స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు

పట్టణాల్లో ఉంటున్నమనం త్రాగేనీటిపై తగిన శ్రద్ధ వహించాలికదా. మేము మా ఇంట్లో త్రాగేనీటి కోసం కాచి వడపోసిన నీటిని ఉపయోగిస్తాం. స్వచ్ఛమైన నీటికోసం మరింత సులభమైన పద్ధతులు, సాధనాలు ఉండిఉంటాయి. వాటర్ ఫిల్టర్, ఆక్వాగార్డు, తదితరాలు.

నేను హిందూస్థాన్ లీవర్ వారి ప్యూరిట్‌ని కొందామని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా దానిని ఉపయోగించిఉంటే చెప్పండి, మీరు దానితో సంతృప్తికరంగా ఉన్నారా? నేను ప్యూరిట్‌నే ఎంచుకోవాలా? లేదా మరేమైనా ఉత్తమ ఫలితాలు చూపే చౌక సాధనాలు ఉన్నాయా? ఒక రూపాయితో అత్యధిక ప్రయోజనం ప్యూరిట్ అందిస్తుందని హిందూస్థాన్ లీవర్ వారు చెప్తున్నారు. మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయండి.

5 thoughts on “స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు

  1. నేను ప్యూరిట్ ఈమధ్యనే కొన్నాను. దీనికి కంపెనీ ఆర్నెల్ల వారంటీ మాత్రమే ఇస్తోంది. వెనువెంటనే దానిమీద అభిప్రాయం చెప్పకూడదు. కొంతకాలం వాడి చూడాలి కదా. అయితే ఇదీ ఒక రకం ఫిల్టరే. కాని దీనికి ఒక క్లోరిన్ ఛాంబర్ ఉంది. అది నీటిని స్టెరిలైజ్ చేస్తుంది. నీళ్ళలో ఉన్న అదనపు క్లోరిన్ పరిమాణాన్ని ఫిల్టర్ కోన్‌లు పీల్చేసుకుంటాయని అందుచేత నూటికి నూరు శాతం రాసాయనిక కాలుష్యం లేని నీరే దాని కొళాయిలోంచి వస్తుందని HLL పేర్కొంటోంది. అన్ని ఫిల్టర్‌ల మాదిరిగానే ఇందులో కూడా నీరు మొదట్లో తొందరగా కిందికి దిగుతుంది (వాస్తవానికి-దిగి, మళ్ళీ ఎక్కుతుంది). కొన్ని రోజుల తరువాత కొంచెం ఆలస్యమౌతుంది. ప్యూరిట్ లోంచి వస్తున్న నీటికి రంగు రుచీ వాసనా లేని మాట నిజం. అయితే ఎక్కువ నీరు పట్టదు. గరిష్ఠంగా 18 లీటర్‌లు పట్టుతుంది. అంటే రోజుకి ఒకసారైనా మొత్తం నీరు ఖాళీ చెయ్యాలి. ఒక చిరు సమస్య నేను గమనించాను. అదేంటంటే- దాని కింది ఛాంబర్‌లోకి వెళ్ళిన నీరు 95 శాతం-మనం నీరు ఒంపుకునే ఛాంబర్‌లోకి వస్తోంది కాని, ఒక 5 శాతం అక్కడే ఉండిపోతోంది.దాన్ని బయటికి ఒంపే ఉపాయం కనిపించట్లేదు. ఏమైనా ప్రతి నెలా-రెండు నెల్లకోసారి కంపెనీ మనిషిని పిలిచి సర్వీసింగ్ చేయించడం మంచిది.

Leave a reply to జ్యొతి స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.