క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:
- 2006-03-15: లేఖిని జననం
- 2006-03-19: కొత్త రూపం, హంగులు
- 2006-07-16: మరిన్నిహంగులు
- 2006-07-20: మరిన్ని మెరుగులు
- 2006-07-28: Lekhini.org
- 2006-08-17: లేఖిని పుట్టుక పెరుగుదల గురించి నా వ్యాసం
- 2006-09-02: ఆర్కుట్లో లేఖినికో సమూహం
- 2006-09-17: నిఖిలే జననం
- 2007-03-02: లేఖిని నుండి గూగుల్ శోధన
లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.
నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.
- లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
- ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)
What is the software used for creation of Lekhini?
Can we embed attractive fonts (Bapu) in Lekhini?
After saving what I typed, can this be programmed to send to registered e-mail address?
లేఖిని నిజంగా చాల ఉపయోగకరమైన తయారి… అభినందనలతోపాటు ధన్యవాదాలు.
వీవెన్…కూడలి గురించి కూడా రాస్తే చదివి తెలుసుకోవాలని ఉంది.
ఒక సలహా: (అంటే…బోడి సలహాలు అందరూ ఇస్తారనుకో…అమలు చెయ్యడమె కష్టం…కానీ మా సౌలభ్యం కోసం)
కూడలి లో పాత టపాలు Archieve లాగ పెడితే బాగుంటుంది. మళ్ళీ ఎపుడైన అవి చూడాలంటే ఏ బ్లాగులో చూసామో తెలియట్లేదు. కనీసం టపాల తలకాయలైన(Headings) Archive లో పెడితే బాగుంటుంది.
-కిరణ్
రావుగారు,
లేఖిని జావాస్క్రిప్ట్ లో తయారుచేయబడింది.కోడ్ ని నేను విమ్ ఎడిటర్ లో రాస్తా.
ఆకర్షణీయమైన ఫాంట్లు, ప్రస్తుతానికి కుదరదు.
అవును, మీరు భద్రపరచుకున్నవాటినికూడా ఈ-మెయిల్ చేసుకునేలా చేస్తాం.
కిరణ్, ప్రయత్నిస్తా.
లేఖిని కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. లేఖినిని అందించిన మీరు అభినందనీయులు.
thanks
శూభకాంక్షలు. లేఖిని లేకపోతే నేను తెలుగు లో ఇంతగా రాసేవాడిని కాదేమో.
ఇంకెన్నో వినూత్నమయిన పరికరాలు మీ నుంచి వెలువడాలని కోరుకుంటున్నాను.
ఈ లేఖిని తయారీకి తెలుగు బ్లాగ్లోకం మీకు ఋణపడి ఉంటుంది.
ధన్యవాదాలు.
తెలుగు లొ వ్రాయలనే నాఅసక్తి కి శక్తి కలిగించి, నాకు మరొసారి అక్షారాభ్యాసం, నాచే నా మాతృభాషలో ఓనామాలు దిద్దించినా ఓ లేఖిని! నీవు తెలుగు బ్లాగరుల పాలిట వరప్రదయని. వర్ధిల్లు పదికాలాలపాటు. నీ సృష్టికర్తకి శుభాభివందనలు.
లేఖిని గురించి నా సోది! ఎక్కువైతే ఏమీ అనుకోవద్దూ!
http://zillagrandhalayam.wordpress.com/2007/03/15/%e0%b0%b2%e0%b1%87%e0%b0%96%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%be%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b1%81%e0%b0%a8-%e0%b0%97%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf/
నా బోటి వారు బ్లాగింగ్ చేయడానికి దోహదపడిన లేఖినికి హృదయపూర్వక జన్మదిన శుభాకంక్షలు. వీవెన్ కు కృతజ్ఞతలు
ee wesite chala bagundi