ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు తెలుగులా కనిపిస్తుంది. ఇకనుండి నా Unjustify! అవసరముండదు. మీకోసం కొన్ని తెరచాపలు (screenshots):
తెరచాప 1 (ఫైర్‌ఫాక్స్‌2 vs ఫైర్‌ఫాక్స్‌౩ – జస్టిఫై చక్కగా ఉంది):
Firefox 2 vs Firefox 3

తెరచాప 2 (ఫైర్‌ఫాక్స్‌2 vs ఫైర్‌ఫాక్స్‌౩):
Firefox 2 vs Firefox 3

తెరచాప 3 (ఫైర్‌ఫాక్స్‌2 vs ఫైర్‌ఫాక్స్‌౩ – text-align మరియు letter-spacing వైవిధ్యాలు):
Firefox 2 vs Firefox 3

అయితే మీ ఫైర్‌ఫాక్స్‌ లో తెలుగు చక్కగా రావాలంటే ఫైర్‌ఫాక్స్‌౩ విడుదలయ్యే (సెప్టెంబర్ 2007) వరకు వేచి ఉండండి. మీరు కొంత ధైర్యవంతులైతే జూలై చివర్లో వచ్చే ఫైర్‌ఫాక్స్‌౩ బీటా విడుదలకై వేచి చూడండి. మీరు మరీ సాహసవంతులైతే నైట్లీలు ప్రయత్నించవచ్చు. కానీ జాగ్రత్త, ఈ నైట్లీలు ఎప్పుడూ తయారీ స్థితిలో ఉంటాయి. మీ పేజీకలు (bookmarks), విహరణ చరిత్ర, భద్రపరిచిన సంకేతపదాలు పోయే అవకాశం ఉంది. మీకింకా భయం కలగలేదంటే ఇక్కడ నుండి కొత్త నైట్లీని తెచ్చుకోండి. (మిమ్మలని ముందే హెచ్చరించా. తర్వాత నా పూచీలేదు.)

ఆనంద జాలా జ్వాలనం!

ప్రకటనలు

17 thoughts on “ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

 1. కిరణ్, ఫైర్‌ఫాక్స్‌౩, 98లో పనిచెయ్యదు. (నైట్లీని తెలుగులో ఏమనాలో తెలియదు.)

  ప్రవీణ్, మీరు వాడేది నైట్లీలా, లేక మైన్‌ఫీల్డ్ ఆల్ఫాలా? నైట్లీలైతే మీకిది కనీసం జూన్ 22 తయారీనుండి రావాలి. ఆల్ఫాలైతే, ఆల్ఫా6 కోసం విడుదలయ్యాకా చూడండి.

 2. అవును రాబోయీ ఫైర్ ఫాక్స్ చాలా బాగుంది. అదొక్కటే కాదు SVG బొమ్మలలో తెలుగు అక్షరాలు కూడా కనబడుతున్నాయి. ఉదాహరణకు ఈ బొమ్మను (http://upload.wikimedia.org/wikipedia/te/f/f3/Ap-raw.svg) FF2లో మరియు FF3లో చూడండి. కానీ వికీపీడియాలో SVG నుండి PNGలుగా మార్చే సాఫ్టువేరు ఇంకా unicode character renderingను సరిగ్గా support చేయటం లేదు, అందుకే SVGలో తెలుగు అక్షరాలు ఉన్నాకూడా అవి కనిపించటం లేదు.

  కానీ నేను ఇంకొన్ని నెలల వరకు FF2నే వాడతాను. Padmaను FF3కి తాజాకరించాలి కదా మరి. అప్పటి వరకూ మీ Unjustifyని వాడుతూనే ఉంటాను.

 3. మీరిచ్చిన లంకె కూడా మైన్‍ఫీల్డ్ నే ఇన్స్టాల్ చేస్తుందే ? నేనదే వాడుతున్నా ఇంతకు ముందు కూడా.
  మీరిచ్చిన లంకె నుంచి ఇన్స్టాల్ చేసినది కూడా మైన్‍ఫీల్డ్ నే ఇన్స్టాల్ చేసింది, అందులోనూ నాకు తెలుగు సరిగా కనిపించట్లేదు.

 4. నాకు టెక్స్టు అలైన్ ఫీచర్ ఆసం అనిపిస్తుంది.

  అన్నట్టు
  tools -> options -> content -> Fonts and colors -> Advanced -> Fonts for లో తెలుగు జతచేస్తున్నారా ??

  అది కూడా చేస్తే ఇక తిరుగుండదు…

 5. రాకేశ్‌ గారికి…. మీరు చెప్పినట్టు tools -> options -> content -> Fonts and colors -> Advanced -> Fonts for లో తెలుగు కనిపించట్లేదు. నేను firefox 2.0.4, gran paradiso and mine field లు ప్రయత్నించా… లాభం లేదు. నేను ఏదయినా మిస్‌ అయి ఉంటే చెప్పగలరు.

 6. ప్రవీణ్, మీరు మైన్‍ఫీల్డ్ వాడుతున్నట్లయితే సరే. (ఫైర్‌ఫాక్స్‌౩ ఆల్ఫాలను గ్రాన్ పారడైసో గా పిలుస్తారు. ట్రంకు ఎప్పటికీ మైన్‍ఫీల్డ్ గానే ఉంటుంది.)

  మీకింకా సరిగా కనబడకపోవడానికి, మీరు మైన్‍ఫీల్డ్‌ని ఫైర్‌ఫాక్స్‌ని ఒకేసారి నడపడంలేదు కదా? ఏదో ఒకదాన్నే నడపండి.

  Tools > Options > Content > Fonts and Colors > Advanced > Fonts for లో Other languages కి పోతన లేదా గౌతమిని ఎంచుకుని చూడండి.

  అక్కడే Default Character Encoding గా UTF-8ని ఎంచుకోండి.

  అప్పటికీ పనిచెయ్యకపోతే, పరిష్కారం నాకు తెలియదు. ఇంతకీ మీ నిర్వాహక వ్యవస్థ లినక్సా?

 7. అవును నేను మైన్ ఫీల్డ్ నే వాడుతున్నా ఇంతకు ముందు కూడా.

  మీరు చెప్పిన ఇతర భాషల సెట్టింగ్ పని చేసింది. ధన్యవాదాలు.
  హు… ఈ సెటింగ్ చెయ్యాలా ?

  లేదు మైన్‍ఫీల్డ్ ని నేను వాడేది విండోస్ XP మీదే.

 8. రాకేశ్,

  tools -> options -> content -> Fonts and colors -> Advanced -> Fonts for లో తెలుగు జతచేస్తున్నారా ??
  అది కూడా చేస్తే ఇక తిరుగుండదు…

  మంటనక్క 3 లో ఇది వస్తుంది. కావాలంటే బీటా 5 లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది కూడా. తెరపట్టు ఇదిగో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.