ఫైర్‌ఫాక్స్ 2 లో కొత్త హంగులు

ఈ అక్టోబర్‌లో ఫైర్‌ఫాక్స్ 2 రానుంది. రెండవ బీటా కూడా నిన్ననే విడుదలయ్యింది. ఈ నేపధ్యంలో, ఫైర్‌ఫాక్స్ 2 లో ఏమేమి కొత్త హంగులు ఉండబోతున్నాయో చూద్దాం. నేనిప్పటికే బీటాని వాడుతున్నా. సంతృప్తికరంగా ఉంది. ఉత్సుకత ఉంటే మీరూ ప్రయత్నించండి. (గమనిక: బీటా సాఫ్ట్‌వేర్ అనేది డెవలపర్లకి, పరీక్షకులకి మాత్రమే ఉద్దేశించింది.)

 • కొత్త రూపు: నవీకరించబడిన రూపు మనకి మరింత ఆహ్లాదకరమైన వెబ్ విహరణ అనుభూతినిస్తుంది.
 • అంతర్నిర్మిత స్పెల్ చెకింగ్: ఇంగ్లీష్ స్పెల్ చెకింగ్ ఫైర్‌ఫాక్స్‌లోనే అంతర్నిర్మితమై వస్తుంది. ఇంగ్లీష్‌లో మీరేం టైపు చెయ్యాల్సివచ్చినా (బ్లాగుల్లో, ఫోరంలలో, ఈ-మెయిల్‌లో) మీ సందేశం అక్షరదోషంలేకుండా చూసుకోవచ్చు. ఇతర భాషలను కూడా extensionsగా చేర్చుకోవచ్చు. తెలుగు భాషకి ఇంకా అందుబాటులో ఉన్నట్టులేదు.
 • సెర్చ్ సలహాలు: మీరు వెతకబోయే విషయాన్ని సెర్చ్ బాక్స్‌లో టైపుచేస్తూఉన్నప్పుడే, అందుకు తగిన పదాలు ఓ drop-down జాబితాలో కనిపిస్తాయి. ఇది ఫైర్‌ఫాక్స్ సెర్చ్‌బార్ నుండి యాహూ!, గూగుల్, మరియు ఆన్సర్స్.కాం లని వెతుకుతున్నపుడు పనిచేస్తుంది.
 • సెర్చ్ ప్లగిన్ నిర్వహణ: ఫైర్‌ఫాక్స్ సెర్చ్‌బార్ నుండి పనిచేసేలా కొత్త సెర్చ్ ఇంజిన్‌లని సులువుగా చేర్చుకోవడం, ఉన్నవాటిని పైకి క్రిందికి మార్చుకోవడం ఇప్పుడు సాధ్యం.
 • సెషన్ రీస్టోర్: ఫైర్‌ఫాక్స్ గనుక పొరపాటున క్రాషైతే, తిరిగి మొదలైనప్పుడు గత స్థితిని గుర్తుపెట్టుకుంటుంది. అంటే మీరు చూస్తున్న వెబ్‌సైట్లు, వెబ్‌లో రాస్తున్న విషయం అన్నీ అలానే ఉంటాయి. అలాగే మీరు పొరపాటున మూసేసిన టాబ్‌లని కూడా తిరిగి తెరుచుకోవచ్చు.
 • ఫిషింగ్ నుండి రక్షణ: ఫిషింగ్ అంటే అసలు సైటును పోలిన నకిలీ సైటుద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని కాజేయడం. ఇటువంటి అనుమానాస్పద వెబ్‌సైట్లని గనుక మీరు పొరపాటున సందర్శిస్తుంటే, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
 • మెరుగైన ఫీడ్ తోడ్పాటు: వెబ్‌సైట్లు అందించే ఫీడ్లని ఫైర్‌ఫాక్స్ 2 మరింత బాగా గుర్తిస్తుంది. ఆ ఫీడ్ యొక్క previewని చూపిస్తుంది. ఆ ఫీడ్లని నేరుగా మీ నా యాహూ!, బ్లాగ్‌లైన్స్, గూగుల్ రీడర్, లేదా మరేదైనా మీకిష్టమైన వెబ్‌సేవకి లో చేర్చుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. లేదా ఈ ఫీడ్లని ఫైర్‌ఫాక్స్‌లోని లైవ్ బుక్‌మార్క్స్‌గా కూడా చేర్చుకోవచ్చు.
 • మెరుగైన ఆడ్-ఆన్ నిర్వహణ: ఎక్స్‌టెన్షన్ మరియు థీమ్ నిర్వహణలు ఇప్పుడు ఒకే విండోలో (వేర్వేరు టాబ్‌ల్లో) ఉంటాయి. ఏదైనా కొత్త ఎక్స్‌టెన్షన్‌ని చేర్చినప్పుడి సులువుగా ఫైర్‌ఫాక్స్‌ని రీస్టార్ట్ చేసుకోవడానికి ఈ ఆడ్-ఆన్ విండోలో ఓ బటన్ కూడా ఉంటుంది.
 • సూక్ష్మ సంగ్రహాలు: ఇప్పటివరకు బుక్‌మార్క్ శీర్షికగా ఆ వెబ్‌పేజీ యొక్క శీర్షికే ఉండేది. కానీ ఈ సూక్ష్మ సంగ్రహాలతో, మీ బుక్‌మార్కుల శీర్షికలు డైనమిక్‌గా మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. (ఉదాహరణకి, మీరో వేలం సైట్లో ఒక బిడ్ వేసి దాన్ని బుక్‌మార్క్ చేసుకున్నారునుకోండి, ఆ బుక్‌మార్క్ శీర్షికగా వేలంయొక్క ప్రసుత ధర కనిపిస్తుంది. మీరేదైనా బ్లాగుని బుక్‌మార్క్ చేసుకుంటే, ఆ బ్లాగులోని కొత్త టపా యొక్క శీర్షిక కనిపిస్తుంది.) అయితే, వెబ్‌సైట్లు ఈ సూక్ష్మ సంగ్రహాల్ని అందిస్తే తప్ప సాధారణ వాడకందార్లకి తమకిష్టమైన సంగ్రహాలని పొందడం ప్రస్తుతానికి కొంచెం కష్టం.
 • టాబ్ విహరణకి మెరుగులు: ప్రతి టాబ్ పై దాన్ని మూసేయడానికో బటన్. టాబ్‌బార్ కుడి చివరన, తెరిచిఉన్న టాబ్‌లని జాబితాగా చూపించే ఒక బటన్.
 • చిన్నా చితకా: జావాస్క్రిప్ట్ 1.7కి తోడ్పాటు, మరింత SVG తోడ్పాటు, విండోస్‌కి నల్‌సాప్ట్ ఇన్‌స్టాలర్ కూడా, ఇంకా మరెన్నో బగ్ ఫిక్సులు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.