- రూపు కొంచెం మార్చా
- సూక్ష్మసంగ్రహంగా కొత్త టపా యొక్క శీర్షిక (మంటనక్క 2 బీటా వాడేవారు ప్రయత్నించవచ్చు. మంటనక్క 2 విడుదలయ్యేలోపు దీనిగురించి మరింత వివరంగా రాస్తా. ప్రస్తుతానికి ఈ సహాయపు పేజీ చూడండి.)
- ఏదేని అంశంపై సందర్శకుల దృష్టిని ఆకర్షించడానికి ఒక గమనిక పెట్టె.
ఈ గమనిక పెట్టెలో కి విషయాన్ని తెలుగుబ్లాగు సమూహపు సభ్యులు సూచించవచ్చు. (విషయము, లంకె, తదితర వివరాలతో నాకు ఓ రెండ్రోజులముందు ఈ-మెయిల్ చెయ్యండి. అత్యవసరమైతే నేను త్వరగా స్పందిస్తా.)
మంట నక్క ఏం బాలేదు!!
మొన్నెవరో అన్నట్టు జ్వాలా జంబూకం బాగుంది.
టెలుగులొ మీరు చేస్తున్న క్రుషికి అభినందనలు
ఫ్రఖ్యశర్మ
‘జ్వాలాముఖీ’ అంటే ఎలా ఉంటుందంటారు? ప్రతిపదార్థంలాగా కాకుండా స్వేచ్ఛానువాదం చేశాను.
జ్వాలా జంబూకం నేను వాడిన పదమే అయినా నాకు ఎందుకో మంట నక్క నచ్చింది :-)ఒక మంచి రెడ్ ఇండియన్ పదంలా వుంది. నాకు ఆ తెగ వాళ్ళ కధలంటే తెగ ఇష్టం.
mee krushi abhinamdaneeyam.dhanyavaadalu.
కొత్తగా తెలుగు బ్లాగ్ రాస్తున్నాను. కూడలిలో నా బ్లాగ్ కనపడటానికి ఏమి చెయ్యాలి. కాస్త చెప్పండి.
అంతే! ఇంక మీరేంచెయ్యక్కరలేదు. క్రమంతప్పకుండా టపాలు రాస్తుండండి చాలు.
హలొ, వీవెన్ గారు నమస్కరమండి
నేను ఇటీవలే సాహితిసుధ అనే ఓ బ్లాగు తెరిచానండి.
మీ కూడలి చాలా బాగుంది, దయచేసి నా బ్లాగును కూడలిలో ఎలా చేర్చాలొ తెలియచేయగలరు.
ఓ ఛిన్న కవిత
నేనెక్కడ…?
ఆమె పాధమంజీరం ఘల్లని మ్రొగుతుంది
ఆ సవ్వడి నా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
ఆమె నవ్వు కోటి స్వరాల మేళనమై రవ లిస్తుంది
నా హృదయం నా ధగ్గర మాయమవుతుంది
దానికోసం నా ప్రపంచమంతా వెతుకుతాను, అగుపించద్ు
ఇంతలో తన పిలుపు వినిపిస్తుంధీ, వెళతాను
ఆశ్చర్యం…
నా హృదయం తన హృదయంలో మమేకమై కనిపిస్తుంధీ.
రాత్రి నిద్రలో చెవి దగ్గరగా ఏదో చప్ప్పుడు
కళ్ళు తెరిచి చూస్తే… తుంటరి చంద్రుడు
వెన్నెలను అత్తరులా నా వళ్ళంతా చల్లుతున్నాడు
ఎలా తెలుసుకున్నాడో ఈవేళా నీ దగ్గరాకొస్తున్నానని…
రాఘవరెడ్డి గారూ, మీరు తెలుగుబ్లాగు ప్రారంభించినందుకు అభినందనలు! మీ బ్లాగుని కూడలిలో చేర్చా. మీ కవిత బాగుంది (చిన్న చిన్న అచ్చుతప్పులని మరచిపోతే).
మీవి టెక్కు నిక్కు లు కావు – టానిక్కులు!