తెలుగుపదం

తెలుగుపదం ముఖ్యంగా రెండు లక్ష్యాలతో ఏర్పడింది:

 • చాన్నాళ్ళుగా మందగించిన కొత్త తెలుగు పదాలు తయారీని వేగవంతం చేయడం, ప్రోత్సహించడం, అందుకుకావాల్సిన సాముదాయిక వాతావరణాన్ని కల్పించడం.
 • పలు చోట్ల (బ్లాగుల్లో, గుంపుల్లో, ఇతర చోట్ల) తయారౌతున్న తెలుగు పదాలను ఒకేచోట (వెతుకుకొనగలిగే సౌలభ్యంతో) క్రోడీకరించడం.

ఈ లక్ష్యాలకు సాధనాలుగా తెలుగుపదం వికీ సైటు మరియు తెలుగుపదం గుంపులను స్థాపించాం.

మీరెలా తోడ్పడవచ్చు?

 1. మీ బ్లాగులో, ఇతర రచనలలో తెలుగు పదాలు వాడుతుండండి. మీనుండి మేం ఆశించే పెద్ద సహాయం ఇదే.
  కొత్త తెలుగు పదాలు వాడడానికి మీరు సందిగ్థంలో ఉండవచ్చు, మీ చదువరులకు ఈ కొత్త తెలుగు పదాలు అర్ధమౌతాయా అని. కానీ ధైర్యం చేసి తెలుగుపదాలు వాడండి. చాలావరకు సందర్భమే ఆ తెలుగుపదమేంటో తెలియజేస్తుంది. ఇక్కడ సందర్భం అంటే context అని మీకు తెలిసిపోయిందిగా అలా. ఆ రిస్కుకూడా తీసుకోకూడదు అనిపిస్తే ఆంగ్ల సమానార్థకాన్ని కూడా బ్రాకెట్లలో ఇవ్వండి. ఉ.దా. మీ వెబ్ విహరిణి (web browser) ని తెరవండి.
 2. మీక్కావలసిన పదాలు తెలుగుపదం సైటులో లేకపోతే, తెలుగుపదం గుంపులో అడగవచ్చు. మీకు తప్పక ఓ తెలుగుపదం దొరుకుతుంది.
 3. కొత్త పదాలను మీరు ప్రతిపాదించవచ్చు కూడా. ఇతరుల ప్రతిపాదనలకు మీ ప్రత్యామ్నాయాలూ సూచించవచ్చు. తెలుగుపదాల తయారీకి మీక్కావలిసిన మార్గదర్శకాలు రూపొందుతున్నాయి మరియు సమాచార వనరులు కూడా సేకరిస్తున్నాం
 4. గుంపులో జరిగే చర్చల్లో చాలా కొత్త పదాలు జాలువారుతుంటాయి. వీటిని తెలుగుపదం వికీలో చేర్చండంలో తోడ్పడడం ద్వారా మంచి పదసంపద తయారీలో మీ వంతు కృషిచేసినవారుఅవుతారు.
 5. మీకు తెలిసిన పండితులను (వివిధ రంగాలకు చెంది వారిని, తెలుగుపై ఆసక్తి ఉన్న వారిని) తెలుగుపదానికి సాయపడమని ప్రోత్సహించండి.
 6. మీ వెబ్ సైటు లేదా బ్లాగులో తెలుగుపదం బొత్తాలు పెట్టుకోండి.
  మామూలు బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/6/6f/Button88x31.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

  చిన్ని బొత్తం: తెలుగుపదం

  <a href="http://telugupadam.org/">
   <img src="http://telugupadam.org/images/3/36/Button80x15.png"
   alt="తెలుగుపదం"/>
  </a>

అంతర్జాలంలో తెలుగుని వాడి మీరిప్పుడు చేస్తున్న తోడ్పాటు భవిష్యత్తులో బయటి ప్రపంచంలోని తెలుగు స్థాయిని కూడా పెంచేంతగా ప్రభావంచూపిస్తుంది.

4 thoughts on “తెలుగుపదం

 1. వీవెన్ గారు,
  తెలుగు పదాల వ్యాప్తి కోసం నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను చేసే అనువాదాలలో సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వాడడానికి ప్రయత్నిస్తున్నాను.
  కాని ఓ చిన్న ఇబ్బంది ఉంది. నేను నా అనువాదాలలో వాడిన తెలుగు పదాలకు బదులు తెలుగులో బాగా నలిగిన ఆంగ్ల పదాలనే వాడేసారు కొన్ని వారపత్రికల వాళ్ళు -పాఠకులకు తేలికగా అర్థమవుతుందంటూ. అటువంటప్పుడు నేనేం చేయగలను?
  నా సొంత కథలలో మాత్రం తెలుగు పదాలకే ప్రాధాన్యత!

  కొల్లూరి సోమ శంకర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.