అనుపమ టైపింగ్ ట్యూటర్ అనేది మొదటి పూర్తిస్థాయి తెలుగు టైపింగ్ ట్యూటరుగా చెప్పుకోవచ్చు. దీన్ని వాడి మనం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఇంగ్లీషు, మరియు ఇంగ్లీషు టైపింగు తెలియాల్సిన పనిలేదు. అసలు అనుపమ ట్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే, అనుపమ అనే చిన్న అమ్మాయి తన మాటలతో సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుపమ టైపింగ్ ట్యూటర్ నడుస్తున్నంతసేపూ మంద్రమైన తెలుగు సంగీతం వినిపిస్తుంది. అసలు అలసటే లేకుండా టైపింగు నేర్చుకోవచ్చు. క్రింద కొన్ని తెరపట్టులు మీకోసం.
ఇదే తరగతి గది:
మొదటి పాఠాల్లో ఏయే అక్షరాన్ని ఎలా (ఏ వేలితో) టైపు చేయాలో నేర్చుకుంటారు. క్రింద చూపిస్తున్న కీబోర్డు దానిపైనే వేళ్ళ స్థానాలు గమనించారు కదా.
పాఠాలు అయ్యాక పరీక్షలూ రాయాలి. పరీక్షలయ్యాకా ఫలితాలూ, మీ ప్రగతి, మీరు తప్పులు చేస్తున్న మీటలు అన్నీ చూపిస్తుంది.
దీనిలో టైపింగ్ పాఠాలే కాక మీ తెలుగు టైపింగ్ వేగం పెంచే ఆటలు కూడా ఉన్నాయి. ఆటల గది ఇలా కనిపిస్తుంది.
మరిన్ని వివరాలు, ఇతర సమాచారం కోసం అనుపమ వారి వెబ్ సైటుని సందర్శించండి.
Yeah…I have used it for the first few lessons….
its a nice tutor…