మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?

కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.

కూడలిలో పిచ్చి అక్షరాలు

ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.

ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:

ఫీడులో తప్పిదం 1

ఫీడులో తప్పిదం 2

వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.

ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.

ప్రకటనలు

17 thoughts on “మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?

 1. వీవెన్,

  టాగులో అక్షరాలు ఎక్కువై చివర్లో ఆ పిచ్చి అక్షరం జతచేరింది. టాగు కత్తిరిచ్చా. ఇప్పుడు సరి అవుతుందనుకుంటా. ధన్యవాదాలు.

 2. RSS ఫీడు అంటే ఏమిటి?నా బ్లాగు RSS ఫీడుని నేనెలా తెలుసుకోగలను?మొన్నేదో సైటులో నా బ్లాగుని చేరుస్తుంటే RSS ఫీడుని అడిగింది.ఏమి చెయ్యాలో తెలియక నా సైటు URL నే ఇచ్చేసాను.

 3. వీవెన్ గారూ,
  మీసలహాప్రకారం చూసి ఫీడుబాధలు కనుక్కోగలిగాను. ముఖ్యంగా నేను పీడీయఫ్ లో పెట్టడంవల్ల జరుగుతున్న దోషాలు. వర్గాలూ, గట్రా చూపించకుండా చేస్తే తగువు తీరిపోయింది.

  మాలతి

 4. రాధిక గారు, ఆరెసెస్ అంటే ఏమిటో ఈ టపా చదవండి.
  క్లుప్తంగా చెప్పాలంటే మీ బ్లాగు గురించి ఇతరులకు చెప్పే సాధనమనుకోండి.

  ఉదా: మీ బ్లాగుకి ఆరెసెస్ ఫీడు ఈ కింది లంకె
  http://snehama.blogspot.com/feeds/posts/default

 5. మీరు చర్చించిన దానిలో టాగు యొక్క పొడవు అంటే ఏంటి? టాగు చిన్నదిగా ఉండటం అంటే ఏంటి?
  1. “ఎందుకు ఎలా ఎప్పుడు” ————– ఇది పెద్ద టాగా?
  లేక ఇదా
  2. “ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎవరు, ఏమిటి, ఎంత”.
  దయచేసి తెలుపగలరు.

  1. గవేష్, ట్యాగు లేదా వర్గం పేరు పొడవు (ఎన్ని అక్షరాలు అని) ని బట్టి ఈ కత్తిరింపు జరుగుతుండవచ్చు. నేను సవివరమైన ప్రయోగాలేమీ చెయ్యలేదు. కానీ మీరిచ్చిన రెండోది మాత్రం పొడవైవ ట్యాగే.

 6. మీరిచ్చిన జవాబుకు నాకొక అనుమానం వచ్చింది. కింద తెలిపిన విదంగా చేయటం సరైనదా…
  నేను ఒక టపా ఏ టాగూ లేకుండా వ్రాస్తాను, అది కూడలిలో చూపించబడుతుంది, కొన్ని రోజుల తరువాత నాకు ఇస్టమొచ్చినన్ని టాగులు చేర్చుకుంటాను. నేను టాగులను లేదా టపాలో తప్పులని సరిదిద్దినప్పుడు నా టపా మల్లీ కూడలిలో కనిపిస్తుందా? ఇలా కూడలిని నా బ్లాగు యొక్క ప్రచారానికోసం వాడుకోవటం మంచిదేనా?

  1. నేను category పొడవు తగ్గించి, టాగులు లేకుండా రాసిన టపా చక్కగా వచ్చింది. ఇంకా రెండు ప్రయత్నాలలో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాను, ఏ విషయం త్వరలో ఇక్కడ తెలుపుతాను. మీ సహాయానికి ధన్యవాదాలు.

  2. మీరు చేర్చిన ట్యాగులు భవిష్యత్తులో కూడా సమస్య కలుగజేసే అవకాశం ఉంది. మీరు వర్డుప్రెస్సులో టపాలను ప్రచురణతేదీ మార్చకుండా ఎన్నిసార్లు మార్చుకున్నా కూడలిలో మళ్ళీ మళ్ళీ కనిపించదు.

   వర్డుప్రెస్సులో ఎన్ని అక్షరాల పరిమితి ఉందో తెలుసుకుని అన్ని అక్షరాల లోబడి ట్యాగులు/వర్గాల పేర్లు ఇస్తే సరిపోతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s