యాహూ మెయిల్‌లో తెలుగు!

యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు.

నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది.

క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.

1. జీమెయిల్‌లో అమర్పు: Settings > General

Character Encoding Setting in Gmail

2. యాహూ! మెయిల్‌కు ఆ తర్వాత పంపిన సందేశం:

Yahoo! Mail showing Telugu mail correctly

తాజాకరణ: మీ విహారిణిలో భాషని మరియు అక్షరాల ఎన్‌కోడింగులని సరిగ్గా అమర్చుకోవడం కూడా చాలా వరకు సహాయపడుతుంది.

34 thoughts on “యాహూ మెయిల్‌లో తెలుగు!

  1. అవునండీ.., ఈ అమరికలతో దాదాపు సంవత్సరం న్నర గా తెలుగులో సందేశాలు పంపుతున్నా…,
    మా అమ్మాయి మొదటి పుట్టిన రోజు ఆహ్వానాలు పంపటానికి అప్పట్లో తెగ శోధించి పట్టేశా…:-)
    అన్నట్లు ఈమధ్య నేను పంపిన సందేశాలు చూసి కొందరు తెలుగు పత్రికా సంపాదకులు తెలుగులో ఎలా సందేశాలు పంపాలని ఆడిగారు, కొంత వరకు వారి సందేహాలను తీర్చి నప్పటికి, Outlook / Outlook Express లలో ఏమైనా ఇబ్బందులున్నయ్యేమో నని చూ డాలని పిస్తోంది, వచ్చే వారానికల్లా ప్రయత్నించి చూస్తా…:-)

    –రాజ మల్లేశ్వర్ కొల్లి
    టోక్యో, జపాను.

  2. అమరికలు చెప్పినందుకు ధన్యవాదములు వీవెన్ గారు…. కానీ ఈ తెలుగు మెయిల్స్ పైన తెరచాపలో చూపినట్లుగా క్రొత్త యాహూలో మాత్రమే కనబడుతోంది…పాతదానిలో కనబడుటలేదు…

    http://www.hydbachelors.worpress.com లో తెరచాపలు గమనించగలరు…

  3. అరమరికలు లేని అమరికలు ! నెనర్లు.

    పానకంలో పుడకలాంటి సందేహంతో వస్తున్నందుకు ఏమీ అనుకోకండి. మీరు వేగుపంపడానికి వాడిన ఖతి పోతన-2000 కదూ ! నేను కావ్యనందనం సాలెగూటి నుంచి దాన్ని దిగుమతి చేసుకున్నాను. కాని దాన్ని నా కలనయంత్రంలో ఎలా స్థాపించుకొవాలో అర్థంకాలేదు. దయచేసి కొంచెం చెప్పగలరా ?

  4. @T.L.Bala Subrahmanyam

    కావ్యనందనం నుంచి తెచ్చుకున్న zip ఫైలు నుండి, Pothana2000.ttf అన్న పైలుని వెలికితీయండి.
    దాన్ని కాపీ చేయండి. (Ctrl + C)
    విండోసులోని ఖతుల ఫోల్డర్ లోనికి వెళ్ళండి. (Run command, then type fonts)
    అక్కడ అతికించండి. (Ctrl + V)

  5. వీవెన్ గారూ ! నెనర్లు.

    మీరు చెప్పినట్లే చేశాను. దురదృష్టవశాత్తు లాభం లేకపోయింది. స్థాపితమైతే అయింది కాని టైపు చెయ్యడానికి పనికిరావట్లేదు. MS-Word, Adobe PageMaker ల ఖతుల జాబితాలో కనిపిస్తోంది. వాటిని ఎంచుకుని టైపు చేస్తే అర్థం లేని గుండ్రాలు పడుతున్నాయి తప్ప తెలుగు అక్షరాలు మాత్రం పడట్లేదు. ఎందుచేత ? ఇంకొంత సవివరంగా తెలియజెప్పగలరని ప్రార్థన.

    (మఱొక సందేహం. MS-Word, PageMaker సంగతలా ఉంచి వేగుపంపేటప్పుడూ బ్లాగులో టపాలు చేసేటప్పుడూ పోతన-2000 ని ఎలా టైపు చెయ్యాలో కూడా చెప్పగలరు)

Leave a reply to Giri స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.