ఐఐఐటి హైదరాబాదుకి నా సందర్శన

పప్పు నాగరాజు గారు నాకు ఐఐఐటి ప్రొఫెసర్ వాసుదేవ వర్మ గారిని పరిచయం చేసారు. వాసుగారు శోధన మరియు సమాచార వెలికితీతల ప్రయోగశాల (Search and Information Extraction Lab, SIEL) కి నాయకత్వం వహిస్తున్నారు. ఐఐఐటిలో ఇది భాషా సాంకేతికతల పరిశోధనా కేంద్రం (Language Technologies Research Centre, LTRC) లో భాగం. వారి ఆహ్వానంతో లాబ్ సందర్శనకు నేను వెళ్ళా.

SIELలో విద్యార్థులు మరియు పరిశోధకులు (మన తోటి తెలుగుబ్లాగరు సౌమ్య కూడా ఈ విభాగంలోనే) పనిచేస్తున్న ప్రాజెక్టులని చూసా. వీరి ప్రణాళికల్లో బొమ్మల్లో ఉన్న వచనాన్ని శోధించడం (results from scanned images) కూడా ఉంది. ఇది వీలుపడితే, తిరుగేలేదు. ఎందుకంటే చాలా వరకు భారతీయభాషల్లోని సాంఖ్యాసమాచారం (digital content) ఇమేజిల రూపంలో ఉంది. జయధీర్ తిరుమలరావుగారి ప్రాజెక్టు (పోయినసారి e-తెలుగు సంఘ సమావేశ విశేషాల్లో వీరిగురించి చూడండి.) కి దీన్ని అనుసంధానిస్తే పురాతన విషయ సమాచారాన్ని శోధించే వీలు చిక్కుతుంది.

SIEL ప్రాజెక్టులలో కొన్నింటిని మనం వెబ్‌లో ప్రయత్నించవచ్చుకూడా. ఇవన్నీ గొప్ప ప్రాజెక్టులు. కీలకమైన అంశమేంమంటే, వీటిని సాధారణ వాడకానికి అనుగుణంగా తీర్చిదిద్దవలసిఉంది. వీటిని జనబాహుళ్యంలోనికి తీసుకురావడానికి నావంతు సహకారం అందిస్తానని చెప్పాను. ఈ ప్రాజెక్టులలో మీరు ఏయే మార్పులని ఆశిస్తున్నారు? అసలు వీటికి సంబంధంలేకుండా, మీ సమాచార ఆవశ్యకాలేంటి? బ్లాగర్లుగా సమాచార వినియోగంలో మనం ముందుంటాం. వీరినుండి మనమేం ఆశించవచ్చు? మీ ఆలోచనలని ఇక్కడ తెలియజేయండి. వీటిపై వారు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.

నేను పనిచేసిన, చేస్తున్నవాటిగురించి వారికొక ప్రదర్శన (presentation) ఇచ్చా. అంతా మీకుతెలిసిందే, నా సొడబ్బా. కాకపోతే మీరిది చూడలనుకోవడాని ఓ కారణముంది: బహుశా ఇది యూనికోడ్ తెలుగులో తొలి ప్రెజెంటేషన్ కావచ్చు.

ప్రకటనలు

9 thoughts on “ఐఐఐటి హైదరాబాదుకి నా సందర్శన

 1. నేను ఈ మధ్యనే ఈ SIEL వెబ్ సైటు చూసా..కానీ అందులో వున్న ఏ ప్రోజెక్టు పని చెయ్యటం లేదు. ఒక్క సెర్చ్ ఇంజన్ తప్పితే. బహుశా ప్రయోగ దశలో వున్నాయనుకుంటా

 2. హై! వీవెన్,
  నా పేరు సుమన్. నేను మీకు ఐఐఐటి, హైదరాబాదులొ పరిచయం అయ్యాను. మీ ప్రదర్శన చాలా బాగుంది. కాని మీది తెలుగులొ తొలి ప్రెజంటేషన్ అయితే కాదు. 1996 లొ నేను గుడ్లవల్లేరు పొలిటెక్నిక్ లొ చదువుతున్నప్పుడు కంప్యూటర్ విఘ్నానము అనె తెలుగు మాస పత్రిక వచ్చెది. ఆ పత్రికతొ పాటు ఒకసారి ఫ్లొప్పి కుడా ఫ్రీగ వచ్చింది. ఆ ఫ్లొప్పీ లొ తెలుగులొ వ్రాయటానికి సాఫ్ట్వేరు వుంది. జన్మభూమి కార్యక్రమంలొ భాగముగా మేము చుట్టుపక్కల స్కూల్స్ కు కంప్యూటర్ గురుంచి తెలియచెయ్యాలి అని ప్రెజంటేషన్ తయ్యారుచేశాము. అక్కడ స్కూల్స్ అన్నీ తెలుగు మీడియం కావటంతొ మేము యీ ప్రెజంటేషన్ ని తెలుగులొ తయ్యారుచేశాము. అప్పుడు పిపిటిలొ తెలుగు సాఫ్త్వేరు తొ వ్రాసిన పదాలను కాపి చేసి ప్యెస్ట్ చెశాము. నాకు తెలిసి అదే మొదటి తెలుగు ప్రెజంటేషన్ అయివుంటుంది. నాకు తెలుగు లొ బ్లాగు వ్రాయటం ఇదే మొదటి సారి. తప్పులు వుంటె క్షమించండి.

 3. వీవెన్ గారికి,
  మీ సందర్శనకి, టపాకి కృతజ్ఞతలు. మీ రాక మకెంతో ఉత్సాహన్ని, ఆనందాన్ని ఇచ్చాయి.

  సుధాకర్ గారికి,
  మీరు గమనించింది నిజమే – ఈ మధ్య ఒక సర్వర్ నుండి వేరొక సర్వర్ కి డెమోలను మారుస్తున్నాము. అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. త్వరలో అవన్నీ సరి చేస్తాము. పాపం, కొన్నాళ్ళ క్రితం వరకు అహోరాత్రాలు శ్రమించాయి ఆ డెమోలు. :)

  బ్లాగరు మిత్రులందరికి విన్నపం: మీరు వీలయనప్పుడల్లా ఈ సంకేతిక టూల్స్ వినియోగిస్తూ మీ అభిప్రాయాలను మాకు తెలియపరచ ప్రార్ధన. త్వరలో ఒక కొత్త రూపంతో,చాల సాంకేతికమయిన మార్పులతో కొత్త వెర్షన్ వస్తుంది. దానికి మీరు చెప్పబోయె అభిప్రాయాలే ఆధారం.

  http://webkhoj.iiit.ac.in alias http://www.kanugonu.com
  http://search.iiit.ac.in

 4. ఇది చాలా మంచి పరిణామం. తెలుగు వ్యాప్తి కి కావలసిన టూల్స్, సాఫ్ట్‌వేర్, మొదలయిన వాటి ప్రచారం కోసం ఇలాంటివి ఎంతయినా అవసరం.
  IIIT ఇందులో చేస్తున్న కృషి అభినందనీయమైనా ఈ మంచి పనికి తగ్గ ప్రచారం లేదని కూడా నాకు అనిపిస్తుంది. ఒక సూచన ఎలాగంటే బ్లాగులలో, లేదా ఇంకే విధంగానయినా వీటి గురించి చెప్పి, జనాలని వీటిని ఉపయోగించి వాటిలో మార్పులు చేర్పులు చెయ్యాలని కోరవచ్చు. అలాగే వారి సైట్ ను ఇంకా బాగా అభివృద్ధి చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది.
  కుదిరితే ఈ కోడ్ ని ఓపెన్ సోర్స్ చేసి, కాన్ట్రిబ్యూట్ చెయ్యమని కోరవచ్చు. అలా కుదరకపోతే ఎవరితో నయినా పార్ట్నర్షిప్ చెయ్యవచ్చు.
  ఈ దిశలో మీరు వేసిన మొదటి అడుగు సరయినదిగానే ఉంది. కానీ వారి నుండి కూడా పుష్ వస్తే బాగుంటుంది.

 5. వాసుదేవవర్మ గారు, నాకొక డౌటు…సామాన్య ప్రజానీకం 98% ఉపయోగించే OS ల కోసం టూల్స్ ఏమైన తయారు చేస్తున్నారా? వెబ్ ఆధారిత టూల్స్ అయితే ఫర్వాలేదు కానీ, డెస్క్ టాప్ ఆధారిత టూల్స్ అతి కొద్ది మంది వాడే OS లకు మాత్రమే రాస్తే లాభం ఏమన్నా వున్నదా? అన్ని ప్లాట్పారమ్ లలో పనికివచ్చేటట్లు విశ్వవిద్యాలయాలు ఎందుకు పనిచెయ్యవు?

 6. రాంబాబు గారి తెలుగు వర్డ్ రాకముందే జె పి జి ల లోతెలుగు ప్రెజెంటేషన్ చేసాం. మా కన్నా ముందు మరెవరో చేసి ఉండచ్చు.
  ఒకే సారి ఒకే పని మరి కొందరు చేస్తూ ఉంటారు. కొందరు ప్రచారం లోకి రావచ్చు. కొందరికి రాకపోవచ్చు.
  నేనే మొదలు అన్నది తప్పు అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికి అయినా సరే..
  అయితే ఇంటర్నెట్ లో తెలుగు అనే విషయం లో వీవెన్ గారు చేస్తున్న తపస్సు సదా స్పూర్తి దాయకం.ఎంతగానో మెచ్చుకోదగ్గది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.