ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని.

బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు.

ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు?

మీరేమంటారు?

(ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)

ప్రకటనలు

18 thoughts on “ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

 1. ళ కు ళ వత్తు ఇవ్వడం సరి అయినదని నాఅభిప్రాయం. ఉదాహరణకు పెళ్ళి,వెళ్ళు,కళ్ళు మొదలైనవి.దీనికి వివరంతెలిసిన పండితులేమటారో మరి.

 2. “ళ్ళ” సరి అయినది అని భావన. కాలగమనంలో కొందరు కష్టతరమైన “ళ”ని వదలి “ల” మీద మొగ్గు చూపుతున్నారు. అలా పుట్టుకొచ్చినవే మనం చూస్తున్న ఇళ్లు,కళ్లు వగైరా

 3. నేను “ళ్ళ” అనే నేర్చుకున్నాను. జనాలు “ళ్ల” అని అంటూంటే..”నిర్ఘాంతపోవడం” తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నా. ఇంతకూ Evolution సంగతి పక్కనపెడితే “ళ్ళ” సరైనదని ఒప్పుకున్నట్టేనా?

 4. కళ్లు, కళ్ళు, పెళ్లి, పెళ్లి లాంటి పదాలలోని ళ్ల, ళ్ళ ఉచ్చారణలో ఆపిపట్టి పలికితే తప్ప తేడాగా పలకలేం. నేనెప్పుడూ ళ్ల వాడతాను. చాలా పుస్తకాలలో ఇలాగే ఉండటం గమనించాను. ళ్ళ తప్పు అని నా అభిప్రాయం కాదు.

 5. ఏదీ సరైనదో నాకు తెలియదు. నాకు ళ్ల అని రాయటం అలవాటు. సినీలోకం గారన్నట్టు కాలగమనంలో పుట్టుకొస్తే వందేళ్ల నాటిదైన బ్రౌణ్యంలో ళ్ళ ఉండాలి కదా!! ఒకవేళ బ్రౌణ్యం రాసేనాటికే మార్పు జరిగిందనుకుంటే, ఈ మార్పు అప్పటికే ప్రామాణికమయ్యుంటేనే గానీ ళ్లి బ్రౌణ్యంలో స్థానం సంపాదించే అవకాశముండి ఉండదు.
  1910వ దశకములో నిఘటువును రాసిన శంకరనారాయణ అలాంటి పదమొచ్చిన ప్రతిసారి ండ్లు, ండ్లి అని తప్పించుకున్నాడేంటి చెప్మా

 6. ఈ సందేహం నాకూ ఉంది. నేను ళ్ళ రాస్తూ ఉంటాను. ఏది సరైనదో తెలియదు గానీ, బహువచన పదాలు (కళ్ళు, కాళ్ళు వగైరా), ఏకవచన పదాల (పెళ్ళి, మళ్ళీ వగైరా) విషయంలో వేరువేరుగా రాయలేమో అని నేననుకుంటాను.

 7. శంకరనారాయణగారి పద్ధతే బాగుంది. పెండ్లి, ఇండ్లు, కండ్లు ఇవే మావైపు పల్లెల్లోనూ పట్నాల్లోనూ వాడుకలో ఉన్నవి. నేను చిన్నప్పుడు విన్నదీ నేర్చుకున్నదీ ఇవే. కానీ పల్లెదాటి కాస్త పక్కకొచ్చాక ళ్లి, ళ్లు వినబడసాగాయి. డ్ల అనేది వ్యవగారంలో ళ్ల గా మారి ఉండవచ్చు.

 8. “ళ్ళ” నే కరెక్టని నా అభిప్రాయం. ఎందుకంటే,

  “ళ్ల” అనే అక్షరాన్ని స్పష్టంగా పలకటం అసంభవం. అదే “ళ్ళ” ని పలకచ్చు. ‘Dil’ గారు అన్నట్టు, “ళ” కింద “ల” వత్తు, “ణ” కింద “న” వత్తు పెట్టాలి అనే కొండగుర్తు మాత్రం కచ్చితంగా తప్పే! వ్రాతలో కొండగుర్తులు పెట్టుకోవడం దయచేసి మర్చిపోతారని మనవి.

  “ణ” కింద కూడా “న” వత్తు బూతే అని గమనించాలి.

 9. బహుశా “ళ” కి “ల” వత్తు, వగైరా గబగబా రాయడం కోసం మొదలుపెట్టి దానికి అలవాటు పడిపోయి ఉంటారు జనాలు.

  కంప్యూటర్ కీబోర్డ్ లాంటి సాధనాల్లో రెంటికీ ఒకింత సమయమే పడుతుంది కాబట్టి ఇక ఈ అలవాటు మరుతుంది అని ఆశిస్తున్నా.

 10. ళ కి ళ వొత్తె సరి అయినది.. చిన్నప్పుదు నేను నేర్చుకొన్నది కూడ మళ్ళీ .. వెళ్ళి…. లాంతి పదాలే కాని మళ్లీ .. వెళ్ళీ.. పెళ్లీ లాంటివి కాదు… నాకు తెలిసి ల వొత్తు కాదు ళ వొథు సరీయినది ఇది చదివిన తరువాత నేను ఒకసారి పెద్ద బాల శిక్ష పరిశీలిస్తే అనిపించింది… ళ కి ళ వొత్తె సరి అయినది అని.. ఇప్పటి తెలుగులో ఇలాంటివి చాల కనిపిస్తాయీ…

 11. ళ కి ళ వొత్తె సరి అయినది.. చిన్నప్పుడు నేను నేర్చుకొన్నది కూడ మళ్ళీ .. వెళ్ళి…. లాంటి పదాలే కాని మళ్లీ .. వెళ్లీ. . పెళ్లీ లాంటివి కాదు… నాకు తెలిసి ల వొత్తు కాదు ళ వొత్తు సరి అయినది ఇది చదివిన తరువాత నేను ఒకసారి పెద్ద బాల శిక్ష పరిశీలిస్తే అనిపించింది… ళ కి ళ వొత్తే సరి అయినది అని.. ఇప్పటి తెలుగులో ఇలాంటివి చాల కనిపిస్తాయి

 12. “ళ” మూర్ధన్య పార్శ్వం (Retroflex lateral approximant) అయితే “ల” దంతమూలీయ పార్శ్వం (Alveolar lateral approximant). మనం ళ్ల అని రాసినా ళ్ళ అని రాసినా ధ్వనిశాస్త్ర రీత్యా పలుకగలిగేది రెండు మూర్ధన్యాలనే. బ్రౌణ్యంలోనూ, పాత పుస్తకాలలోనూ “ళ్ల” “ణ్న” అని రాయడానికి కారణాలు భాషా పరమైనవి కాక ముద్రణా సాంకేతికతకు సంబంధించినవని నా నమ్మకం. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులలో అన్ని రకాల సంయుక్తాక్షరాలకు సరిపడా వేర్వేరు ముద్రలు ఉంచుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అర్థభేదం లేకుంటే ఉన్న ముద్రలతోనే సరిపెట్టడానికి ప్రయత్నించేవారని నా ఊహ.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s