తెలుగుబ్లాగు గుంపులో వచ్చిన ప్రతిపాదన మేరకు కూడలిలో సేకరణబ్లాగులకో ప్రత్యేక విభాగం సృష్టించా. (బ్లాగుల జాబితా) మీ బ్లాగు ఇందులో ఉండిఉంటే, అలా ఉండకూడదని మీరనుకుంటే, తెలుగుబ్లాగు సమూహంలో చర్చించండి.
మొదటిపేజీలో ఇక కనబడని వీటికి పరిహారంగా సేకరణ పేజీలో టపాల సంఖ్య 100కి పెంచా. అంటే టపాలు కూడలిలో ఉండేకాలం ఎక్కువవుతుంది, కాబట్టి ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది.
మరోహంగు: ప్రతీ పేజీ చివరన ఇతర పేజీలుకు లింకులు అమర్చా. పేజీల మధ్య విహరించడం సులువౌతుంది. ఒక పేజీ చివరకొచ్చాకా వేరే పేజీకి లింకు అక్కడే ఉంటుంది. మళ్ళీ పేజీలో పైకెళ్ళాల్సిన అవసరంలేదు.
బాగుంది ఇప్పుడు