కూడలి వార్షికోత్సవ కానుక: చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం

కూడలి వార్షికోత్సవ కానుకగా చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం అందిస్తున్నా. ఇది సరళమైన, చిన్ని పరిష్కారం*.

Hide Visited Posts in Koodali

ఆ నక్షత్రం మీద నొక్కండి చాలు. మీరు చదివేసిన టపాలన్నీ ఎగిరిపోతాయి. (కీబోర్డు ప్రేమికులు “*” (asterisk), “.” (dot) లలో ఏదైనా వాడవచ్చు. Shift key does not matter.) మళ్ళీ అన్ని టపాలు కావాలంటే, పేజీని రీలోడ్ చేయండి.

ఇప్పుడే ప్రయత్నించండి!*

*document.defaultView ని అందించే ఏ విహరిణిలో ఐనా పనిచేస్తుంది. (మంటనక్కలో పనిచేస్తుంది. IE6లో పనిచేయదు. IE7 తెలియదు.)

ప్రస్తుతం బ్లాగుల పేజీలోనే దీన్ని చేతనం చేసా. మిగతా పేజీలలో కావాలంటే ఇక్కడ వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

ప్రకటనలు

8 thoughts on “కూడలి వార్షికోత్సవ కానుక: చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం

 1. మంట నక్కలో పని చేస్తుంది.

  రెండు సమస్యలు కనిపిస్తున్నాయి నాకు.

  1. ఒకటి కొన్ని సార్లు టపా ఎగిరిపోయినా రాసిన వారి పేర్లు ఉండిపోతున్నాయి ఉదాహరణకి జ్యోతి, చావా కిరణ్ అనే హెడింగులు ఉండి పోతున్నాయి.

  2. నేను గనక చూసేసిన లంకె పైన హోవర్ చేసి ఉంటే ఆ టపా తొలగించబడట్లేదు బహుశా మీరు లంకె రంగు చూస్తున్నారు కాబట్టి, నేను హోవర్ చేసినప్పుడు లంకె రంగు బ్లూ గా మారుతుంది. కాబట్టి అది హైడ్ అవట్లేదు అనుకుంట.

  మిగతా బాగుంది. టపాలు దాయడం పర్సిస్ట్ చేసినా బానే ఉంటుంది కానీ తర్వాత చూడాలనుకుంటే కనిపించేలాగా ఇంకో ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది.

  సారీ బగ్గుల గురించి ముందు మాట్లాడినందుకు. ఫీచర్ బాగుంది. :)

 2. నాకూ అయ్యీ7లో పనిచేయడంలేదు.

  నాదొక గొంతెమ్మకోరిక:
  బ్లాగులు, టపాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఇంతకు ముందులాగా అవన్నీ చదువుతూ కూర్చుంటే సర్వమంగళమే. అంచేత ఈ వారం అసలు కూడలికి రాకూడదు అనే నియమాన్ని పాటిస్తున్నాను. ఈ కష్టం తోలగించడానికి గానూ – ఏయే బ్లాగులు నేను ముఖ్యంగా చూడాలనుకుంటానో వాటిని ఏంపిక చేసుకొనే సౌలభ్యమూ, నేను ఎంపిక చేసిన బ్లాగుల్లో ఏవైనా కొత్తవి వచ్చిఉంటే అవి మాత్రమే కూడలిలో కనిపించేలా ఏర్పాటు ఉంటే హాయిగా ఉంటుంది.

 3. ప్రవీణ్, మీరు నివేదించిన బగ్గులు నాకు తెలుసు. ఇది చిన్ని మరియు తేలిక పరిష్కారం కాబట్టి ప్రస్తుతానికింతే.

  1. బ్లాగు పేరు తీసేయ్యడమనేది ఇంకా సంపూర్ణంకాదు. బ్లాగుకింద ఒకే టపా ఉంటే బ్లాగు పేరుని కూడా తీసేస్తున్నా. రెండుకంటే ఎక్కువ టపాలుంటే, అందులో చదివినవెన్ని అనిలెక్కించుకోవాలి. అదంతా ఇప్పుడే చేస్తే మెరుగులకి అవకాశం ఉండదుకదా. ;-)
  2. మీరు కరెక్టు. రంగు కాకుండా, మీరో లింకును దర్శించారో లేదో తెలుసుకోవడం నాకు తెలిసి కష్టం (చిన్ని మరియు తేలిక పరిష్కారంలో).

 4. రానారె:
  నీకు అలాంటి పరిష్కారం కావాలంటే సింపుల్ గా Yahoo! Pipes ఉపయోగించు. నీకు కావలసిన ఫీడ్లను అందులో పెట్టుకుంటుండవచ్చు. అన్నీ కలిసి ఒక ఫీడుగా నీకొచ్చేస్తుంది. ఎందుకీ తలనొప్పి అనుకుంటే గూగుల్ రీడర్ లోనో ఇంకేదయినా RSS రీడర్ లో నీ కిష్టమయిన బ్లాగుల ఫీడ్లకి సబ్స్క్రైబ్ చెయ్యి. అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s