లేఖిని—పుట్టుక మరియు పెరుగుదల

గతం

కావ్య నందనం వెబ్‌సైటు చూసి ఆ ప్రేరణతో ఎప్పుడైనా హెక్సా డెసిమల్ కోడ్‌తో HTML లో వ్రాస్తూ ఉండే వాడిని. (చాలా పాతది 2002 లో ను చేసిన ఈ పేజీ చూడండి.) అప్పట్లో తెలుగులో వంశవృక్షం కూడా తయారు చేసా. తర్వాత వెన్న నాగార్జున గారి పద్మ ఆన్‌లైన్ వెర్షన్ చూసా. పర్వాలేదు అనుకున్నా. తర్వాత తెలుగులో అంతగా ఏమీ చెయ్యలేదు. అప్పుడప్పుడు తెలుగు వికీపీడియా కి వెళ్ళి చూస్తూ ఉండేవాడిని. వేయి తర్వాత వ్యాసాల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది (చదువరి గారి ఆగమనం వల్ల అనుకుంటా). ఇక బ్లాగుల ప్రభంజనం మొదలు. మెల్లగా తెలుగు వికీపీడియాలో రాయడం మొదలెట్టా. ఆంగ్లంలో ఈ బ్లాగు మొదలెట్టా. ఇక తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం.

పుట్టుక

కిరణ్ చావా మరియు చదువరిల బ్లాగులు అప్పుడప్పుడు చూస్తూ ఉన్నా, తెలుగు బ్లాగర్ల మొదటి సమావేశం తర్వాతే నేనూ బ్లాగుని తెలుగులో రాయాలని, పద్మలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులని తొలగించి సరళంగా ఓ పేజీ చెయాలని ఆలోచన వచ్చింది. పద్మ GPLతో లభ్యం కాబట్టి న్యాయపరమైన సమస్యలేమీ లేవు. పద్మ కోడ్‌ని దిగుమతి చేసుకొని, అధ్యయనం చేసి (నాకు జావాస్క్రిప్ట్, ఆమాటకొస్తే ఏ ప్రొగ్రమింగ్ భాషా అంతగా తెలియదు) చిన్న చిన్న మార్పులుచేసి సరళం చెసా. దానికే లేఖిని అని పేరు పెట్టి నా వెబ్‌సైట్‌లో ఉంచి తెలుగుబ్లాగు సమూహంలో ప్రకటించా. తెలిసిన వారికి ఈ-మెయిల్ చెసా. బ్లాగుపోస్ట్ రాసా. చాలా మంది అభినందించారు, ప్రోత్సహించారు. వారి వారి బ్లాగుల్లో రాసారు. తమ మిత్రులకి పరిచయం చేసారు. చాలా మంది పద్మ నుండి లేఖినికి మారారు.

ఎదుగుదల

తర్వాత నెల రోజులలో మరిన్ని హంగులు చేర్చా. లేఖినిని మరింత మంది వాడడం మొదలుపెట్టారు. తెలుగుబ్లాగు సమూహంలోనూ, తెలుగు వికీపీడియాలోను ఎలా రాయాలి అని అడిగే ప్రశ్నలకు నాకంటే ముందే చదువరి, కిరణ్, వెంకట రమణ లేదా మరొకరో లేఖిని వాడమని సలహా ఇచ్చేవారు. సులభంగా తెలుగులో టైపు చెయ్యడానికి లేఖిని మారుపేరయ్యింది. తర్వాత చాలా రోజులు ఏమీ మార్పులు చెయ్యలేదు (మళ్ళీ ఆ కోడ్ గందరగోళంలోకి వెళ్ళలేక). చరసాల మొదలగు వాడకందార్ల సలహాలు, సూచనల మేరకు గత నెలలో మరిన్ని చిన్ని చిన్ని మెరుగులు చేర్చా. లేఖిని వాడకపు పెరుగుదలని ఈ చిత్రంలో చూడండి. (జూలై, ఆగష్టు నెలల్లో ట్రాఫిక్కు veeven.org, veeven.com ఇంకా lekhini.org ల మధ్య చీలిపోయింది. కనుక ఖచ్చితమైన అంకెలు అందుబాటులో లేవు.) లేఖిని వల్ల వెబ్‌లో ఎంత తెలుగు సమాచారం పెరిగింది అనేదానికి లేఖిని వాడేవారి స్పందనలే తప్ప వేరే ఆధారాలు ఏమీ లేవు.

Lekhini Growth

చావా కిరణ్ సలహా మేరకు, ఈ మధ్యనే లెఖినికి సొంతగూడు (lekhini.org) కూడా కట్టించా :-)

భవిష్యత్తు

లేఖిని ధీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. తెలుగులో రాయడానికి లేఖిని కంటే సులభమైన, స్థిరమైన సాధనాలు రావాలి.

23 thoughts on “లేఖిని—పుట్టుక మరియు పెరుగుదల

 1. నేనిక్కడ కేవలం netizens మధ్యనే కాకుండా సామాన్య ప్రజల మధ్య లేఖినిని జనరంజకం చెయ్యడానికి కృషి చేస్తున్నాను. ఈమధ్యనే అన్ని స్థానిక internet centres లో లేఖిని ప్రయోగం-ఉపయోగం గురించి కరపత్రాలు పంచిపెట్టాను. చూద్దాం, ఏమౌతుందో ! -అంబానాథ్

 2. ఐతే మీతొ పోలిస్తే నేను పిల్ల కాకి ని అన్న మాట. నాకు 2002 లొ ఇంటెర్నెట్టు అంటే ఎమిటో కూడా తెలీదు. మీరు అప్పటికే తెలుగు లో ప్రయొగాలు చేసారన్నమాట. నేను ఈ ఆన్‌లైన్ తెలుగు గొడవ ఇటీవలిది అనుకున్నా. చాల చరిత్ర ఉందే :))

 3. జావా ప్రొగ్రామ్మింగ్ తెలియకుండానే పద్మ కోడ్ లొ మార్పు చేసి స్రుష్టించిన లేఖిని ఇంత మందికి ఉపయోగమవుతుందని – ఎవరైనా ఊహించారా!

  గతంలొ నెను నా బ్లాగు సమీక్షలన్నీ అంగ్లంలొ రాసేవాడిని.లేఖినితొ పరిచయం అయ్యాక నా సమీక్షలు తెలుగులోకి మారుతున్నై. లేఖినిని పరిచయం చేసిన కిరణ్ కు, ప్రోత్సహించిన చదువరికి, స్రుష్టికర్త వీవెన్ కు నా ధన్య వాదాలు.

  ఈ ఉత్తరం రాస్తున్నా లేఖినిలొ .

 4. Thanks Viven!
  నేను 99, 2000 లలో తెలుగు కోసం ప్రయత్నిస్తే “లిపి” తప్ప వేరే మార్గము కనపడలా! దాంతో వచ్చిన చిక్కు తెలుగు చదవాల్సిన వాడు కూడా లిపిని install చేసుకోవాలి. అలా సరైన ఉపకరణాలు లేకపోవడం తో తెలుగులో వ్రాయాలన్న నా తృష్ణ క్రమంగా చచ్చిపోయింది. అయితే ఇప్పుడు నా మూడేళ్ళ కూతురికి తెలుగు ఎలాగైనా నేర్పించాలి అని వెతుకుతూ వుంటే చావాలు, వీవెన్‌లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీలు తగిలి చాలా ఆశ్చర్యపోయా! ఆనందపడిపోయా! నా పాఠశాల రోజుల్నుండీ, కళాశాల రోజుల వరకూ తెలుగులో చక్కగా డైరీ రాసుకునేవాన్ని. అయితే దాన్ని రహస్యంగా దాచటం చాలా కష్టమయి చివరికి నాకు, నా ప్రియ మిత్రుడికి మద్య అభిప్రాయభేదాలకు దారి తీసింది.
  ఇక మళ్ళీ Online లో రహస్యంగా తెలుగులో రాసుకునే ప్రక్రియ వచ్చేవరకూ వేచిచూడాలనుకున్నా. ఇప్పుడు అన్నీ అందుబాటులోకి వచ్చినా ఆచరణ మాత్రం ఇంకా రాలేదు.
  — ప్రసాద్
  http://charasala.wordpress.com

 5. లేఖిని ప్రజాదరణలో పెరుగుదల నెట్లో తెలుగుకు పెరుగుతున్న ప్రజాదరణకు సూచిక లాగుంది. మనకిదో సెన్సెక్సు అనుకోవచ్చు. అభినందనలు వీవెన్! నెట్లో తెలుగును లేఖిని పరుగులు పెట్టిస్తోంది, దూకిస్తోంది.
  అంబానాథ్! మీరు “చేసిన” పని మేమూ చెయ్యాలని అనుకున్నాం. (కేవలం అనుకున్నాం!) మీరు చేసేసారు. మీరు బ్లాగరుల సమావేశానికి రావలసిన అవసరం ఉంది. ఈ నెల సమావేశానికి ఆహ్వానం! వీవెన్! ఈ సారి సమావేశం ఎప్పుడు?

 6. ఇంటెర్నెట్టుపై తెలుగులో వ్రాయడానికి లేఖిని చాలా చక్కగా డెజైను చెయ్యబడిన సాఫ్టువేరు అని నా అభిప్రాయము. వీవెన్ గారికి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నాగార్జున వెన్న గారికి, దేశికాచారి గార్లకు కూడా శుభాకాంక్షలు.

  ఈ విజయంలో ముగ్గురిని కలిపి ‘ త్రిమూర్తులు ‘ అని పిలువవొచ్చేమో. ప్రస్తుతానికి నేను ఈ పోస్టును లేఖినితో Mac OS X పై వ్రాస్తున్నాను.

 7. వీవెన్ ఇంతటి ఘనకార్యం సాధించిన నీకు/మీకు? నా శుభాభినందనలు.నేను దేశికాచారి గారి తెలుగునే వ్రాస్తూన్నా… లేఖిని ఏ సాంకేతికత తెలియకుండా అప్పటికప్పుడు తెలుగును చాలా సులువుగా రాయగల పరికరం.ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన నీవు సర్వదా అభినందనీయుడవు.తెలుగు భాష కు ఈ ప్రపంచజాలం లో జవసత్వాలు కల్పించిన అపర భగీరథుడవు!

 8. చింతు, నన్ను నీవు అనే అనండి. నేనింకా చిన్నవాడినే.ఈ అభినందనల్లో సింహభాగం వెన్న నాగార్జున గారికి దక్కాలి. వారి పద్మ ఉపకరణం లేకుంటే లేఖినే లేదు.

 9. హాయ్ నేను మొదట సీ-డాక్ వారి సీడి ని వుపయోగించాను. నేను అందుబాటు లో వున్న వుపకరణాలను వుపయోగించి NO Need to Copy Concept nu ADD chesaanu. దానిని GOOGLE GADGET గా తయారు చెసాను. మీరు కూడ్ మీ GOOGLE HOME కి ADD చేసుకోవచ్చు. OREMUNA
  సైటు వారు వుపయోగించిన టెక్స్టు బాక్సు చూడడండి. డాని ఇక్కడ వుపయోగిస్తే చాలా బాగావుంటుంది.అన్ని తెలుగు సైటుల లో కూడ వుపయోగిస్తే చాలా బాగుంటుంది.మరిన్ని తెలుగు GOOGLE GADGETS రావాలని కోరుకొంటూ

  మరి నా GOOGLE GADGET nu మీరు ఇక్కడ చూడవచ్చు.
  http://www.google.co.in/ig/directory?hl=en&num=24&q=telugu+&btnG=Search+Homepage+Content

  http://mdileep.googlepages.com/telugu1.xml

 10. కళ్యాణ్, మీ అభినందనలకు కృతజ్ఞతలు. తెలుగులో విజ్ఞాన సర్వస్వం (వికీపీడియా), నిఘంటువు (విక్షనరీ) ల కొరకు సామూహిక కృషి జరుగుతూంది. మీరూ పాలుపంచుకోవచ్చు.

 11. హలో..
  అందరికీ నమస్కారం. ఈ తరహా తెలుగు సైట్ నెట్ లో చూడడం చాలా సంతోషంగా వుంది.
  వీవెన్ గారు మీరు నిజంగా అభినందనీయులు. ఇది వరకు నేను తెలుగులో బ్లాగ్ రాయడం కోసం చాలా సార్లు ప్రయత్నించాను.నాకు పద్మ,లిపి మొదలగు సాఫ్ట్ వేర్ ల గురించి తెలియదనుకొండీ, కానీ ఇంత సులభంగా అవి వుంటాయని భావించను. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మరిన్ని ఉపయోగకరమైన ప్రయోగాలు చేస్తా రని ఆశిస్తూ –

  మీ,
  సతీష్.

 12. ఈ వుపకరణం చాల బాగుంది
  ఒక మంచి పనిలొ మనం పాలుపంచుకొ లెక పోయినా వెన్ను తట్టి వారిని ప్రొస్త్సహిచడం కూడ మంచిది అని అనుకుంటు
  ఈ క్రుషి లొ భాగం వున్న అందరికి

  క్రుతగ్యతలు

 13. ఇంత సులభంగా తెలుగులో వ్రాసుకునే దానికి మీరు సృస్టించిన లేఖిని ద్వారా తెలుగు భాషాభివ్రుద్దికి మీరు చేసిన కృషి అభినందనీయం. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమయిన పనులు, ఉపకరణాలు చేసేదానికి భగవంతుడు మీకు అయుష్హు,ఆరోగ్య,ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ…మరొక్కసారి మీకు అభినందనలు.

 14. నా బ్లాగింగ్‌కు, తెలుగులో నా ఇతర ఫ్రీలాన్సింగ్ రచనలకు పెద్ద ఆలంబన ‘లేఖిని.’

  లేఖిని లేకుండా తెలుగులో నేనింత స్వేచ్చగా, విరివిగా రాసేవాన్నికాదు అన్నది అతిశయోక్తి కాని నిజం.
  లేఖిని లేకుండా డిజిటల్‌గా నేను తెలుగు రాయలేను అన్నది కూడా నిజం.

  వీవెన్ గారికి అభినందనలు… అభివందనాలు. 🌷🌷

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.