ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి.

మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి.

మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది అవసరం.

ఇన్‌స్క్రిప్ట్‌ని ఇంగ్లీషు లేఔట్‌తో ముడి పెట్టడమనేది ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునేవారు చేసే మొదటి పొరపాటు మరియు వదులుకోవాల్సిన మొదటి అలవాటు. “ర” రాయాలంటే j అక్షరం టైపుచేయాలి అని గుర్తుంచుకోకూడదు. కుడిచేతి చూపుడువేలును వొత్తాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి నియమం. ఉన్న నియమం కూడా ఇదొక్కటే! పెద్దలమాట చద్దిమూట. మరొక్కసారి నా మాటల్లో:

Rule 1: Don’t try to remember keys; remember their positions.

మీరు ఇన్‌స్క్రిప్ట్‌లో టైపు చేస్తున్నప్పుడు మీ మదిలో తెలుగు అక్షరాల లేఔట్ ఉండాలి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నప్పుడు ఇంగ్లీషు అక్షరాల లేఔట్ ఉండాలి. అప్పుడు మీరు టైపింగులో మంచి వేగం సాధించగలుగుతారు. ఇంగ్లీషు లేఔట్‌తో తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంగ్లీషు మరియు తెలుగు టైపింగుల వేగం ప్రతికూలంగా ప్రభావితమౌతుంది. మీరు టైపుచేస్తున్నప్పుడు రెండు లేఔట్లు (మీ మదిలో) కలగలిసిపోయి ఒకదానిబదులు ఇంకొకటి టైపుచేసి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది (మొదట్లో నాకు పట్టింది).

ఇన్‌స్క్రిప్ట్‌లో ఫలానా అక్షరం ఎలా టైపుచెయ్యాలి అని ఎవరైనా నన్ను అడిగితే, నేను మొదట ఆ కీ స్థానం గుర్తుతెచ్చుకుని, ఆ స్థానంలో ఇంగ్లీషుకి ఏ కీ ఉంటుందో చెప్తా. అవును, పై నియమం నేను అనుసరించిన తర్వాతే చెప్తున్నా.

ఒక్కసారి కీల స్థానాలమీద పట్టు సాధించాకా, వేగంగా టైపు చేయడమనేది ఇన్‌స్క్రిప్ట్‌ లోఔట్‌తో చాలా సులభమౌతుంది.

నాకైతే ఇన్‌స్క్రిప్ట్‌ లేఔట్‌తో తక్కువ నొక్కులతో టైపుచేయగల్గుతున్నాననిపిస్తుంది. ఇంకా తర్వాత టైపు చెయ్యాల్సిన కీ వేలి క్రిందే ఉన్నట్టు అనిపిస్తుంది. (సరే చాలా అతిగా చెప్పేసాననుకోండి.)

ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం.

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు”పై 5 స్పందనలు

 1. వీవెన్ గారు,
  చాలా చక్కటి పాయింటి మెన్షన్ చేసారు.
  ‘మ’ కి ‘c’ ఇంట్యూటివ్ గా లేదు అంటుంటే జనులు, నాకు మీరు చెప్పిందే అని పించింది.

 2. పింగ్‌బ్యాక్: గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని | వీవెనుడి టెక్కునిక్కులు

 3. నమస్త
  ఇన్ స్క్రిప్ట్ లేఖిని ఇంతకుమునుపే సిడాక్ వారు తెలుగు లిపి కోసం తయారు చేశారు. దానిని కొంతకాలముగా నేను వాడుతునే ఉన్నాను. అయితే మీరు తయారుచేసిన దానిలో తెలుగు అంకెలు ఉన్నవి. మీకు నా హ్రుదయపూర్వక అభినందనలు.
  ఇప్పటికి
  తెలుగు అభిమాని
  సుంకర రంగారావు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s