మీరు ఇంకా IE6 వాడుతున్నారా? ఎందుకని?

IE6 నుండి మీ విహారిణిని నవీకరించుకోకపోవడానికి మీ కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ IE వెర్షన్ వాడుతున్నారో తెలుసుకోవడం ఇలా: Help > About Internet Explorer

ప్రత్యామ్నాయాలు: IE6 కి బదులుగా ఈ క్రింది మెరుగైన విహారిణులలో దేనినైనా వాడవచ్చు.

 1. Mozilla Firefox
 2. Google Chrome
 3. Opera
 4. IE7 (ఇప్పుడు విండోస్ XPకి కూడా లభ్యం)
 5. Safari

కొన్ని లింకులు:

తాజాకలం (జూలై 4, 2008):

తాజాకలం (ఫిబ్రవరి 21, 2009):

11 thoughts on “మీరు ఇంకా IE6 వాడుతున్నారా? ఎందుకని?

 1. ఆది పైరసీ మహత్యం కాక ఇంకేమిటి. అసలు మన తెలుగు బ్లాగర్లలో ఎంతమంది Genuine Windows వాడుతున్నారు? :-)

  ఇలా దొంగ OS వాడే వారికి చాలా మందికి OS అనేది కొనుక్కోవాలని కూడా తెలీదంటే నమ్ముతారా? వారు ఇంటర్నెట్ కి కనెక్ట్ కారు, అయినా బ్రౌజర్ దిగుమతి చేసుకోరు.

 2. నేను గత పదిహేనురోజుల నుంచీ ఆరున్నొక్క అయ్యీ వాడుతున్నాను.పక్కనే ఫైరు ఫాక్సు కూడా.జెన్యూన్ విండోస్ ఖరీదు ఎంత ఉంటుంది అసలు?విశాఖపట్నం లోని ఒక భారీ సంస్థ పైరేటేడ్ విండోస్ వాడుతుండగా ఒక్కో సిష్టం కు ముప్ఫై వేలు ఫైన్ కట్టించుకున్నారు.విండోస్ కు ప్రత్యామ్నాయాలు లినక్సు లాంటివి నాలాంటి వాళ్ళకు అందుబాటులోకి వస్తాయి విండోస్ లాగా?

 3. విశాఖలోనే కాదండీ, అమీర్ పేటలో ఒక్క సారి నాస్కామ్ దాడి చేస్తే రోజుకు రెండు కోట్ల ఫైన్ లు విధించే పరిస్థితి వుంది. సాప్, విన్ రన్నర్, లోడ్ రన్నర్, పీపుల్ సాఫ్ట్ ఒకటేమిటి, అన్నీ ఉచితంగా వాడేస్తుంటారు. అంతా రిచర్డ్ స్టాల్ మన్ వారసులే :-)

 4. “జెన్యుయిన్ విండోస్ యూజర్ అని వాలిడేట్ చెయ్యాలిగా”.
  అఖర్లేదు.
  అది కూడా ఉచితమే!
  పైన వీవెన్ గారు “IE7 (ఇప్పుడు విండోస్ XPకి కూడా లభ్యం)” అని అన్నది చూడండి!

 5. నెటిజన్ గారన్నది నిజం. IE 7 ఇప్పుడు పూర్తిగా ఉచితమే. కాకపోతే అది వ్యవస్థాపితం చెయ్యాలంటే SP2 తప్పని సరి. అది కావాలంటే విండోస్ అప్డేట్ చెయ్యాలి. అది చేస్తే దొంగలు దొరుకుతారు :-) ఇవీ సమస్యలు :-)

  ఇంతకీ IE 6 ఎందుకు వాడటం మానెయ్యాలి :-) FF 1.0 ని ముందు ఆపాలి. అన్ని రకాల సెక్యూరిటీ రంధ్రాలూ దానివే.

 6. కూడలి సందర్శకులలో 0.85% మాత్రమే మంటనక్క 2 కంటే తక్కువది (1.5.* లేదా 1.0.*) వాడుతున్నారు. మంటనక్క 1.0.* అయితే కేవలం 0.16% మాత్రమే. IE6 అంతకంటే తక్కువ వెర్షన్లను 37.22% సందర్శకులు వాడుతున్నారు. ఇది IE7ని వాడేవారికంటే (32.33%) ఎక్కువ.

  మంటనక్క 1, IE6కంటే సురక్షితమని నా అభిప్రాయం. అయినా IE6తో నాసమస్య దాని సెక్యూరిటీ పరంగా కాకుండా సైట్లను దానికి అనుగుణంగా చేయడంలోనే చాలా సమయం పోతుందని.

 7. SP2 ను అరడజను కంప్యూటర్ మాగజిన్లు తమ CD ల లో ఇచ్చాయి. మా ఇంట్లో 2, 3 CD ల లో SP2 వుంది.I.E.7 Download Time లో Windows Validation చేస్తున్నారు, I.E.7 ఉచితం అంటూనే. ఈ ఉచితం యురప్ కి మాత్రమే. ఆశియాకు కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.