కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా.
గమనించాల్సిన మార్పులివీ:
- మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా:
కూడలి 100అన్ని బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, బ్లాగుల పేజీ చూడండి. - వ్యాఖ్యలు ఆయా సంబంధిత పేజీలలో కుడివైపు వస్తాయి. కానీ మీరు కావాలని అడిగితే వ్యాఖ్యల పేజీ కూడా ఉంది.
- విభాగాలు: మీకు అంతగా సమయం లేకపోతే, టపాలన్నింటినీ చదవకుండా మీకు ఆసక్తి ఉన్న విభాగాలనుండి టపాలను మాత్రమే చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ విభాగాలున్నాయి:
- అన్వేషణ: నావిగేషన్ బద్దీలో ఉన్న అన్వేషణ పెట్టె నుండి వెతకడంద్వారా కూడలిలో వచ్చే అన్ని తెలుగు బ్లాగులనుండి గూగుల్ ఫలితాలను పొందవచ్చు. (ఉదా: మీగడ, సూరేకారం)
- సేకరణలు మరియు ఇంగ్లీషు పేజీలలో కూడా విభాగాలు. ఇకనుండి మీకు నచ్చినవే చదవండి.
- ఫీడులకు మార్పులు: మీలో చాలా మంది కూడలిని ఫీడుల ద్వారా చదువుతూ ఉండవచ్చు. బ్లాగుల ఫీడుని తాజాకరించుకోండి. మీరేమీ మార్చుకోకపోయినా పర్లేదు. కానీ తాజాకరించుకోవడం ఉత్తమం. బ్లాగుల విభజన వల్ల మీకు ఆసక్తి ఉన్న విభాగాలనే చేర్చుకునే సౌలభ్యం కూడా ఉంది.
- మీ బ్లాగు లేదా వెబ్ సైటు నుండి కూడలికి లంకె వెయ్యడానికి మీకు కావలసిన సమాచారమందించే ప్రచార పేజీ.
- మంచి 404 పొరపాటు పేజీ :)
మరి మీకు నచ్చిందా? సూచనలు, సలహాలు, విమర్శలు తెలియజేయండి మరి.
వీవెనుడికి,అయ్యా మీరు ఎవరో నాకు ఇంతవరకూ తెలియదు.కానీ ఈ లేఖిని,కూడళ్ళ ద్వారా మీరు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం.మీరు ఇలాంటివే ఎన్నో భాషోద్దారక కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ…
మరో మైలురాయి…
కంటెంట్ మీద ఫోకస్ బాగుంది కొత్త కూడలిలో.
మీకు మరియు తెలుగు బ్లాగర్లందరికీ శుభాకాంక్షలు.
అన్నట్టు 404 పేజీ ని “చిక్కలేదు చిన్నదాని ఆచూకీ…” అని పెడితే బాగుంటుంది :)
వీవెన్ గారికి,
కూడలి మార్పులు చాలా బాగున్నాయి. మరికొన్ని విభాగాలు ఉంటే బాగుంటుంది. ఉదాహరణకు అధ్యాత్మికం , యాత్రలు , వ్యక్తిత్వాలు , చరిత్ర , మనస్తత్వం , వంటలు వగైరా. పరిశీలించి అవసరమైన వాటిని ఉంచుతారని ఆశిస్తూ…
–రవీంద్రనాధ్ గెడ్డం
వీవెన్,
ముఖ్య పుటలో కూడలి ౧౦౦ మాత్రమే చూపించడం కొత్త బ్లాగర్లకి “అన్యాయం” చేసినట్టుంటుంది అ.నా.అ.
ఇక తెలుగు బ్లాగర్లందరం టాగ్ల standardization కి కృషి చేస్తే మంచిది అ.నా.అ (దీన్నే నేను ఇంతకు ముందు ప్రస్థావించా, కానీ స్పందన లేకుంది).
వీటి గురించి ఇంకా చర్చ, ఆలోచన జరపగలరు.
రాకేశ్వరుడు
రాకేశ్వర, కూడలి ౧౦౦ బదులుగా అన్ని బ్లాగుల నుండి టపాలు ముఖ్య పుటలో చూపించడం ఆలోచిస్తా.
అ.నా.అ అంటే అని నా అభిప్రాయం అనా?
టాగుల గురించి నేను వ్రాసి టపాపై ఇప్పుడే వ్యాఖ్యానించావు గనక దానిపై నేను వ్యాఖ్యానించను.
రవీంద్రనాధ్, మరిన్ని విభాగాలు రాబోయే రోజులలో తప్పనిసరిగా వస్తాయి. భక్తి మరియు వంటలు విభాగాలు సేకరణలలో ఉన్నాయి.
కొత్త కూడలి అద్బుతంగా వుంది. యాదృచ్చిక ఫొటొ ఆలొచన చాలా బాగుంది. మీరు ఇంటెర్నెట్ లొ తెలుగు బాషాభివృద్ది కి చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయం.
తెలుగు బ్లాగర్ల టపాలు ను ఒక తాటి మీద తెస్తున్న మీ కృషి ప్రశంసనీయం, రాకేశ్వరుడు అన్నట్టు కూడలి ౧౦౦ ప్రత్యామ్నాయం ఆలోచించగలరేమో చూడండి. మానవుడికి ఆశ ఎక్కువ కదా.
కొత్త పెళ్ళి కూతుర్లా బానే ఉంది. ఓ సూచన.. మీరు సాయంత్రాలు అమెరికా వాళ్ళతో కబుర్లాడుకోడానికి వెళతారు కామోసు కూడలి అస్సలు కదలదు. అది మీరు నెడితే గానీ కదలదాయె! అంచేత మీరు నెట్టకుండానే బ్లాగుల అతీగతీ పట్టించుకునేలాగానూ, కనీసం (తేనేగూడులాగా) మేం పిలిస్తే మాకేసి చూసేలాగానూ ఉంటే బాగుంటుంది.
చదువరీ, కబుర్లాడడానికీ కూడలికీ సంబంధంలేదు. ఇప్పుడు నేను నెట్టనవసరంలేదు. కొత్తది కూడా కదలకపోవడం గమనించారా?
పిలిస్తే చూడడంలాంటివి ఎప్పటికో ఇప్పుడే చెప్పలేను.
100 blogulu concept is very bad. we, new comers are very much disappointed with this.
Veeven,
The new design is very good. Congratulations!
Instead of subjectively picked Top 100 blogs, wouldn’t it be good to have the most popular posts (not blogs) at the top?
గిరి, ప్రాచుర్యం పొందిన టపాలేవో తెలుసుకునే జ్ఞానం కూడలికి ప్రస్తుతం లేదు. సమీప భవిష్యత్తులో వస్తుందని చెప్పలేను.
కొత్త బ్లాగరులూ మరియు వారికి మద్దతునిచ్చేవారూ,
మొదటి పేజీలో ఇప్పుడు, కూడలి ౧౦౦ బ్లాగులకు బదులు అన్ని బ్లాగులనుండి టపాలను చూపిస్తున్నా. :) పండగచేసుకోండి!
కొత్త కూడలి చాలా బాగుంది.యాద్రుచ్చిక ఫొటో అయితే చాలా చాలా నచ్చింది.అలాగే పాత కూడలిలో మాదిరిగా బ్లాగుల లంకెలన్నీ ఒకచోట పెడితే ఉపయోగకరం గా వుంటుంది.అలాగే 100 బ్లాగులన్నారు. నాకు కావలసిన 100 మందీ అందులో వున్నారో లేదో ఎలా తెలుసుకోవడం?పాత కూడలిలా అన్ని బ్లాగులకు ఒక పేజి,వ్యాఖ్యలకు ఒక పేజీ వుంటే బాగుంటుందనిపించింది.
రాధిక,
బ్లాగుల లంకెలు ఇక్కడ: koodali.org/list/blogs
కూడలి ౧౦౦ జాబితా ఇదిగో: koodali.org/list/blogs/select
పాత కూడలిలా, బ్లాగులకు ఒకే పేజీ: koodali.org/blogs
వ్యాఖ్యలకు ఒకే పేజీ: koodali.org/comments
andarini kaliputhunna koodali chalabagundi ok ok elage podiginchandi
రంగుల ఎంపిక బాగుంది…. నీలం, ఆకుపచ్చ కళ్ళకి మంచి ఎఫ్ఫెక్ట్ ని ఇస్తుంది… కానీ ఆ రంగుల్లోనే ఇంకా మీరు ప్రయోగాలు చెయ్యొచ్చు…
100 బ్లాగులు, యాధృచ్చిక ఫోటొ ఆలోచనలు బాగున్నాయి…
వీవెను జీ,
కూడలి కొత్త రూపం బావుంది కానీ, ఈ మధ్య కాలంలో కూడలి లో ఎప్పుడు చూసినా యోగి వేమన గారు మాత్రమే కనిపిస్తున్నారు. బూదరాజు ఆశ్విన్ గారి కృషి ప్రశంసనీయమే కానీ, కూడలి అంతా యోగి వేమన కనిపించడం బాలేదు. ఈ క్రింది తెల్పిన విధంగా కూడలిని మార్చగల అవకాశం ఉందేమో పరిశీలించండి.
1. ప్రతీ రోజుకు ప్రతీ బ్లాగు నుండి గరిష్టంగా 2 లేదా 3 మాత్రమే కూడలిలో కనిపించేలా చూడడం
లేదా
2. కూడలిని వ్యక్తిగతంగా Configure చేసుకునే సౌకర్యం. ఉదాహరణకు, కూడలిలో టపా కనిపించగానే, ఆ టపా పక్కన “Do not show this blog for me” అని ఒక option ఉంటే, దానిని క్లిక్ చేయడం ద్వారా సదరు కంప్యూటర్ పై కూడలి లో ఇక ఆ బ్లాగు కనిపించకుండా చేసుకోవచ్చు.
ఇక పోతే, ఎవరినీ వ్యక్తిగతంగా గురి చేసి నేను ఈ వాఖ్య రాయడం లేదు. కేవలం కూడలిని మరింత గా తీర్చి దిద్దడానికి నా తరపున వచ్చిన అలోచనను మీ ముందుంచాను. యోగి వేమన బ్లాగును కేవలం ఉదాహరణ గా చూపించాను. బూదరాజు అశ్విన్ గారూ, నన్ను అన్యధా భావించకండి. మీ మనస్సుకు బాధ కలిగితే క్షంతవ్యున్ని.
మీ ప్రసాదం
వీవెనో,
కొత్త కూడలి బావుంది.
అలానే ప్రసాదం గారు చెప్పినట్టు అశ్విన్ గారు రాసిన కొత్తవే కాకుండా వాడెవడో విహారి అంట వాడి పాత బ్లాగులన్నీ కూడలిలో కనిపిస్తున్నాయి. హాస్యం కింద మొత్తం టపాలన్నీ వాడివే. వాడేమన్నా పెద్ద పుడింగా , పెద్ద మల్లిక్కా , యర్రం సెట్టి శాయా లేక భరాగో నా అన్ని రాసెయ్యడానికి. అసలే వాడంటే నాకు పెద్ద మంట. ఇలాంటి వాటిని కొంచెం అదుపులో పెట్టండి.కూడలి లో కనిపించడానికి ఓ వారం రోజుల పాతవి చాలు మిగతావాటిని కొడవలి తో నరకండి. ఒక ట్రిగ్గర్ పెట్టండి బ్లాగుకు మార్పులు చేర్పులు చేసినప్పుడు పొరపాట్న పురావస్తు శాఖ త్రవ్వకాల్లో దొరికినట్టు బయట పడకుంటే చాలు.
— నెహ్రూ వి.
(నెహ్రూ ప్రధాన మంత్రి గా వున్నప్పుడు తన విమర్శలు తనే పత్రికలో మారు పేరుతో రాసుకునేవాడట)
ప్రసాదం, విహారీ,
ఇలాంటి వాటిని సంభాళించడానికి ప్రయత్నిస్తున్నా.
@ప్రసాద్ ఇప్పుడు కొత్త కూడలి లో వారికి నచ్చినోళ్ళు రాసే బ్లాగులు మాత్రమే ఉంటయ్ మీరు బాగ చూడకపోయుంటరు వేరే బ్లాగులు ఒకరోజుతర్వాత పీకేస్తాండ్లు .నేను బాగ గమనించిన కొన్ని తెల్లారి చూస్తే కనిపిస్తలేవు కొన్ని వారం రోజులదాంకా వుంటన్నయ్.ఈడ అడుక్కునే కన్న అందరం వేరే దాంట్ల రాసుడు మంచిది. వాల్లని వాల్లని రాసుకోనియ్యి.
@mallesh,
నీకు కనిపించకుండా పోయిన కొన్ని బ్లాగులు చెప్పు. అవి బ్లాగులు జాబితాలలో కూడా లేవా?
కూడలికి ప్రస్తుతం తేదీ మరియు సమయం ఆధారంగా మాత్రమే టపాలను వేరుచేయడం తెలుసు. విషయం ఆధారంగా (ఉదాహరణకి ఫోటో బ్లాగులు, సేకరణలు, గట్రా), బ్లాగర్ల ఆధారంగా (ఉదా. కూడలి 100) వేరుచేయడం నేను చేస్తా. ఇక్కడ ఇంకేవిధమైన వేర్పాట్లూ లేవు.
కూడలిలో కొత్త టపాలు మాత్రమే కనిపిస్తాయి. ఓ బ్లాగరి ఓ వారం రోజులుగా ఏమీ వ్రాయకపోతే ఆయన టపాలు కూడలి పేజీలలో ఉండే అవకాశాలు తక్కువ. ఎందుకంటే, వేరేవారి కొత్త టపాలు వచ్చేస్తాయి కాబట్టి. కానీ అన్ని బ్లాగులూ జాబితాలో మాత్రం ఉంటాయి.
కూడలిలో లభ్యమౌతున్న తాజా సౌలభ్యాల్ని గుర్తించకుండా మాట తూలడం భావ్యం కాదు. కూడలిలో ఒక టపా స్థిరంగా కనిపించడం గానీ త్వరగా మాయం కావడం గానీ site admin చేతుల్లో లేదు. ఇతర బ్లాగరులు పెక్కుమంది శరవేగంతో టపాలు రాస్తూంటే పాత టపాలు జారుకోవడం సహజం. నేను గమనించినది మాత్రం ఇది.
నా పరిశీలనలో కూడలి-100 అనే వర్గీకరణ కూడా బ్లాగుల శ్రేష్ఠతను బట్టి చేసినది కాదు. అంటే కూడలి-100 లో చేరే అర్హత కోసం ఏ బ్లాగు సర్వోత్తమమో site admin నిర్ణయించడానికి పూనుకోలేదు. తఱచుగా టపాలు దర్శనమిచ్చే బ్లాగులు కూడలి-100 కేటగరీలోకి వచ్చాయి. అంతే !
site admin కి అనవసరమైన పక్షపాతాలు ఆపాదించకుండా ఆయన ఆచరణాత్మకతను ఆకళించుకోవడానికి ప్రయత్నించగలరు.
aarya, mee prayatnam bahudha prashamsaneeyam,. ide nenu e site chudadam pradhamam. ayina chala chakkaga teluginti ada pillala oddikaga vundi. mana teluguni maname kapadukovalanna mee alochana bavundi.
Teluguvariki labinchina arudyna adrustam
చాలా బాగుంది.. ధన్యవాదాలు…