వర్గాలు, టాగులు, లేబుళ్ళు

పెరుగుతున్న బ్లాగులన్నింటినీ చదవేందుకు మనకి సమయం చిక్కదు. ప్రస్తుతం మనం చదివే టపాలు మొత్తం టపాల్లో 80 శాతం వరకు ఉంటే, భవిష్యత్తులో మనం చదవనివే 95% ఉంటాయి. మనకి నచ్చిన లేదా ఆసక్తి ఉన్న టపాలని ఎంచుకోడానికి టాగులు ప్రధాన మార్గంగా మారుతాయి. కనుక మీ టపాలకి టాగులు తగిలించండి.

మీరు ఏ బ్లాగుడు సేవని వినియోగిస్తున్నా దానిలో టపాలను వర్గీకరించుకునే (టాగులు లేదా లేబుళ్లు తగిలించే) సదుపాయం తప్పకుండా ఉంటుంది. ఈ టాగులు ఎందుకు, వాటి వల్ల ప్రయోజనాలు, టాగులు ఇవ్వడంలో ఇబ్బందులు, వీటిని మరింత ఉపయోగకరంగా మలచుకోవడం లాంటి విషయాలను ఈ టపాలో చర్చిస్తున్నాను. మీ అభిప్రాయాలను, ఆలోచనలను కూడా ఆహ్వానిస్తున్నాను.

మీరు టాగులు తగిలిస్తుంటే (లేదా గతంలో ప్రయత్నించి ఉంటే) మీరు ఓ సందిగ్థతని ఎదుర్కునే ఉంటారు. అదేమిటంటే, టాగులు మరింత సూక్ష్మంగా ఉండాలా, లేక విస్త్రుతంగా ఉండాలా అని. ఉదాహరణకి మీరు ఓ టపాలో ‘గోదావరి’ సినిమాపై సమీక్ష లేదా మీ అభిప్రాయం రాసారనుకుందాం. దానికి ఈ టాగులు తగిలించవచ్చు: సినిమాలు, గోదావరి, సినీ సమీక్షలు, నా అనుభవాలు. మరో ఉదాహరణ, చిరంజీవి కుమార్తె పెళ్ళిపై టపాకి ఈ టాగులు తగిలించవచ్చు: చిరంజీవి, శ్రీజ, పెళ్లి, విలువలు, సామాజికం, వర్తమానం, గట్రా.

మీరు టాగులు కొంతకాలంగా తగిలిస్తూ ఉంటే, మీ టాగులు ఎంత వివరణాత్మకంగా (granular) లేదా సాధారణంగా (generic and abstract) ఉండాలో అని ఎక్కడో ఓచోట కుదురుకుని ఉంటారు. అది మీ బ్లాగులో టాగుల/వర్గాల సంఖ్యని ఎంత ఉండాలి అన్నదానిపై నిర్ణయించుకుని ఉండొచ్చు. మీరు బహు భాషలలో రాస్తుంటే, భాష ఆధారంగా కూడా మీ టపాలను వర్గీకరిస్తుండవచ్చు. లేదా మరేదో పద్ధతిని అవలంబిస్తుండవచ్చు.

ఈ మధ్యే వర్డ‌్‌ప్రెస్ వర్గాలకు మరియు టాగులకు మధ్య తేడాను గుర్తించింది, మన టపాలను వర్గాల్లోనూ మరియు టాగులతోనూ వర్గీకరించుకునే సదుపాయం కల్పించింది.

 • వర్గాలు: మీ బ్లాగులోని విషయాంగం యొక్క స్థూల విభాగాలు. ఇవి దాదాపుగా మీకు ముందే తెలిసిపోతాయి (మీ బ్లాగులో వేటి గురించి రాయబోతున్నారో మీకు తెలిసేఉంటుంది కదా.) ఉ.దా. సినిమాలు, సాంకేతికం, రాజకీయాలు, ఇలా.
 • టాగులు: ఇవి ప్రతి టపాలో ఉన్న కీలక పదాలు (keywords). ఏయే టాగులు ఏ టపాకి ఇవ్వాలో ఆ టపా రాస్తున్నప్పుడే తెలుస్తుంది. టాగులు మరింత సూక్ష్మస్థాయిలో ఉండొచ్చు. ఓ టపా సాధారంగా ఒకే వర్గంలో ఉంటుంది. కానీ అదే టపాకి ఎన్ని టాగులైనా తగిలించవచ్చు. ఉదాహరణకి ‘హాపీ డేస్’ పై రాసిన టపాని ‘సినిమాలు’ వర్గంలో చేర్చి దానికి హాపీ డేస్, శేఖర్ కమ్ముల, సినీ సమీక్ష లాంటి టాగులు తగిలించవచ్చు.

బ్లాగ్‌స్పాట్ అయితే టపాలకు లేబుళ్లు తగిలించుకునే సదుపాయం కలగజేస్తుంది. ఇవి దాదాపుగా టాగుల వంటివే. మీ సౌకర్యానుగుణంగా వీటిని టాగులుగానో లేదా వర్గాలుగానో వాడవచ్చు.

తెలుగు బ్లాగుల టపాలు ఎక్కువయే కొద్దీ మరియు మనకు లభించే సమయం తగ్గిపోయే కొద్దీ, మనం కొన్ని టపాలను మాత్రమే చదువగలుగుతాం. ఆ కొన్ని ఏవో ప్రధానంగా మన ఆసక్తి నిర్ణయిస్తుంది. నా ఆసక్తికి తగ్గ టపాలు ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా (బ్లాగు సంకలినులలోని అన్ని టపాలలో వెదుకుకొనే కంటే). ఇందుకు టాగులు మంచి మార్గం అని నా అభిప్రాయం. టెక్నోరటి లాంటి సైట్లలో టాగుల ద్వారానే టపాలు జనాలకు చేరతాయి.

అయితే, వీటితో వచ్చిన చిక్కు ఏమిటంటే, ఏ ఇద్దరు బ్లాగరులు ఇచ్చిన టాగులు ఒకేలా ఉండాలని లేదు. సినిమాలపై రాసే టపాలకు ఒకరు ‘సినిమా’, మరొకరు ‘సినిమాలు’ అని, మరింకొకరు ‘చలన చిత్రాలు’ అని, మరొకరు ‘మూవీస్’ అని ‘movies’ అని ఇలా రకరకాలైన టాగులు ఇవ్వవచ్చు. కొత్త కూడలి కోసం, సినిమాలు అనే ఉప విభాగంలో పై టాగులు ఉన్న బ్లాగులనుండి ఫీడులను తీసుకోవడం ద్వారా సంభాళిస్తున్నాను. కానీ టాగులన్నీ కలగలిస్తే కంగాళీగా ఉంటుంది (ఉదాహరణకు తెలుగు బ్లాగర్ల వర్గమేఘంలో చూడొచ్చు.)

తెలుగు బ్లాగులకు సంబంధించి టాగులన్నీ ఓ పద్ధతిలో ఉంటే బాగుంటుందా? అసలు ఈ టాగులపై మీ అభిప్రాయం ఏమిటి? మీ టపాలకు టాగులు తగిలించకపోవడానికి, మీకు మీరు చెప్పుకున్న కారణాలేంటి? మీ టాగులు ఏ పద్ధతి మీద నిర్ణయించుకుంటున్నారు?

మీ ప్రతిస్పందనలు, సమాధానాలను, ఆలోచనలను ఇక్కడ వ్యాఖ్యల ద్వారాగానీ, మీ బ్లాగులో టపాల ద్వారా గానీ తెలియజేయండి. ఈ చర్చలో మీరు లేవనెత్తిన అంశాలను చదివి మరింత మంది టాగులు తగిలించడం మొదలుపెడతారు, ఇంకా అర్థవంతమైన వర్గీకరణ పద్ధతులు కనిపెట్టి వాటిని అనుసరిస్తారు. ఈ ప్రక్రియంతా తెలుగు బ్లాగులకు మంచి ఫలితాలను అందిస్తుందని ఆశిస్తున్నాను.

ప్రకటనలు

6 thoughts on “వర్గాలు, టాగులు, లేబుళ్ళు

 1. @వీవెన్,
  నాకు వివరముగా వర్డ్ ప్రెస్స్ వాడి కమ్యూనిటీ గూర్చి తెలియదు కానీ, మనమే తెలుగుకు సంబంధించిన వర్గాల్ని/టాగుల్ని వాళ్ళకి ఇచ్చి, అవో డ్రాప్ డౌన్ బాక్స్ గా క్రొత్త టపా పేజీలో వాళ్ళు పెడితే, అందర్నీ ఒక చట్రంలో బిగించొచ్చు. ఇది వాళ్ళకీ, మీలాంటి వాళ్ళకి వర్గీకరించటానికి తేలిక. బ్లాగర్లని ఒక పద్ధతికి కట్టుబడి సరయిన టాగులు పెట్టమిని చెప్పటం కష్టసాధ్యం.

  అలానే, ఇంగ్లీషు బ్లాగుల్లో, వర్డ్ ప్రెస్స్ వాడిచే పూర్వ నిర్వచితమయిన వర్గాలు/టాగుల లిస్ట్ ఉన్నదా?

 2. అలానే, ఇంగ్లీషు బ్లాగుల్లో, వర్డ్ ప్రెస్స్ వాడిచే పూర్వ నిర్వచితమయిన వర్గాలు/టాగుల లిస్ట్ ఉన్నదా?

  లేదు. మనం గతంలో వాడిన వర్గాలనే జాబితాలో చూపిస్తాడు.

 3. మీరిక్కడ టపా వేయడం చూడలేదు.
  నేనిదే విషయం ఒక సారి గుంపులో ప్రస్తావించా…
  అవును మనమొక standard list of tags తయారు చేసుకోవాలి.
  లేక పోతే సరళంగా కూడలి standard list of వర్గాలు వుండి, వాటికి వుండాల్సిని టాగులు మీరే ఒక పట్టీగా ఇస్తే, మేము దానిని అనుసరిస్తాము. simple and efficient.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s