మీ అభిప్రాయం,కానీ పర్ణశాల బ్లాగును మెచ్చుకునేవారందరికీ మీరు…మీరు గనుక తీవ్రవాద మరియు వేర్పాటువాద సానుభూతిపరులు , భారతీయులను వ్యతిరేకించే వారు అయితే ఈ బ్లాగు మీకు నచ్చుతుంది … ఇలాంటి లేబుళ్ళు అంటించటం పద్ధతి కాదు.

 29. శివ గారి మాటల్లో తప్పు వుంది…అలాగ తప్పు లేదు కూడా.నచ్చని బ్లాగు లు చెప్పమన్నారు కాబట్టి చెప్పి..ఎందుకు నచ్చలేదో [పిడి వాదం] కూడా చెప్పారు.నిజానికి ఆయన బ్లాగులో రాసే విషయాలు చాలా నాకు నచ్చలేదు.కానీ ఆయన రాసే విధానం,ఓపికగా సమాధానాలు చెప్పడం,మంచి చర్చను ఆహ్వానించడం,జనాలను ఆలోచింపచేయడం లాంటివాటి వల్ల ఆయన బ్లాగు నాకు నచ్చింది.ఆయన రాసే విషయాలని ఖండించి,ఆయన అభిప్రాయాలను మార్చగలిగేవారు రావాలి కాబట్టి అందరూ ఆ బ్లాగు చదవాలి.అందులో కామెంటుల్లో జరిగే చర్చల్లో ఎన్నొ ఎన్నో మంచి విషయాలు వున్నాయి కాబట్టి ఆ బ్లాగు అందరూ చదవాలి.తిన్నామా,పడుకున్నామా అని కాకుండా మంచో చెడో ఏదో ఒకటి తనకి తెలిసినదానిని పది మందికీ చెప్పి అభిప్రాయాలని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఆ బ్లాగు అందరూ చదవాలి.తను చెప్పిందే కరక్టనే లా రాసినా,మిగిలిన వారి అభిప్రాయాలను ఒప్పుకోకపోయినా గౌరవిస్తూ వుండడం వల్ల ఆయన్ని,ఆయన బ్లాగుని గౌరవించాలి.
  నాకు మహేష్ గారి అభిప్రాయాలు నచ్చకపోయినా బ్లాగుకి అభిమానినని గర్వం గా చెప్పుకుంటున్నాను.ఈ మధ్యకాలం లో నేను ఇలాంటి ఖశ్చితమయిన అభిప్రాయాలున్న రచయితని ఎక్కడా చూడలేదు.

 30. @రాజేంద్ర
  నేను సలహా ఇచ్చింది కొత్తవారి కొసమే. కొత్త వారు ఇలాంటి బ్లాగు చదివి బ్లాగులంటే ఇవే అనుకుంటారిని వారికి ఆ సలహా చెప్పా. సీనియర్ బ్లాగర్స్ కి నేనేమీ సలహా ఇవ్వలేదు .ఇవ్వనుకూడా.
  ఒక వేల కొత్తవారిలో కొందరు తీవ్రవాద మరియు వేర్పాటువాద సానుభూతిపరులు , భారతీయులను వ్యతిరేకించే వారు అయితే వారికి ఈ బ్లాగు నచ్చుతుంది అని చెప్పా.అంతే !

  మొన్న ఒకరు కూడలి కబుర్లులో చదవటానికి బ్లాగులు చెప్పండి అంటే . తోటరాముడు , ప్రసాదం,విహారీ ల బ్లాగుల చిరునామాలు ఇస్తే సంతోసించారు .

  అదే వివాదాస్పద బ్లాగు ఇస్తే వాల్ల మూడ్ పాడయి బ్లాగులంటేనే విరక్తి పుట్టచ్చుకదా… అది నా ఉద్దేశ్యాలు … అంతే తప్ప ఎవరికీ లేబుల్స్ తగిలించటం కాదు .

 31. ఎవరు చెప్పాలనుకుంది వాళ్లు చెప్పేశారు కదా. ఈ గొడవింతటితో ఆపేద్దాం. దీంట్లో పడి అసలు విషయం పక్కకెళ్లిపోతుంది.

 32. మన్నించాలి నాలిస్టులోంచి ఇవి ఇవి మిస్ అయ్యాయి. సారీ
  సాయిసాహితి గారి http://musingsuntold.blogspot.com/
  కళాస్పూర్తి… – pruthviart.blogspot.com/
  మురళి గారి http://muralidharnamala.wordpress.com/

  బొల్లోజు బాబా

 33. @శివ, నా బ్లాగు టపాల లింకులిచ్చి, ప్రజలకు నా టపాలు చదివి మరీ మీ అవగాహనారాహిత్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేసినందుకు నా అభినందనలు. My integrity and your ignorance both will be exposed once my posts are read,even if some havn’t read it so far.

  విమర్శల్నీ, ఖండనల్నీ సహృదయంగా ప్రజాస్వామ్య స్పూర్తికి అనుగుణంగా స్వీకరించే ప్రవృత్తి నాకుంది.కాకపోతే మీ అపోహల్ని, విలువగలిగిన అభిప్రాయాలుగా గౌరవించాల్సిన అవసరం లేదని మాత్రమే నేను భావిస్తున్నాను.నేను ఖండించింది కూడా అందుకే. మీరు నా బ్లాగు చెత్తన్నంత మాత్రానాచదివేవారూ మానరు, నేను రాయడమూ మానను.

  అయితే మీరు నేను కామాక్షి గారి బ్లాగు గురించి ప్రశంసాపూర్వకంకా రాసిన దాన్ని వక్రీకరించి, ఆ బ్లాగరిని అనవసరంగా ఇందులోకి లాగడం uncalled for and unethical. నేను రాసిన వ్యాఖ్య మొత్తం అందరికీ చదవడానికి avilableగా ఉంది.

 34. క్రిష్నారావు గారూ,
  ఖచ్చితంగా నా దృష్టిలో పొగడ్త, తెగడ్త ఒకే గౌరవాన్ని పొందవు. ఇది ఎక్కడైనా వర్తిస్తుంది. ఓ ముద్దొస్తున్న పిల్లవాని బుగ్గ ముద్దెట్టుకోవడానికి హేతువు చూపక్కరలేదు. అయితే అదే చెంపను కొట్టాలంటే మాత్రం ఖచ్చితంగా హేతువు వుండాల్సిందే! దాన్నే సభ్యత, నాగరికత అంటారనుకుంటా!

  పొగడ్తలు సహేతుకంగా లేకపోతే ఆ విషయం పాఠకులకి తెలిసిపోతుంది. పొగిడేవాన్ని వంధిమాగధులకింద జతకడతారు. అయితే తెగడ్త సహేతుకంగా లేకపోతేమాత్రం అనాగరికం అనిపించుకుంటుంది.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 35. తెలుగు బ్లాగోలోకంలో ఇప్పుడే లేచి నిలబడటం నేర్చుకొంటున్నా, అంటే అంత చిన్న పిల్లనన్న మాట. పిల్లలకు అన్నీ నచ్చినట్లే నాకు దాదాపు తెలుగు బ్లాగులు అన్నీ నచ్చుతాయి. అందులో ప్రత్యేకంగా నచ్చే బ్లాగుల్ని చెప్పమంటే కొద్దిగా కాదు బోలెడంత కష్టం. హాస్యాన్ని అందించే బ్లాగులు కొన్ని అయితే, హృదయాన్ని తాకేలా కవితలు, సంఘటనలు అందించేవి మరికొన్ని, కొన్ని సామాజిక సమస్యల పైన చర్చించేవి మరికొన్ని మంచి పుస్తకాల గురించి చెప్పేవి. వీటిలో కొన్నింటికే వోటు వేసి మిగతావాటిని తక్కువ చెయ్యలేను. అన్నీ మంచి బ్లాగులే.
  సర్వేజనా సుఖినోభవంతు (నేను చిరంజీవి పార్టీ లో ఏమీ జాయిన్ కాలేదు) :-D

 36. అయ్యా! వీవెనూ…

  మంచి బ్లాగులను ఎంచుకోమన్నావు బాగానే ఉంది. మధ్యలో కొత్తగా ఈ నచ్చని బ్లాగులంటూ లేని తంటా తెచ్చిపెట్టావుగా;-) ఎవరికైనా వారి అభిప్రాయాలు తెలియజేసే హక్కు ఉంది. అంతమాత్రాన తమ అభిప్రాయాలలో తేడా ఉన్నందున భారతీయ వ్యతిరేక బ్లాగు అంటే ఎవరికైనా చుర్రున మండుతుంది. ఇలాంటి పెద్ద పదాలు వాడేటప్పుడు కాస్త సంయమనం పాటించాల్సి ఉంది. వీవెనుకు నా విజ్ఞప్తి…ఈ నచ్చని బ్లాగులు విష(య) సేకరణ ఇంతటితో ఆపేద్దాం లేదా మరో టపా దానికి కేటాయిద్దాం. లేదంటే అమృతభాంఢంలో విషపుచుక్కలు పడుతూనే ఉంటాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.