స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

తొలి తెలుగు కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ స్వేచ్ఛ లినక్సు ని ఈరోజు మొదటిసారి ఉపయోగించా. మీ కోసం ఆ చిత్రావళి.

లైవ్ సి.డి. ఉపయోగించి కంప్యూటర్ని ప్రారంభించగానే, తెలుగా, ఇంగ్లీషా కోరుకోమంటుంది.

Choose Language

తెలుగుని ఎంచుకున్నాకా కొంత అంతర్గత ప్రక్రియ తర్వాత, స్వేచ్ఛ లోడింగ్ తెర కనిపిస్తుంది.

 Loading

ఆ తర్వాత స్వేచ్ఛ డెస్క్‌టాప్ ప్రత్యక్షమవుతుంది.

 Desktop

ఫైర్‌ఫాక్స్ తెరిచి తెలుగెలా కనిపిస్తుందో చూద్దాం. (UI కూడా తెలుగులో)

Firefox showing Telugu

ప్యానల్ కి చేర్పులని జోడించే పేటిక

Add to Panel Dialog

టెక్స్ట్ ఎడిటర్

Text Editor

స్వేచ్ఛ లినక్సు తెలుగుని చదువుతుందంటకూడా. మిథ్యాయంత్రంలో ధ్వని రావడంలేదు. ఓసారి ప్రత్యక్షంగా ప్రయత్నించి చూడాలి. UI అనువాదంలో తెలుగు బ్లాగర్ల తోడ్పాటు అవసరం. కొన్నయితే, అర్థంచేసుకోలేకపోయా.

లైవ్ సి.డి. కాబట్టి ఎటువంటి జంకులేకుండా మీరూ మీ కంప్యూటర్లపై ప్రయత్నించవచ్చు.

6 thoughts on “స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

  1. అవునండి ఇంతకు ముందు కూడా చూసాను, ఎప్పుడూ వాడి చూడలేదు.
    చాలా బాగుంది. Live CD వాడి చూడాలి. Knoppix మీద డెవేలోప్ చేసిందనుకుంట.
    ఇక్కడ (http://entrans.swecha.org/list.php?category=untrans&page=1) translate చెయ్యచ్చనుకుంట.

  2. జిల్లా గ్రంధాలయం, మిధ్యాయంత్రం అంటే Virtual Machine. ధ్వనికోసం VMWare నుండి డ్రైవర్స్ కావాలనుకుంటా. నాకు మామూలుగా ఉబంటులో శబ్ధాలు వస్తున్నాయి. కానీ మిధ్యాయంత్రంలో ఇన్‌స్టాల్ చేసిన ఉబంటులో రావట్లేదు.

  3. నిన్న .iso డౌన్లోడు చేసుకొని, అ సీడీతో నా నోటుబుక్కుని బూట్ చేసిచూశాను. బ్రహ్మాండంగా వుంది. అనువాదాలు మరీ జటిలంగా వున్నాయి. ఇంకా ప్రాధమికదశలో వుండటం వల్లనేమో కొన్ని తప్పులున్నాయి. బ్రౌజరు చిరునామాపట్టీ పక్కన ‘వెళ్లు’ అని వుండాల్సింది ‘వెల్లుము’ అనివుంది. టూల్‌టిప్‌లో కూడా అలాగే వుంది. ఇది ఒక ఉదాహరణ. మెత్తానికి గొప్పప్రయత్నం. ‘స్వేచ్ఛ’ పై ఒక కన్నేసి వుంచాలి. తెలుగును సరిగానే చదువుతున్నది. ఆశ్చర్యపోయాను. ఇదొక అద్భుతమైన పని. డిజిటల్ డివైడ్ ను రూపుమాపే వంతెనగా ఈ ప్రయత్నం విజయంసాధిస్తుందని ఆశిస్తున్నాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.