[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.

 1. సులువైన మరియు త్వరిత ప్రారంభం: పేజీలో వెతకడాన్ని కీబోర్డులో ‘/’ మీటని నొక్కడం ద్వారా మొదలుపెట్టవచ్చు. Ctrl + F తో కూడా.
 2. మనం టైపు చేస్తుండగానే వెతుకుతుంది: FAYT (find as you type) అనేది నాకు బాగా నచ్చిన సౌలభ్యం.Find as you type

  పైన నా అన్వేషణా పదాన్ని ఇంకా పూర్తిచెయ్యలేదు. కానీ ఫైర్‌ఫాక్స్ మనం టైపు చేస్తుండగానే వెతుకడం మొదలుపెడుతుంది. కాబట్టి పేజీలో మనకు కావలసిన చోటికి వేగంగా చేరుకోవచ్చు.

 3. అన్వేషణ ఫలితాల్ని హైలైట్ చేసుకోవచ్చు. మనం వెతికిన పదాలు పేజీలో ఎక్కడెక్కడున్నాయో చూడడం తేలిక.Highlight search results
 4. లింకుల్లో మాత్రమే అన్వేషణ: signle quote () ద్వారా పేజీలోని లింకుల్లో ఉన్న పాఠ్యాన్ని మాత్రమే కూడా వెతకవచ్చు. మీక్కావలిన లింకు దొరకగానే Enter నొక్కితే ఆ లింకుని అనుసరించవచ్చు. ఈ సౌలభ్యం మూషికరహిత విహరణ (mouseless browsing) కోరుకునేవారికి వరం.

పై సౌలభ్యాలన్నీ, పొడగింతలు అనసరం లేకుండానే, ఫైర్‌ఫాక్స్‌తోనే వచ్చేస్తాయి. మామూలు వాడుకరులకు ఇది చక్కగా సరిపోతుంది.

కానీ మరింత నిశితమైన మరియు ఉన్నతమైన అన్వేషణ కోసం పొడగింతలు అనసరమౌతాయి. అక్షరాల సరళిని (character patterns) బట్టికూడా పేజీలో వెతికే వీలును /Find Bar/ అనే పొడగింత కల్పిస్తుంది. కానీ దీన్ని వాడాలంటే మీకు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్లు వచ్చియుండాలి.

వీటితో సాధ్యాలను చూడండి:

 • పేజీలో ఉన్న సంవత్సరాలు చూపించు (వరుసగా నాలుగు అంకెలు):Firefox Extension FindbarRE 1
 • ప్రభుత్వం పదం ఏరూపంలో నున్నాసరే:Firefox Extension FindbarRE2

ఆనంద జాలా జ్వాలనం!

ప్రకటనలు

8 thoughts on “[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

 1. yeah… నాక్కూడా ఇందుకే మంటనక్క అంటే ఇష్టం…కానీ, ఇంకా చాలా కారణాలు కూడా ఉన్నాయి.
  100 reasons why you should use firefox over IE అని ఆన్లైన్ లో ఓ వ్యాసం చదివా కొద్దిరోజుల క్రితం…
  దానికి కూడా లంకె ఇవ్వండి వీవెన్ గారూ…. మిగితా వారికి కూడా తెలియాలి కదా ఫైర్ ఫాక్స్ ప్రయోజనాలు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s